
అనిల్ చంద్ర పునేత(పాత చిత్రం)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత నియామకం వివాదాస్పదంగా మారింది. సీనియరిటీని పక్కకుపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌లలో 1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యం అందరికంటే సీనియర్ అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు సీఎస్‌గా అవకాశం ఇవ్వలేదు. ఆయనను కాదని.. 1984 బ్యాచ్‌కు చెందిన అనిల్ చంద్రను సీఎస్‌గా నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కూడా చంద్రబాబు ఎల్వీ సుబ్రమణ్యంకు అవకాశం ఇవ్వలేదు. ఈ విధంగా సీనియర్ అధికారులను అవమానించడంపై ఏపీలోని ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
కాగా, ఆదివారం ఏపీ నూతన సీఎస్‌గా అనిల్ చంద్ర పునేత బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మాజీ సీఎస్ దినేష్‌కుమార్ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనిల్ చంద్ర 2019 మే 31వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.