Deputy Collectors transfers
-
TS: భారీగా ఎమ్మార్వోల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఓటమి వెనుక ఆర్టీసీ కార్మికుల కృషి -
AP: భారీగా ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఏపీలో 11 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం ఆర్డీవోగా ఆర్. గోవిందరావు , కడప మున్సిపల్ కమిషనర్‌గా యు.రంగ స్వామి, రెవెన్యూ శాఖ ముఖ్య సలహాదారుకు ఓఎస్డీగా జి. నరసింహులు, పులిచెంతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా జి. వసంత బాబు, శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఎస్ లవన్నను బదిలీ చేశారు. తదుపరి పోస్టింగ్ కోసం కె.ఎస్ రామరావును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పోస్టింగ్ కోసం వేచి ఉన్న 8 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శనివారం ఉత్తర్వులిచ్చారు. ప్రకాశం జిల్లా జేసీగా (ఆసరా–సంక్షేమం) పనిచేస్తున్న బాపిరెడ్డిని నెల్లూరు జిల్లా జేసీగా (ఆసరా–సంక్షేమం) బదిలీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో అటవీ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.కృష్ణవేణిని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా (ఆసరా–సంక్షేమం) నియమించారు. -
ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పేర్కొన్న బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.(చదవండి: వచ్చేనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు పుష్కరాలు) బదిలీలు- డిప్యూటీ కలెక్టర్ల పేర్లు 1. వి. సుబ్బారావు 2. డి. కోదండరామిరెడ్డి 3. వీకే సీనా నాయక్ 4. ఎన్వీవీ సత్యనారాయణ 5. టి. భాస్కర్ నాయుడు 6. ఎ. లక్ష్మీ కుమారి 7. ఏబీవీఎస్బీ శ్రీనివాస్ 8. ఎం.డి. ఝాన్సీరాణి 9. సి. చంద్రశేఖర్ రెడ్డి 10.ఎం. వెంకట సుధాకర్ 11. పి. భవానీ 12. జె. శివ శ్రీనివాసు 13. ఎస్. సరళా వందనం 14. కె. రాములు నాయక్ 15. కె. అడ్డయ్య 16. కిరణ్ కుమార్ 17. ఎం. శ్రీనివాసులు 18.ఎ. చంద్ర మోహన్ 19. బి. శ్రీనివాసరావు 20. ఆర్. ప్రభాకర్‌రావు 21. డి. పెద్దిరాజు 22. డి. వెంకటేశ్వరరావు 23. జి. శ్రీనివాసులు 24. హెచ్. సుబ్బరాజు 25. వైవీ సత్య భాస్కర్ 26. శ్రీకాంత్ ప్రభాకర్ -
ఏపీలో 48 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 48 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ చేసిన అధికారులకు వివిధ శాఖల్లో అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌కు ప్లానింగ్ సెక్రటరీ సీఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. సుమిత్‌కుమార్‌కు ఏపీ ఫైబర్‌నెట్ ఎండీతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌళిక సదుపాయాల కామర్స్ విభాగం, ఎం హరినారాయణ్‌కు సీసీఎల్ స్పెషల్ కమిషనర్‌తో పాటు పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శి , వి. కోటేశ్వరమ్మకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, పీసీసీఎస్ కార్యాలయానికి సంజయ్ గుప్తాను బదిలీ చేసింది. -
ఎన్నికల బది‘లీల’లు!
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్దఎత్తున డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేచోట మూడేళ్లకు పైగా ఉంటున్న, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు ఎవరినీ సొంత జిల్లాల్లో ఉంచరాదని.. మూడేళ్లకుపైగా ఒకే స్థానంలోనూ, గత ఎన్నికల్లో పనిచేసిన ప్రాంతంలోనూ ఉంచరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) స్పష్టంచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టింది. మొత్తం 101 మంది డిప్యూటీ కలెక్టర్లకు బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తూ సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీల్లో పైరవీలకు పెద్దపీట వేసింది. అనుకూలురైన అధికారులు కావాలంటూ కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన సిఫార్సులకు ఆమోద ముద్ర వేసింది. తమకు నచ్చని అధికారులను ఏడాది కూడా పూర్తికాకపోయినా అప్రధాన పోస్టులకు బదిలీ చేశారు. డిప్యూటీ కలెక్టరు పోస్టులు స్టేట్ కేడర్‌కు చెందినవైనందున రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు. దీనిని అవకాశంగా చేసుకున్న టీడీపీ నేతలు తమకు అనుకూలురును కేటాయించాలని సిఫార్సులు చేశారు. ‘ఫలానా అధికారి మనకు అనుకూలంగా వ్యవహరిస్తాడు. మా జిల్లాలో ఉండటానికి వీల్లేనందున మీ జిల్లాకు వేయించుకో బాగా ఉపయోగపడతాడు’ అని కోస్తాంధ్రకు చెందిన ఒక మంత్రి మరో మంత్రికి సూచించారు. దీంతో ఆ మంత్రి వెంటనే ముఖ్యనేత పేషీలో మాట్లాడి తన జిల్లాకు పోస్టింగ్ వేయించుకున్నారు. ముఖ్యనేత పేషీ ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిందనే అంశం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బదిలీ ఉత్తర్వులను కూడా సెలవు రోజైన ఆదివారం రాత్రి జారీ చేయడం గమనార్హం. ఈ బదిలీల్లో అప్రధాన పోస్టుల్లో ఉన్న తొమ్మిది మందికి అత్యంత ముఖ్యమైన రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు)గా పోస్టింగులు లభించాయి. తహసీల్దార్లకు డిప్యూటి కలెక్టర్లుగా తాత్కాలిక పదోన్నతి కల్పనలో సీనియారిటి, మెరిట్లను కాలరాస్తూ కావాల్సిన వారికి పదోన్నతులు కట్టబెట్టారని విమర్శలు వచ్చిన రెండు మూడు రోజులకే డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లోనూ అలాంటి విమర్శలే వెల్లువెత్తాయి. ఎంపీడీవోల బదిలీల్లోనూ ఇదే తంతు: ఎన్నికల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ శాఖలోనే రెండు రోజుల క్రితం ఏకంగా 448 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. అయితే, సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన ఎంపీడీవోలను తమకు కావాల్సిన ప్రదేశాల్లోకి బదిలీ చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుకూలంగా ఉండరు అన్న వారిని సుదూర ప్రాంతాలకు పంపించారు. ఇందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను టార్గెట్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలలో ఎక్కువ మందిని పక్కనే ఉన్న కృష్ణా, ప్రకాశం జిల్లాలకు బదిలీ చేసి, మరికొందరిని తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ చేశారు. వారిలో ఏడుగురు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నట్లు సమాచారం. అలాగే, ప్రకాశం జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలలో కొందర్ని పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు బదిలీచేసి, నెల్లూరుకు బదిలీ చేయాలని కోరుకున్న వారిని కర్నూలు జిల్లాకు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. సొంత సామాజిక ఉద్యోగికి అందలం నిబంధనలకు విరుద్ధమని ఐఏఎస్ అధికారి పేర్కొన్నా సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ స్వయంగా జోక్యం చేసుకుని ఓ ఎంపీడీవో ఉద్యోగిని గ్రామీణాభివృద్ధి శాఖకు రెగ్యులర్ ఉద్యోగిగా బదలాయించారు. అంతేకాక.. ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏకంగా డిప్యూటీ డైరక్టర్ పదవి కట్టబెట్టడం ఆ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంవల్లే ఇది జరిగిందని సహచర ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద ప్రైవేట్ కార్యదర్శి (పీఎస్)గా పనిచేస్తున్న పి. రోశయ్య ఎంపీడీవో అధికారే అయినప్పటికీ.. ఇటీవల కన్ఫర్డ్ ఐఏఎస్‌ల పదోన్నతుల్లో తనను ఐఏఎస్ హోదాకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అందుకు కావాల్సిన అర్హతలు లేని కారణంగా ఆ దరఖాస్తును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇప్పుడు అదే మరో ఎంపీడీవో ఉద్యోగిని పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు రెగ్యులర్ ఉద్యోగిగా బదలాయింపుతోపాటు ఉన్నత పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి నోట్‌ఫైల్‌లో పేర్కొన్నప్పటికీ మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు ఇద్దరూ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారంతో ఆమోదం తెలిపారు. -
సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ముదిరిన వివాదం
- స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై కేఈ అసంతృప్తి - అయినా ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిల మధ్య బదిలీల యుద్ధం ముదురుతోంది. రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న కేఈ కృష్ణమూర్తికి తెలియకుండా 12 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇలా ఎందుకు చేస్తున్నారని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మను మంత్రి కేఈ గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఒత్తిడి మేరకు ఇందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసి మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వ్యవహారాన్ని శర్మ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. కేఈ ఎదురుదాడికి సిద్ధమయ్యారని తెలుసుకుని సీఎం ఆ 12 మంది అధికారుల బదిలీ ఫైలును తాత్కాలికంగా ఆపాలని ఆదేశించారు. అయితే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ సి.చంద్రశేఖరరెడ్డిని బదిలీ చేసి, ఆ స్థానంలో బి.కృష్ణ భారతిని నియమిస్తూ ఆదేశాలివ్వాలని సూచించినట్టు తెలిసింది. తక్కిన 11 మందివి నిలిపివేసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఆ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కేఈ బుధవారం శర్మను నిలదీసినట్లు తెలిసింది. -
కొత్త ఆర్డీవోలు వీరే..
- హైదరాబాద్‌కు నిఖిల.. సికింద్రాబాద్ కు శర్మ - కొత్త ఆర్డీవోల నియామకం త పలువురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు సాక్షి, సిటీబ్యూరో : కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండ్రోజుల్లోనే కీలకమైన రెవెన్యూ విభాగంలో భారీగా బదిలీలు జరిగాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు పాత డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం తప్పలేదు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌లు దక్కని డిప్యూటీ కలెక్టర్లను తదుపరి పోస్టింగ్ నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగరంలో జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఇలా ఉన్నాయి.