
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది. నూతన జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎస్ నీలం సాహ్ని ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆరుశాఖల అధికారులు సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి.. ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు.
(దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment