స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట):
స్మార్ట్ పల్స్ సర్వే త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్‌ఏ అనిల్‌చంద్రపునేఠ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్‌ఏ మాట్లాడారు. వంద శాతం సర్వే పూర్తి చేసి వివరాలు అప్‌లోడ్ చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్, డీఆర్‌ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్‌డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు.