
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 48 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ చేసిన అధికారులకు వివిధ శాఖల్లో అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌కు ప్లానింగ్ సెక్రటరీ సీఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. సుమిత్‌కుమార్‌కు ఏపీ ఫైబర్‌నెట్ ఎండీతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌళిక సదుపాయాల కామర్స్ విభాగం, ఎం హరినారాయణ్‌కు సీసీఎల్ స్పెషల్ కమిషనర్‌తో పాటు పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శి , వి. కోటేశ్వరమ్మకు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, పీసీసీఎస్ కార్యాలయానికి సంజయ్ గుప్తాను బదిలీ చేసింది.