
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పోస్టింగ్ కోసం వేచి ఉన్న 8 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శనివారం ఉత్తర్వులిచ్చారు.
ప్రకాశం జిల్లా జేసీగా (ఆసరా–సంక్షేమం) పనిచేస్తున్న బాపిరెడ్డిని నెల్లూరు జిల్లా జేసీగా (ఆసరా–సంక్షేమం) బదిలీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో అటవీ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.కృష్ణవేణిని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా (ఆసరా–సంక్షేమం) నియమించారు.