స్మార్ట్‌ పల్స్‌ సర్వేను పూర్తి చేయండి | Complete Smart pulse survey quickly | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పల్స్‌ సర్వేను పూర్తి చేయండి

Published Sat, Oct 29 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

స్మార్ట్‌ పల్స్‌ సర్వేను పూర్తి చేయండి

స్మార్ట్‌ పల్స్‌ సర్వేను పూర్తి చేయండి

నెల్లూరు(పొగతోట): స్మార్ట్‌ పల్స్‌ సర్వేను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్‌ఏ అనిల్‌చంద్రపునేట జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అ«ధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పేర్లు నమోదు చేసుకోని ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 72 శాతం మాత్రమే సర్వే పూర్తి అయిందన్నారు. గ్రామాల్లో లేని వారి పేర్లు నమోదు చేసుకుని, వారి కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లను అందుబాటులో ఉంచి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఏ మహమ్మద్‌ఇంతియాజ్, డీఆర్‌ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్‌డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement