KS Jawahar Reddy Appointed New Chief Secretary Of Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీ నూతన సీఎస్‌గా కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి.. ఉత్తర్వులు జారీ

Published Tue, Nov 29 2022 4:50 PM | Last Updated on Tue, Nov 29 2022 6:31 PM

KS Jawahar Reddy Appointed New Chief Secretary Of Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి నియామకమయ్యారు. కొత్త సీఎస్‌గా జవహర్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. 

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా కె.ఎస్‌ జవహర్‌ రెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. ముందుగా సీఎస్‌ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ జవహర్‌రెడ్డి.. ప్రస్తుతం సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement