స్మార్ట్ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలి
నెల్లూరు (పొగతోట) : ప్రజాసాధికర సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)ను త్వరితగతిన పూర్తిచేఽయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో సర్వే జాప్యం జరుగుతోందన్నారు. నెల్లూరు జిల్లాలో గత నెలలో మూడుశాతం మాత్రమే సర్వే జరిగిందన్నారు. నీరు–చెట్టు, వనం–మనం, ప్రకృతి పిలుస్తోంది తదితర కార్యక్రమాలను పటిష్టంగా అమలుజేయాలని సూచించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు గుంటూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.