- స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై కేఈ అసంతృప్తి
- అయినా ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిల మధ్య బదిలీల యుద్ధం ముదురుతోంది. రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న కేఈ కృష్ణమూర్తికి తెలియకుండా 12 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇలా ఎందుకు చేస్తున్నారని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మను మంత్రి కేఈ గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఒత్తిడి మేరకు ఇందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసి మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో వ్యవహారాన్ని శర్మ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. కేఈ ఎదురుదాడికి సిద్ధమయ్యారని తెలుసుకుని సీఎం ఆ 12 మంది అధికారుల బదిలీ ఫైలును తాత్కాలికంగా ఆపాలని ఆదేశించారు. అయితే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ సి.చంద్రశేఖరరెడ్డిని బదిలీ చేసి, ఆ స్థానంలో బి.కృష్ణ భారతిని నియమిస్తూ ఆదేశాలివ్వాలని సూచించినట్టు తెలిసింది. తక్కిన 11 మందివి నిలిపివేసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఆ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కేఈ బుధవారం శర్మను నిలదీసినట్లు తెలిసింది.
సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ముదిరిన వివాదం
Published Thu, Sep 24 2015 2:45 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement