
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం ఆర్డీవోగా ఆర్. గోవిందరావు , కడప మున్సిపల్ కమిషనర్‌గా యు.రంగ స్వామి, రెవెన్యూ శాఖ ముఖ్య సలహాదారుకు ఓఎస్‌డీగా జి. నరసింహులు, పులిచెంతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా జి. వసంత బాబు, శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఎస్ లవన్నను బదిలీ చేశారు. తదుపరి పోస్టింగ్ కోసం కె.ఎస్ రామరావును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment