ఈసీ ముందుకు ఏపీ సీఎస్‌, డీజీపీ | AP CS and DGP appeared before the Central Election Commission | Sakshi
Sakshi News home page

ఈసీ ముందుకు ఏపీ సీఎస్‌, డీజీపీ

Published Thu, May 16 2024 4:35 PM | Last Updated on Thu, May 16 2024 6:51 PM

AP CS and DGP appeared before the Central Election Commission

సాక్షి, ఢిల్లీ:  ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసు­కోవ­టాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వా­లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.

కాగా, పోలింగ్‌ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీ­సులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరి­గ­ణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు.

సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయ­డంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యం­త్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేక­పో­వడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకు­న్నట్లు పేర్కొంటున్నారు.

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement