
సాక్షి, అమరావతి : ఆంధ్రపదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా అనిల్ చంద్ర పునేత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మాజీ సీఎస్ దినేష్‌కుమార్ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సీఎస్‌ను కలిసి అభినందనలను తెలిపారు. తిరుమల, శ్రీశైలం, దుర్గ గుడి వేదపండితులు పునేతను ఆశ్వీరదించారు. ప్రజల సంతోషం, ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం కృషి చేస్తాననని పునేత చెప్పారు. టీం వర్క్‌తో ముందుకు వెళ్తు ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. 2019 మే 31వరకు అనిల్ చంద్ర పునేత సీఎస్‌గా కొనసాగనున్నారు.