Adityanath Das
-
పబ్లిక్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్‌లకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. అయితే భవిష్యత్తులో వీరి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతినిస్తే అప్పుడు కేసు విచారణకు స్వీకరించాలని ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఈడీకి సూచించింది. అయితే ఈ వెసులుబాటు ప్రతివాదులైన అధికారులు లేవనెత్తే న్యాయపరమైన అభ్యంతరాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలవి ‘ఈడీ ఫిర్యాదులోని అంశాలన్నింటినీ మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇండియా సిమెంట్స్‌కు అదనంగా 10 లక్షల లీటర్ల నీటిని కేటాయించారన్నదే ఆదిత్యనాథ్ దాస్‌పై ఉన్న ఆరోపణ. ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమనుకున్నా, నీటి కేటాయింపులు తన విధి నిర్వహణలో భాగంగానే చేశారు. ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాలు కేటాయించారన్నది బీపీ ఆచార్యపై ఉన్న ఆరోపణ. ఇది కూడా నిజమనుకున్నా, ఆ నిర్ణయం కూడా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నదే. వారి విధి నిర్వహణకు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఉంది. ఇద్దరు అధికారులు కూడా పబ్లిక్ సర్వెంట్లే. వీరికి సీఆర్పీసీ సెక్షన్ 197(1) వర్తిస్తుంది. ఈ సెక్షన్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వచ్చే నేరాలకు సైతం వర్తిస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలో ఏ నిబంధన కూడా సెక్షన్ 197(1)కు విరుద్ధంగా లేదు. అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు, చేపట్టిన చర్యలకు గాను అధికారులను ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు ఈ సెక్షన్‌ను తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం అనుమతినిస్తే మాత్రం ప్రాసిక్యూట్ చేయవచ్చు. అయితే ఈ కేసులో అలా జరగలేదు. అయినప్పటికీ ఈడీ నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం తీసుకుంది. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు. అందువల్లే బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్లపై కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.ఈడీ కేసుల పూర్వాపరాలుఇండియా అరబిందో, హెటిరో గ్రూపులకు జడ్చర్ల ఎస్ఈజెడ్లో 150 ఎకరాల భూమి కేటాయించడంలో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య కీలక పాత్ర పోషించారంటూ ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అలాగే ఇందూ టెక్‌జోన్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంలోనూ ఆచార్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌పై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులను కొట్టేస్తున్నట్లు 2019 జనవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ 2019 జూలైలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరిగా గత నెల 15న పూర్తి స్థాయి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బుధవారం తన తీర్పును వెలువరించింది. a -
ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలను శిష్యుడు రేవంత్‌రెడ్డి పాటిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు కర్రపెత్తనం ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్నటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్ది కీలకపాత్ర అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా సలహాదారుగా నియమించుకున్నారని ఆయన ప్రశ్నించారు.అధికారిగా ఆయన పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రలోని కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంతో ఆయనది కీలకపాత్ర అని అన్నారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ
-
సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించగా, ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చదవండి: (సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష) -
ఏపీ సచివాలయంలో ఆదిత్యనాథ్ దాస్‌కు ఘనంగా వీడ్కోలు
-
Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు
మానవ తప్పిదాలు జరగొద్దు ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని, అందువల్ల వంశధార, నాగావళి తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని విడుదల చేయాలని, మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. దేవుడి దయవల్ల హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో గులాబ్ తుపాను లేదని, అయితే అతి భారీ, భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద వెంటనే రూ.ఐదు లక్షల చొప్పున చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితులకు సాయం అందించడంలో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని, డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యతగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. తుపాను బాధితులకు నాణ్యమైన ఆహారంతో పాటు మందులు, మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. పది రూపాయలు ఎక్కువైనా నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఉదారంగా ఉండాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుంచి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఇందులో పాల్గొన్నారు. తుపాను అనంతర పరిస్థితులు.. సహాయ చర్యలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రతి అరగంటకూ సమాచారం సేకరిస్తూ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అక్కడే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్దాస్కు సూచించారు. సీఎస్, జిల్లాల అధికారులతో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ విశాఖలో వేగంగా నీటి పంపింగ్.. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. సహాయం చేయడంలో డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యతతో కూడి ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయ, పునరావాస శిబిరాలను ప్రారంభించాలని సూచించారు. విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని, ఆయా కుటుంబాలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1,000 చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షపు నీరు కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, జనరేటర్లతో వాటర్ స్కీంలు నిర్వహించాలని ఆదేశించారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలి పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ చేయాలని, నష్టం అంచనాలు వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. సజావుగా రవాణా: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శ్రీకాకుళం నుంచి సమీక్షలో పాల్గొన్న సీఎస్ అదిత్యనాథ్‌దాస్ తొలుత తుపాను అనంతర పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గంటకు 80 – 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని తెలిపారు. అక్కడక్కడా విరిగిపడ్డ చెట్లను తొలగించామని, జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాల్లో రవాణాకు ఎక్కడా ఆటంకం లేదని వెల్లడించారు. అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో నిమగ్నమై అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. విశాఖ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశామని వివరించారు. – క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి (డిజాస్టర్ మేనేజ్మెంట్) వి. ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ డీజీ ఏ.రవిశంకర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్
సాక్షి, అమరావతి: న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రి హోదాలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా ఆదిత్యనాథ్ దాస్ పనిచేయనున్నారని జీఏడీ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వుల్లో తెలిపారు. -
రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఇతర సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై బుధవారం ఆయన సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టులకు భూసేకరణ పనులను నిర్దేశిత గడువు ప్రకారం వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగతా వ్యయాన్ని రైల్వే శాఖ భరించి ఆయా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కోరారు. కడప–బెంగళూరు రైల్వే లైను ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రతి నెల ప్రగతి సమీక్షలో సమీక్షిస్తున్నందున ఆ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సకాలంలో నిధులు వెచ్చించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్ షేరింగ్ విధానంలో భరించాల్సిన నిధులను సకాలంలో వెచ్చించి ఆయా రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు.. భూసేకరణ, పెండింగ్ అంశాలను వివరించారు. అంతకుముందు విజయవాడ–ఖాజీపేట మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం, కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, గుంటూరు–గుంతకల్లు, కడప–బెంగళూరు, భద్రాచలం–కొవ్వూరు, నిడదవోలు–భీమవరం, భీమవరం–విజయవాడ రైల్వే లైను డబ్లింగ్, విద్యుదీకరణ పనులు, పలు ఆర్ఓబీల నిర్మాణం తదితర ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. -
రాజకీయ నేతలకు భిన్నంగా విద్యకు సీఎం జగన్ ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: విద్యారంగంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ‘సయంట్’వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం విజయవాడలో మొదలైన ‘వాణిజ్య ఉత్సవ్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా రాజకీయ నాయకులు విద్యారంగాన్ని పట్టించుకోరని, సీఎం జగన్ దీనికి భిన్నంగా కీలక సంస్కరణలు చేపట్టారని ప్రశంసించారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా తొలిదశలో 15,000కిపైగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడం, అమ్మ ఒడి, విద్యా కానుక లాంటి కార్యక్రమాల అమలు, 26 స్కిల్ కాలేజీలు, 2 స్కిల్ వర్సిటీల ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. పరిశోధనలకు నిధులివ్వాలి.. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ప్రతి ఎనిమిది ఉద్యోగాలకు ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్కిల్ కాలేజీలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని మోహన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని చెప్పారు. కేవలం చదువుపైనే కాకుండా ఉపాధి కల్పన దిశగా నవతరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పరిశోధన రంగానికి భారీగా నిధులు కేటాయించాలన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజ రాష్ట్రంలో 19 భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులున్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం వల్ల పలు దేశాలకు వేగంగా ఎగుమతులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి వ్యయాన్ని తగ్గించడంతో పాటు నష్ట భయాన్ని నివారించేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. 600 మందికిపైగా పాల్గొంటున్న ఈ ఎక్స్పోర్ట్ కాన్క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజలో ఉందని, కోవిడ్ ఇబ్బందులున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. -
డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవితా సంకలనాన్ని విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ పుస్తకాన్నితాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ విడుదల చేశారు. ఆదిత్యనాథ్ దాస్ సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్‌ను సీఎంకు చీఫ్ సెక్రటరీ బహుకరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రచురణకర్త రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. చదవండి: ఏపీకి పార్లమెంట్ కమిటీ ప్రశంసలు ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
MPTC, ZPTC Elections: కౌంట్‌డౌన్!
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీనే ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు అనుమతించడంతో 19వ తేదీన కౌంటింగ్ జరపనున్నట్టు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో పరిషత్ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం 2020 మార్చి 21వ తేదీన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి అదే ఏడాది మార్చి 24న కౌంటింగ్ పూర్తి చేయాలి. కానీ నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిపోయి అభ్యర్ధుల తుది జాబితా ఖరారైన తర్వాత అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా పేరుతో మార్చి 15వ తేదీన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే పరిషత్ ఎన్నికలు జరపకుండా కాలయాపన చేశారనే విమర్శలున్నాయి. అనంతరం నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి 8వ తేదీన ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. -
ఇద్దరు సీఎస్ల నియామకానికి నెల ముందే ఒకే జీవో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి టీడీపీ, దాని అనుకూల మీడియా పచ్చి అబద్ధాలు వల్లిస్తూ బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి సీఎస్‌గా సమీర్‌శర్మ నియమితులైన విషయం తెలిసిందే. అయితే సీఎస్ నియామకంపై 20 రోజులు ముందు జీవో ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదంటూ ఓ దినపత్రిక దుష్ప్రచారం చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇద్దరు సీఎస్‌లను నియమిస్తూ ఒకే జీవో జారీ చేయడం టీడీపీ అనుకూల మీడియాకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా అజేయ కల్లంను సీఎస్‌గా నియమిస్తూ జారీ చేసిన జీవోలో ఆయన పదవీ కాలం మరో నెల ఉండగానే తదుపరి సీఎస్‌గా దినేశ్‌కుమార్‌ను అందులోనే పేర్కొన్నారు. ఈమేరకు 27–02–2017న జీవో 456 ఇచ్చారు. మరి అప్పుడు సంప్రదాయం, గౌరవం లాంటివి గుర్తు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క జీవో.. ఇద్దరు సీఎస్‌లు టీడీపీ హయాంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శిగా ఉన్న ఎన్. శ్రీకాంత్ జీవో ఆర్టీ 456 జారీ చేశారు. అప్పటి సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ 28–02–2017న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అజేయ కల్లంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. కల్లం 31–03–2017న పదవీ విరమణ చేయనున్నందున 01–04–2017 నుంచి సీఎస్‌గా దినేశ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు అదే జీవోలో పేర్కొన్నారు. ఓ సీఎస్ నియామకం రోజునే, ఆయన పదవీ విరమణకు ఇంకా నెల సమయం ఉండగానే అదే జీవోలో తదుపరి సీఎస్ దినేశ్‌గా పేర్కొంటూ చంద్రబాబు సర్కారు జీవో ఇచ్చిందని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ విషయాన్ని మభ్యపుచ్చుతూ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారంటూ అసత్య కథనాలు ప్రచురించడం ద్వారా టీడీపీ అనుకూల మీడియా విలువలకు పాతరేసిందని పేర్కొంటున్నాయి. సీఎస్‌గా అజేయ కల్లం నియామక జీవోలోనే పదవీ విరమణ గురించి ప్రస్తావించడంకూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందని వ్యాఖ్యానిస్తున్నాయి. -
AP: తదుపరి సీఎస్‌గా సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా డా.సమీర్ శర్మ నియమితులు కానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి సీఎస్‌గా డా.సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర ప్రణాళిక, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఎస్సీల సమగ్రాభివృద్ధిలో రాష్ట్రానికి రెండు అవార్డులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన మూడు అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంలోని మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటికి ఎంపికైన మూడింటిలో రెండు జిల్లాలు మన రాష్ట్రానివే కావడం విశేషం. ఇందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. దేశంలోనే అత్యున్నత పనితీరు షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఎక్కువ మంది నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన.. సామాజిక, ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంలో మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నతంగా పని చేస్తోందని కేంద్రం ప్రశంసించింది. ఆ ప్రాంతాల్లో బడికి దూరంగా ఉండే పిల్లలను బడులలో చేర్పించడం, అక్కడి పిల్లలు, మహిళలకు పౌష్టికాహారం అందజేయడం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ల మంజూరు, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవనోపాధిని పెంచడంతో పాటు ఆ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఎక్కువగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాల పరిధిలో 19,172 గ్రామాల్లో ఈ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా 11 జిల్లాల పరిధిలోని 501 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు గ్యాప్ ఫండింగ్ రూపంలో ప్రత్యేకించి రూ.20 లక్షల చొప్పున అదనంగా ఒక్కొక్క గ్రామానికి ప్రభుత్వం నిధులిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చినప్పటికీ.. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే మన రాష్ట్రంలోఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు తీరు ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ విభాగం జిల్లాల వారీగా అవార్డులను ప్రకటించింది. సీఎస్‌కు లేఖ రాసిన కేంద్ర కార్యదర్శి మొత్తం మూడు అవార్డులకు గాను రెండు అవార్డులు ఏపీకే దక్కినట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు బుధవారం లేఖ రాశారు. ప్రభుత్వానికి, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల అధికారులకు ఆ లేఖలో అభినందనలు తెలియజేశారు. -
ఎంఎస్ఎంఈల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపుపై ప్రభుత్వం దృష్టిసారించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోని ఎంపిక చేసిన క్టస్టర్లలో ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కేంద్ర విద్యుత్‌శాఖకు లేఖ రాశారు. ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండాలనే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ (ఐఎన్డీసీ) లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సాంకేతికతను వినియోగించటం ద్వారా పరిశ్రమల్లో ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోగలమని తెలిపారు. తద్వారా ఇంధనాన్ని పొదుపు చేస్తూ, కాలుష్యాన్ని నియంత్రించటంతోపాటు అధిక ఉత్పాదకతను సాధించగలుగుతామని వివరించారు. తొలిదశలో మత్స్య, రిఫాక్టరీ, ఫౌండ్రీ క్లస్టర్లలో.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సహకారంతో రాష్ట్రంలోని కొన్ని భారీ పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం పాట్ (పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్)ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీనిద్వారా ఇప్పటివరకు 3,430 మిలియన్ యూనిట్లకు సమానమైన 0.295 ఎంటీవోఈ (మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్)ని ఆదాచేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు. ఇంధన పొదుపునకు ఎంఎస్ఎంఈ రంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)తో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 3 ఎంఎస్ఎంఈ యూనిట్లలో (మత్స్య, ఫౌండ్రీ, రిఫాక్టరీల్లో) అధ్యయనం నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సెక్టారులో ఇంధనాన్ని పొదుపు చేసేందుకు, నూతన సాంకేతికత మెరుగుదలకు పెద్ద ఎత్తున అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. దీంతో తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్య, రిఫాక్టరీ, ఫౌండ్రీ క్లస్టర్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని బీఈఈ ద్వారా అందించాలని కేంద్రాన్ని కోరింది. రూ.2,014 కోట్ల విద్యుత్ ఆదా రాష్ట్రంలో ఏడాదికి సరాసరి 67,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండు ఉండగా.. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధన పరిరక్షణ చర్యల ద్వారా 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉంది. ఎల్ఈడీ వీధిలైట్లు, వ్యవసాయ, పరిశ్రమల రంగాల్లో అమలు చేసిన ఇంధన సామర్థ్య కార్యక్రమాలు తదితరాల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారం 2,932 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. దీనివిలువ రూ.2,014 కోట్ల వరకు ఉంటుంది. మరిన్ని ఇంధన సామర్థ్య చర్యలు చేపట్టడం వల్ల మరో 14 వేల మిలియన్ యూనిట్లను ఆదా చేసేందుకు అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 35 శాతం పారిశ్రామిక రంగంలోనే వినియోగం అవుతోంది. – ఎన్.శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి -
2022కల్లా ప్రతి పల్లెకు బ్రాడ్‌బ్యాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాలతో పాటు ప్రతి గ్రామానికీ మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో సోమవారం స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ రెండో సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 2022 నాటికి నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద ప్రతి గ్రామానికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు దానిని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటీ విధానం కూడా ఇందుకు ఎంతో దోహదపడుతుందని సీఎస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే ప్రక్రియలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణకు అటవీ శాఖ క్లియరెన్సులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌లు రామకృష్ణ, రాఘవేంద్రరావు తదితరులు కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణా బోర్డు పరిధిలోకి ‘వెలిగొండ’ను తేవాలి
సాక్షి, అమరావతి : ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ ప్రాజెక్టును చేర్చాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం లేఖ రాశారు. లేఖలోని ప్రధానాంశాలివీ.. ► శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లా్లల్లో 4.47 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా వెలిగొండ ప్రాజెక్టును 2004లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ► రాష్ట్ర విభజన నేపథ్యంలో.. నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు విభజన చట్టంలో 11వ షెడ్యూలులో ఈ ప్రాజెక్టును చేర్చింది. ► కృష్ణా బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చలేదు. ► విభజన చట్టం ఆమోదించిన ఈ ప్రాజెక్టును తక్షణమే గెజిట్ నోటిఫికేషన్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి. -
ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సచివాలయంతో పాటు శాఖాధిపతులు, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తక్షణం సచివాలయంను అన్ని శాఖలతో పాటు శాఖాధిపతులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆదేశిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. గతంలో సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో బయోమెట్రిక్ హాజరు ఉందని, అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో బయోమెట్రిక్ హాజరును నిలుపుదల చేసినట్లు మెమోలో పేర్కొన్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని ఇటీవల జరిగిన కార్యదర్శులు సమావేశంలో నిర్ణయించినట్లు మెమోలో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు నెలవారీ నివేదికలను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు పరికరాలు సక్రమంగా పనిచేసేలా ఐటీ శాఖతో పాటు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సులభతర వాణిజ్యంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలి: సీఎస్ ఆదిత్యనాథ్
సాక్షి, అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ అదే స్థాయిలో కొనసాగించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్ (ఎంఆర్‌సీబీ) అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌ను వాస్తవికంగా ఆచరణలో పెట్టే ప్రక్రియలో భాగంగా రాబోయే తరాలకు తగ్గట్టుగా సేవలందించే విషయంలో తలెత్తే సమస్యల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా వివిధ సేవల్ని ఆన్లైన్లో పారదర్శకంగా నిర్ధిష్ట కాలవ్యవధిలో అందేలా చర్యలు తీసుకోనుందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల వారీగా అందించే వ్యాపార, వాణిజ్య సేవలను వినియోగదారులకు సకాలంలో ఒక నిరి్ధష్ట సమయం ప్రకారం అందే విధమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని, శాఖల వారీగా ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామనే విషయాలు వినియోగదారులకు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు నోడల్ అధికారుల వివరాలను అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు సంబంధిత అసోసియేషన్లతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు కనీసం 1 శాతం వినియోగదారులతో స్వయంగా మాట్లాడి వారు అడిగే సమస్యలు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు దశల్లో 390 సమస్యలను గుర్తించి వాటిని 285కు తగ్గించామని తెలిపారు. పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం అజెండా అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చదవండి: ‘‘జై జగన్ మామయ్య.. జై జై జగన్ మామయ్య’’ -
కార్యదర్శులతో సీఎస్ ఆదిత్యనాథ్ సమీక్ష
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యదర్శులతో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, హాజరు, ఈ-ఆఫీస్ దస్త్రాలపై చర్చించారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. సచివాలయంలో యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ-ఫైల్స్ ఉన్నా.. వ్యక్తిగత దస్త్రాలపై వివరణ ఉండాలని అభిప్రాయపడ్డారు. జిల్లా, డివిజన్ స్థాయిలో ఈ-ఫైలింగ్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదిత్యనాథ్ ఆదేశించారు. -
కేసుల సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాజ్య విధానం
సాక్షి, అమరావతి: నూతనంగా తీసుకురానున్న రాష్ట్ర వ్యాజ్య విధానాన్ని (స్టేట్ లిటిగేషన్ పాలసీ) సమర్థవంతంగా అమలు చేస్తే కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో వ్యాజ్యాల అంశంపై న్యాయాధికారులు, కార్యదర్శులతో సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ స్టేట్ లిటిగేషన్ పాలసీని నిరంతరం పర్యవేక్షిస్తూ పటిష్టంగా అమలు చేస్తే కేసుల్లో జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ఈ విధానం వల్ల కేసుల వివరాలు ప్రభుత్వ న్యాయవాదులకు, ప్రభుత్వ శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని, తద్వారా సకాలంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉం టుందని చెప్పారు. తద్వారా కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని కూడా తగ్గించవచ్చన్నా రు. అదేవిధంగా రాష్ట్ర విచారణ సేవల (స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్)ను మరింత బలోపేతం చేసేందుకు వ్యాజ్య విధానం దోహదం చేస్తుం దని చెప్పారు. అందుకే ఏపీ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టనున్నట్టు తెలి పారు. దీనివల్ల జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంటుందన్నారు. సమన్వయంతోనే సత్వర పరిష్కారం సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాజ్య విధానం, ప్రభుత్వ శాఖల విధానాలు, నిబంధనల ఫ్రేమ్‌వర్క్, వ్యాజ్యాల దాఖలు స్థాయిలోనే సవాల్ చేసేలా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాజ్యాలపై నిర్ణీత కాల వ్యవధిలో సమీక్ష, వైఫల్యాలపై జవాబుదారీతనం తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆన్లైన్ కేస్ లోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు సమీక్షించారు. ప్రతి ప్రభుత్వ శాఖలో లైజన్ అధికారులు, లీగల్ ఆడ్వైజర్లను నియమించుకునే అంశంపై చర్చించారు. రాష్ట్ర ఆదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. -
ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్లపై హైలెవల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీడీఆర్పీ పనులన్నీ పూర్తి చేయాలి ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రూ.1,773 కోట్ల అంచనాలతో శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఏపీడీఆర్పీ ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీడీఆర్పీ) 4వ రాష్ట్రస్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశం సీఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. వాస్తవానికి ఈ పనులన్నీ 2015–2020 మధ్య పూర్తి చేయాల్సి ఉందని, అయితే కరోనా తదితర కారణాల వల్ల సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది వరకు గడువును పొడిగించిందని వివరించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఇక ఎప్పటిలానే ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక రెగ్యులర్‌గా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే ఈ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కార్యాలయాలు, ఉప కార్యాలయాలు, జిల్లా నియంత్రణలో ఉండే కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యాలయాలకు ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం సెలవు ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయిలో సచివాలయంతో పాటు శాఖాధిపతులు కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యాలయాలకు వారంలో ఐదు రోజులు పనిదినాల్లో భాగంగా 27–06–2021 నుంచి ఏడాది పాటు ప్రతి శని, ఆదివారాలు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. రెగ్యులర్ పనివేళలను తప్పనసరిగా పాటించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఇంధన పొదుపుపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి మేలు జరిగే చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీఈఈ అంచనా ప్రకారం రాష్ట్రంలో 67,500 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉండగా.. అందులో 16,875 మిలియన్ యూనిట్ల వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ డీఎస్ఎం, గ్రామ పంచాయతీల్లోని వీధి లైట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఏటీ, ఉజాలా తదితరాల ద్వారా 2,932 మిలియన్ యూనిట్లను ఆదా చేయగలిగామని పేర్కొన్నారు. దీని వల్ల రూ.2,014 కోట్ల ఆర్థిక భారం తగ్గిందని చెప్పారు. మరో 14,000 మిలియన్ యూనిట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీనికి తగినట్లుగా ఇంధన శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ అందుబాటు ధరల్లో విద్యుత్‌ను అందించాలనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని చెప్పారు. 2031 నాటికి దేశ ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశముందని, ఇందులో అత్యధిక భాగం ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
హక్కుల పరిరక్షణకే సుప్రీంకోర్టుకు..
సాక్షి, అమరావతి: ‘కృష్ణా బోర్డు ద్వారా కేంద్రం చట్టబద్ధంగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఇప్పటికే 62.59 టీఎంసీలను అక్రమంగా వాడుకుని నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇలా ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు వాటా నీరు దక్కకుండా చేస్తోంది. దాంతో ఇప్పటికే వృథాగా 7.1 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను పరిరక్షించుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం కన్పించలేదు’ అని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం లేఖ రాశారు. న్యాయబద్ధంగా విధులు నిర్వర్తించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇరుకున పెట్టడానికి కానే కాదని స్పష్టం చేశారు. తెలంగాణ దుందుడుకు చర్యల గురించి కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్ శక్తి శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం.. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉంటే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. -
'సీమ' ఎత్తిపోతలే శరణ్యం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని తోడేస్తున్న నేపథ్యంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ)కి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఎకో సెన్సిటివ్ జోన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో చేపట్టే ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు నివేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నేతృత్వంలో 15 మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో కూడిన ఈఏసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా డిజైన్ మేరకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నైలకు.. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ప్రాజెక్టుల ద్వారా 44 వేల క్యూసెక్కులే తీసుకెళ్లవచ్చునని, 854 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే అత్యవసరాలకు 6 వేల క్యూసెక్కులు తరలించవచ్చని ఈఏసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. తెలంగాణ సర్కార్ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదని, దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువల ద్వారా నీటిని తరలించలేని దుస్థితి నెలకొందని చెప్పారు. ఈ దుస్థితి అధిగమించడానికే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడు దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామన్నారు. దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి ఇది అత్యావశ్యకమని వివరించారు. ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరారు. పాత ప్రాజెక్టులైన ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్లకు ఇంతకుముందే పర్యావరణ అనుమతి తీసుకున్నామని, వాటి ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన ఈ ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారుల ఇచ్చిన వివరణ, తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు ఇవేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది. -
కోర్టు ముగిసే వరకు నిలబడండి!
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి హైకోర్టు తొమ్మిది రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. అయితే వారిద్దరూ క్షమాపణ కోరడంతో పాటు కోర్టు ఉత్తర్వుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పడం, వారి వయస్సును, ప్రస్తుత కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తీర్పును సవరించింది. జరిమానాను అలానే ఉంచి, పనివేళలు ముగిసేంత వరకు కోర్టులోనే నిలబడి ఉండాలని వారిని ఆదేశించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మూడు రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కేసు ఇదీ.. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్ధేశించిన పలు అర్హతలను తొలగించింది. దీనిని సవాలు చేస్తూ ఎస్.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాటిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వం అనుబంధ పిటిషన్ వేసింది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. తర్వాత హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. అధికారులు ఉద్ధేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. మంగళవారం ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. 9 నెలల జాప్యం ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల అమలులో 9 నెలల జాప్యం ఉందన్నారు. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తేనే కోర్టు ఆదేశాలను అమలు చేసే ఇలాంటి అధికారుల పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలా చేస్తే తప్పుడు సంకేతం పంపినట్లు అవుతుందని తెలిపారు. కోర్టు ఆదేశాల ఉద్ధేశపూర్వక ఉల్లంఘనకు వీరికి శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరో కోర్టు ధిక్కార కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తానని, కొంత గడువునివ్వాలని ఆయన కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ అందుకు అనుమతినిచ్చారు. -
దిశ డీఐజీగా రాజకుమారి
సాక్షి, అమరావతి: దిశ డీఐజీగా విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్థానంలో దిశా విభాగం ఎస్పీగా పని చేస్తున్న ఎం.దీపికాను నియమించారు. విజయనగరం, నెల్లూరు, కృష్ణా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగించారు. మొత్తంగా రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలు.. -
ఏపీ: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ ఆదిత్యానాథ్ దాస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. చదవండి: టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
30న కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయ తొలి భవనంలోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ కానుంది. కోవిడ్ నియంత్రణ, కర్ఫ్యూ ఆంక్షల సడలింపు, థర్డ్ వేవ్‌పై సన్నద్ధత, ఖరీఫ్ సన్నద్ధత తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన అంశాలను ఈ నెల 28వ తేదీలోగా సాధారణ పరిపాలన (కేబినెట్ విభాగం) శాఖకు పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్ని శాఖలను ఆదేశించారు. -
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించారు. సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినిందని, రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయిందని, అందు వల్లే రాష్ట్రం అప్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉందని, లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. కరోనా చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పోలవరం సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం ప్రోగ్రెస్‌లో ఉందని పేర్కొన్నారు. చదవండి: వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్ -
ఏపీ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ ఠాకూర్ రిటైర్ కావడంతో ఆ స్థానాన్ని ద్వారకా తిరుమలరావు భర్తీ చేయనున్నారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎన్.సంజయ్ నియమకాన్ని ఖరారు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వలు జారీ చేశారు. చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన -
Cyclone Yaas: ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
-
YS Jagan: అప్రమత్తతతో ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి: యాస్ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ నివేదికలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తుపాను కదలికలకు అనుగుణంగా అవసరమైన చర్యలను చేపట్టాలని, ఈ విషయంలో అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. యాస్ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పెద్దగా ప్రభావం కనిపించడం లేదు శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడం లేదని చెప్పారు. ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారని, తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ కొరత రాకుండా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎంకు నివేదించిన వివరాలు ఇలా ఉన్నాయి. సర్వసన్నద్ధంగా ఉన్నాం ► ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాలో ఇబ్బందులు వచ్చిన పక్షంలో వెంటనే ఆ సమస్యను తీర్చడానికి ఇచ్ఛాపురం వద్ద ప్రత్యేక బృందాలను పెట్టామన్నారు. ► విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు తుపాను ప్రభావం ఏమీ కనిపించలేదని, అయినా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు. కోవిడ్ రోగులు ఉన్న 28 ఆస్పత్రుల్లో జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. ముందస్తుగా డీజిల్, మందులు, ఆక్సిజన్‌ను నిల్వ ఉంచామని చెప్పారు. ► విశాఖలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. అయినా సరే.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని.. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లకు, సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్లకు కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 80 ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Cyclone Yaas: ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: యాస్ తుపాను దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని తెలిపారు. సీఎస్ ఆదిత్యనాథ్ శ్రీకాకుళం జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని సీఎస్ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని.. విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్ సిద్ధం చేశాం అని ఆదిత్యనాథ్ సీఎం జగన్‌కు తెలిపారు. చదవండి: Cyclone Yaas: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ -
ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పు పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులను నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలు, సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా, సబ్ డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండాలంటే ప్రత్యేక పాసులుండాలని పేర్కొన్నారు. -
పల్లెలపై ఫోకస్
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన నేపథ్యంలో గ్రామాలపై పర్యవేక్షణ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీకాలు వేయడంతో పాటు ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని.. వైరస్ ప్రభావిత వ్యక్తులను వేరుగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇవీ మార్గదర్శకాలు ► ప్రతి గ్రామంలో జ్వర బాధితులపై నిఘా ఉంచాలి. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. రోజూ ఆరోగ్య ఉప కేంద్రాల్లో జ్వర పరీక్షలు చేయాలి. గంట సేపు గ్రామాల్లో దండోరా వేయించాలి. ► గ్రామ వలంటీర్లతో పాటు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి లక్షణాలున్న వారిని గుర్తించాలి. జ్వర లక్షణాలున్న వ్యక్తి ఇంటికే వెళ్లి ఏఎన్ఎంలు పరీక్షించాలి. అలాంటి వారికి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌తో పరీక్ష చేయించాలి. ఫలితాలను బట్టి పేషెంట్‌కు వైద్యం చేయాలి. ► ఇళ్లలో ఒంటరిగా ఉన్న వ్యక్తులకు టెలీ కన్సల్టేషన్ అందుబాటులో ఉండాలి. లేదా 104 సేవ ద్వారా సలహా ఇవ్వాలి. తీవ్రమైన కోవిడ్ లక్షణాలుండి, ఆక్సిజన్ తక్కువగా ఉంటే మెడికల్ ఆఫీసర్ దగ్గరకు లేదా కోవిడ్ కేర్ సెంటర్‌కు పంపించాలి. ► ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్సీలలో అందుబాటులో ఉంచాలి. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సాంద్రతపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలి. ► పల్సాక్సీ మీటర్‌తో ఆక్సిజన్ సాంద్రత, థర్మామీటర్‌తో జ్వరం ప్రతిరోజూ నిర్ధారణ చేయాలి. ► 94 కంటే ఆక్సిజన్ తక్కువగా ఉంటే కోవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించాలి. గ్రామాల్లోనే మినీ కోవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఇంట్లో ఉండలేని వారిని అక్కడకు తీసుకెళ్లాలి. మినీ కేంద్రాలను వైద్యాధికారి సందర్శించాలి. ► ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గ్రామ సచివాలయం ఒక వాహనాన్ని అద్దెకు తీసుకోవచ్చు. పీహెచ్సీలో వైద్య పరీక్షలు, వైద్యం అందేలా చూడాలి. ► గ్రామాల్లో కోవిడ్ పరిస్థితులను రోజువారీ పర్యవేక్షించడానికి గ్రామ కమిటీ ఉంటుంది. దీనికి సర్పంచ్ చైర్మన్‌గా, ఏఎన్ఎంలు సభ్యులు, కన్వీనర్‌గా ఉంటారు. ఆశా కార్యకర్త, గ్రామ వలంటీర్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉంటారు. ► ఆయా కమిటీలు కోవిడ్‌పై విస్తృత ప్రచారం కల్పించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. -
17,269 కుటుంబాలకు పునరావాసం
సాక్షి, అమరావతి: గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 90 గ్రామాలకు చెందిన 17,269 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సహాయ పునరావాస విభాగం, జలవనరులశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరులు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణశాఖ, సహాయ పునరావాస విభాగం ఉన్నతాధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. 90 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు 73 కాలనీలను నిర్మించాలని, ఇందులో 26 కాలనీలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయని, మిగిలిన 46 కాలనీలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. గృహనిర్మాణశాఖ, పంచాయతీరాజ్‌శాఖల నేతృత్వంలో చేపట్టిన పునరావాస కాలనీల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాస కాలనీల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, గ్యాప్–3లో ఖాళీ ప్రదేశం భర్తీ పనులు కొలిక్కి వచ్చాయని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. ఈనెల 25నాటికి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీలను భర్తీచేస్తామని చెప్పారు. జూన్ నెలాఖరునాటికి కాఫర్ డ్యామ్ పనులు పూర్తవుతాయని, గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి అవసరమైన అన్ని పనులు పూర్తిచేస్తామని తెలిపారు. -
ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పని వేళల్లో కూడా మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు, సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా, సబ్ డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండాలంటే కచ్చితంగా ప్రత్యేక పాసులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆయా కార్యాలయాల అధిపతులు పని ఆధారంగా ఎంత మంది ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలో నిర్ణయించాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ నియంత్రణలో పాల్గొంటున్న వైద్య ఆరోగ్య శాఖ, ఇంధన శాఖ, మునిసిపల్ పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు ఈ పని వేళలు వర్తించవు. -
రాత్రి కర్ఫ్యూ షురూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో శనివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని కార్యాలయాలు, సంస్థలు, షాప్‌లు.., ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్లు రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఉదయం 5 గంటల తరువాతనే తెరవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆస్పత్రులు, డయాగ్నిస్టిక్, ల్యాబ్‌లు, ఫార్మసీ, ఔషధాల అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. మినహాయింపు ఉన్నది వీటికే.. రాత్రి పూట కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీసెస్, బ్రాడ్ కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసెస్, ఐటీ అండ్ ఐటీ ఆధారిత సేవలు, పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోలియం అండ్ గ్యాస్ ఔట్లెట్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ సర్వీసెస్, ప్రైవేట్ సెక్యూరిటీ సేవలు, అవసరమైన సేవల ఉత్పత్తుల యూనిట్లు, ఆహార డెలివరీ సర్వీసెస్‌కు మినహాయింపు ఇచ్చారు. మిగగా కేటగిరీ వ్యక్తుల రాకపోకలను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపాలిటీలు, పంచాయతీ ఉద్యోగులు అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీ పాస్ ఉండాలి. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో పనిచేసేవారికి తగిన గుర్తింపు కార్డుతో కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తారు. గర్భిణులు, రోగులు, వైద్య పరిశీలనలో ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులకు వెళ్లే వారు టికెట్ చూపితే మినహాయింపు ఇస్తారు. గూడ్స్ రవాణాకు రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎలాంటి పాస్, అనుమతి లేకుండా అనుమతిస్తారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ఆటోలు, టాక్సీలు తిరగడానికి అనుమతించారు. ఆంక్షలను ఎవ్వరైనా అతిక్రమిస్తే రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంక్షలను విధిగా అమలు చేయాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. -
మాస్క్ లేకుండా తిరిగితే రూ.100 జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది. అయినా సరే చాలామంది ఇప్పటికీ మాస్కు లేకుండా తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కు లేకుండా ఎవరైనా బయట తిరిగితే వారికి రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డుపైకి ఎవరైనా మాస్కు లేకుండా వస్తే జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు. షాపులు లేదా వ్యాపార సంస్థలు, కమర్షియల్ కాంప్లెక్సుల్లో 5 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు వంటి చోట సీటు మార్చి సీటు అంటే మధ్యలో సీటు ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి షాపులో, ఇతర చోట్లా శానిటైజర్ వేసుకున్న తర్వాతే వినియోగదారులను లోపలికి పంపించాలని ఆదేశించారు. థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లను విధిగా వాడాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్స్ అన్నీ వెంటనే మూసివేయాలని ఆదేశాలిచ్చారు. పైన నిబంధనలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చారు. -
ఏబీపై క్రమశిక్షణ కొరడా!
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి సస్పెండై సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులపై బహిరంగ ఆరోపణలకు దిగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్ బ్యాచ్ 1989)పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు విచారణకు హాజరైన అనంతరం సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా విచారణకు సంబంధించిన అనేక అంశాలను బహిర్గతం చేశారు. ఈ నెల 4న వెలగపూడిలోని సెక్రటేరియెట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పలువురు అధికారులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేశారు. అఖిల భారత సర్వీసులో ఉన్న అధికారులు రాజకీయంగా, బయటి వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదన్న నిబంధనలను అతిక్రమించారు. అఖిల భారత సర్వీసు (క్రమశిక్షణ–అప్పీల్) నియమాలు–1969, అఖిల భారత సర్వీస్(ప్రవర్తన) నియమాలు–1968 ప్రకారం నిబంధనలను అతిక్రమించిన ఏబీ వెంకటేశ్వరరావును వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సంబంధిత అధికారి వద్ద ఆయన స్వయంగా హాజరై రాతపూర్వకంగా 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. సర్వీసు రూల్స్ అతిక్రమించి దుష్ప్రవర్తన(మిస్ కాండక్ట్)కు పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు గడువులోగా సహేతుకమైన వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
సామరస్యంగా పరిష్కరించుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తగిన కృషి చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఇతర అధికారులతో విభజన అంశాలకు సంబంధించిన సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న వివిధ విభజన అంశాలను అజయ్ భల్లా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు(సివిల్), ఎస్పీలు(నాన్ కేడర్), షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పుల విభజన, సింగరేణి కాలరీస్ కంపెనీ విభజన అంశాలపై చర్చించారు. అలాగే విభజన చట్టంలోని సెక్షన్లు 50, 51, 56 ప్రకారం ట్యాక్సేషన్ ప్రావిజన్స్ కల్పించడం, కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, ఏపీ జెన్కోకు బకాయిల చెల్లింపు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో అజయ్ భల్లా సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి కేంద్రం తన వంతు తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు. షీలా బిడే కమిటీ సిఫార్సులను గౌరవించాలి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. కేంద్రం నియమించిన షీలా బిడే కమిటీ సిఫార్సుల ప్రకారం విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజన జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జెన్కో ద్వారా తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి సుమారు రూ.7 వేల కోట్ల వరకు తెలంగాణ ఇవ్వాల్సి ఉందని హోం శాఖ కార్యదర్శి దృష్టికి సీఎస్ తీసుకెళ్లారు. అజయ్ భల్లా స్పందిస్తూ ఏపీ, తెలంగాణ అధికారులు చర్చించుకొని.. ఒక పరిష్కారానికి రావాలని సూచించారు. ఇందుకు సీఎస్ అంగీకరించి.. ఈ సమస్య పరిష్కారానికి ఒక నిర్దిష్ట సమయం పెట్టాలని కోరారు. సమావేశంలో ఏపీ ఉన్నతాధికారులు రజత్ భార్గవ, అనంతరాము, ఎస్ఎస్ రావత్, ప్రేమచంద్రారెడ్డి, అనురాధ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
22న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన 22వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి భవనంలో కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలకు సంబంధించిన మెమోరాండమ్‌లను 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా సాధారణ పరిపాలనశాఖ కేబినెట్ విభాగానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం అన్ని శాఖలను ఆదేశించారు. -
స్వరాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ బుధవారం జీవో ఇచ్చారు. ఏపీలో పనిచేస్తున్న క్లాస్–3, క్లాస్–4 తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఉదయం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రావిురెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తమ సొంత రాష్ట్రమైన తెలంగాణలో సర్వీసులు కొనసాగించేందుకు గానూ.. తమను రిలీవ్ చేయాలని ముఖ్యమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. వారిని రిలీవ్ చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే స్వరాష్ట్రానికి వెళ్లబోతున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 711 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని.. సీఎం వైఎస్ జగన్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్పారు. ఆయన ఇదే విధంగా మున్ముందు కూడా ప్రజల అభిమానం పొందాలని ఆకాంక్షించారు. వారి వెంట పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాసులరెడ్డి తదితరులున్నారు. -
సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా
సాక్షి, అమరావతి: సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలంసాహ్ని రాజీనామా చేశారు. రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శనివారం ఆమోదించారు. ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించేందుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా నీలం సాహ్ని సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రానికి రూ.2.31లక్షల కోట్ల రుణసాయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు బ్యాంకుల ద్వారా ప్రాధాన్యతా రంగాలకు రూ.2.31 లక్షల కోట్ల రుణ సహాయం అందించేందుకు అవకాశమున్నట్లు నాబార్డు (జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు)రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ వెల్లడించింది. దీనిలో వ్యవసాయ రంగానికి రూ.1.57 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.47,402 కోట్లు, ఎగుమతులు క్రెడిట్ కింద రూ.2,880 కోట్లు, విద్యా రంగానికి రూ.1,584 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.14,335 కోట్లు, రెన్యువల్ ఎనర్జీకి రూ.461 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ బ్యాంకు క్రెడిట్ కింద రూ.513 కోట్లు, ఇతర రంగాలకు రూ.6,418 కోట్ల రుణాలు అందించేందుకు అవకాశముందని ఫోకస్ పేపర్లో పేర్కొన్నారు. ఈ పేపర్‌ను రిఫరెన్స్ డాక్యుమెంట్‌గా చేసుకుని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్ క్రెడిట్ సదస్సు శుక్రవారం నాబార్డు ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ ఫోకస్ పేపర్ 2021–22ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలకు తోడ్పాటునందించాలి : మంత్రి కన్నబాబు అనంతరం.. వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రాథమిక రంగాల అభివృద్ధితోపాటు రైతుల ఆర్థిక ప్రయోజనాలు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టంచేశారు. వీటి సాధనకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► జనతా బజార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు కూడా బ్యాంకులు సహకరించాలి. ► అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ రిటైల్ చైన్ అభివృద్ధికి, గ్రామస్థాయిలో వ్యవసాయానికి సంబంధించి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికీ సహకరించాలి. ► అదే విధంగా.. పాడి పరిశ్రమాభివృద్ధి రంగానికి, కౌలు రైతులకు మానవతా దృక్పథంతో వ్యవహరించి తగిన సహాయం చేయాలి. ► రాష్ట్ర ప్రగతికి నాబార్డు ఎంతగానో సహాయ పడుతోంది. ఇందుకు నాబార్డు చైర్మన్ గోవిందరాజులుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాబార్డు తోడ్పాటు అభినందనీయం : సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి వివిధ బ్యాంకులు, నాబార్డు అందిస్తున్న తోడ్పాటును కొనియాడారు. నాబార్డు కేవలం వ్యవసాయ రంగానికే కాక నీటిపారుదల, విద్య, వైద్య రంగాల్లో కూడా సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలుకు మరింత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని సీఎస్ ఆకాంక్షించారు. నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. లక్ష్యానికి మించి సాయం: నాబార్డు సీజీఎం నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుదీర్‌కుమార్ జొన్నావర్ మాట్లాడుతూ.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రాష్ట్రానికి రూ.27,992 కోట్ల సహాయం అందించాల్సి ఉండగా లక్ష్యాన్ని మించి రూ.32 వేల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా నాబార్డు తనవంతు తోడ్పాటును అందిస్తోందన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం కంటే 9 శాతం అధికంగా ప్రాధాన్యతా రంగంలో రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా స్టేట్ ఫోకస్ పేపరును రూపొందించామన్నారు. సమావేశంలో నాబార్డు జీఎం బి ఉదయభాస్కర్ అజెండా అంశాలను వివరించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్బీఐ జీఎం సుందరం శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, స్పెషల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఎ.బాబు తదితరులు మాట్లాడారు. -
ఏపీ డీఆర్పీ పనులపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీ డీఆర్పీ)లో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.1,777.38 కోట్లతో చేపట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ పనులపై రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులతో మంగళవారం సీఎస్ సమీక్షించారు. -
కరోనా కట్టడికి 15 రోజుల ప్రచార కార్యక్రమాలు
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా ప్రమాదం గురించి ప్రజలకు మరింతగా వివరించి చెప్పేలా 15 రోజుల పాటు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. వాక్సినేషన్ ఆవశ్యకతతో పాటు కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు పలు కార్యక్రమాలు చేపడతాయి. ఈ మేరకు ఈనెల 24 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రోజువారీ ప్రచార కార్యాచరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 24న కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో అన్ని విభాగాల అధికారులతో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహించాలి. వ్యాపార, వాణిజ్య సంఘాలను భాగస్వాములను చేయాలి. 25న పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ర్యాలీలు, 26న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తమ పరిధిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై తనిఖీలు, 27న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో సహా ప్రజాప్రతినిధులందరినీ ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాలు, 28న సినిమా హాళ్లలో కరోనా నియంత్రణ చర్యలపై తనిఖీలు, 29న పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులతో సమావేశాలు, 30న లారీ, టాక్సీ, ఆటో యజమానులతో సమావేశాలు, 31న పరిశ్రమల యజమానులతో జిల్లా కలెక్టర్లు సమావేశాలు, ఏప్రిల్ 1న ప్రయాణికుల వాహనాల్లో తనిఖీ, 2న షాపింగ్ మాల్స్, పరిశ్రమలలో చేపడుతున్న చర్యలపై తనిఖీలు, ఏప్రిల్ 3న గ్రామ వార్డు సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు, ఏప్రిల్ 4న విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో వివిధ రకాల పోటీలు, 5న వివిధ మత సంస్థలలో కరోనా నియంత్రణ చర్యలపై తనిఖీలు, ఏప్రిల్ 6న సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు, 7న జిల్లా, మండల, గ్రామ స్థాయిలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని సీఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నామని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం సీఎస్ అధ్యక్షతన ఎకో టూరిజం డెవలప్ మెంట్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధి చేసూ్తనే.. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ అధికారులు, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వచ్చే నెల 15వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి ప్రణాళికలతో రావాలని ఆదేశించారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ కుమార్ ఎకో టూరిజం అభివృద్ధికి తీసుకోబోయే చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, ఇందులో భాగంగా సీఎస్ చైర్ పర్సన్‌గా టూరిజం డిపార్టుమెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి వైస్ చైర్ పర్సన్లుగా, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో సభ్య కన్వీనర్‌గా, మరో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులతో ఎకో టూరిజం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ రాష్ట్రంలో సుందరమైన అటవీ ప్రాంతాలను గుర్తించి, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఎకో టూరిజం అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నా మన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో రిస్టార్టులు, జంగిల్ లాడ్జిల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ రుణాలపై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: డిజిటల్ లెండింగ్ యాప్, ఆన్లైన్ రుణాల మంజూరు యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ విజ్ఞప్తి చేశారు. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అగ్రిగోల్డు, అక్షయ గోల్డు, హీరా గ్రూప్, కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆదర్శ్ మల్టీస్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ.. తదితర చిట్‌ఫండ్ కంపెనీలపై నమోదైన కేసులను సమీక్షించారు. అన్ రిజిస్టర్డ్, బోగస్ చిట్ ఫైనాన్స్ కంపెనీల మోసాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో డిజిటల్ లెండింగ్ ఏజెన్సీలు ఎక్కువై ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆన్లైన్లో ఋణాలు మంజూరు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. ఇటువంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని, ఏదైనా కంపెనీ లేదా సంస్థ యాప్ ద్వారా అలాంటి మోసాలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాంటి ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ జరిపి కేసులు నమోదు చేసి సకాలంలో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. బోగస్ చిట్‌ఫండ్ లేదా ఫైనాన్స్ కంపెనీల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆర్బీఐ, పోలీస్, రిజి్రస్టార్ ఆఫ్ చిట్స్, సంబంధిత శాఖల అధికారులు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమన్వయంతో పనిచేయాలి ఫైనాన్స్ కంపెనీలు, చిట్‌ఫండ్ కంపెనీల వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హోం, న్యాయ, సీఐడీ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వీటి బాధితులకు సకాలంలో న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ, సీఐడీ తదితర విభాగాలకు సూచించారు. ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ నిఖిల, సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్, సహకార మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్స్ బాబు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి సునీత, ఆర్బీఐ జీఎం జయకుమార్, ఏజీఎంలు పద్మనాభన్, ఉదయ్‌కృష్ణ, మోహన్, డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ మెహతా పాల్గొన్నారు. -
ఆ మూడు రంగాలకూ రుణాలివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ రంగం, ఓడరేవుల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మేనేజింగ్ డైరెక్టర్ జి.రాజ్‌కిరణ్‌రాయ్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆదిత్యనాథ్‌దాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం కోసం బోధనాస్పత్రులతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ఆరోగ్య రంగానికి రూ.2 వేల కోట్ల రుణ సదుపాయం అవసరమని, ఇందుకు సహకరించాలని బ్యాంక్ ఎండీని కోరారు. 2023 నాటికి రాష్ట్రంలో మూడు పంక్షనల్ గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు కూడా రుణ సదుపాయం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూబీఐ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ మాట్లాడుతూ ఈ విషయాల్లో ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక–ఇంధన) డి.కృష్ణ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్సింఘాల్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి, ఏపీ ఎంఐఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. -
మాకు విశేషాధికారాలున్నాయి
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు విశేషాధికారాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల వాయిదా, రద్దు, తిరిగి నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారాలున్నాయన్నారు. పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. భారత ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కూ ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతుంటే జోక్యం చేసుకుని నిష్పాక్షికంగా నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా 126 జెడ్పీటీసీలు, 2,363 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, గతంతో పోలిస్తే ఏకగ్రీవాల సంఖ్య అసాధారణంగా పెరిగిందన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో బెదిరింపులు, ప్రలోభాలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయని, అందుకే ఏకగ్రీవాల్లో ఎన్ని న్యాయమైనవో తేల్చేందుకే విచారణ జరపాలని నిర్ణయించామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలని, మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని అభ్యర్థించారు. ఫాం – 10 ప్రస్తావన లేకుండా కౌంటర్ 657 పేజీల కౌంటర్లో న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన దాదాపు 25 తీర్పులను నిమ్మగడ్డ ప్రస్తావించారు. పిటిషనర్లు ప్రధానంగా ప్రస్తావించిన ఫాం – 10 (అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఇచ్చే పత్రం) గురించి కనీసం ఒక్క పదం కూడా ఆయన కౌంటర్లో పేర్కొనకపోవడం గమనార్హం. కౌంటర్లో మొత్తం ఎన్నికల కమిషన్ అధికారాల గురించే ప్రస్తావించారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తయిందా లేదా అని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆరా తీశారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఆయా నగర పాలక సంస్థల కమిషనర్లతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీసుల సహకారంతో అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమ్మగడ్డతో సీఎస్ భేటీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌పై నివేదిక పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీల వారీగా కౌంటింగ్, రీ కౌంటింగ్ జరిగిన తీరుపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఆదివారం ఎస్ఈసీకి నివేదిక అందజేసినట్టు తెలిసింది. కౌంటింగ్ తీరుపై ఎస్ఈసీ నివేదిక కోరిన విషయం తెలిసిందే. -
పోలవరం మరింత వేగంగా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అవి పూర్తయ్యేలోగా కాఫర్ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల వచ్చే వర్షాకాలంలో వరద నీటిని స్పిల్ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందన్నారు. పోలవరంలో స్పిల్‌వే, అప్రోచ్ చానల్, అప్ స్ట్రీం కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనులపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం నిర్మాణంలో గత సర్కారు తప్పిదాల వల్ల పనుల్లో ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. స్పిల్ వే పూర్తికాకుండా కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టడం వల్ల ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒక పద్థతి ప్రకారం కాకుండా అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని, వరదల సమయంలో స్పిల్ చానల్ పనులకూ తీవ్ర ఆటంకం కలిగిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కాఫర్ డ్యాంలో వదిలిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని, దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద గ్యాప్ – 1, గ్యాప్ – 2లలో భారీ ఎత్తున కోతకు గురైందన్నారు. ఇప్పుడు ఈ పనులన్నింటిపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలిపారు. ఇప్పటికే స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని... గేట్లు, సిలిండర్ల బిగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయని, 2022 మే నెలాఖరు నాటికి కాపర్ డ్యాం పనులను పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం సహాయ, పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ తదితరులు ఎత్తు తగ్గింపు అవకాశమే లేదు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు అవకాశమే లేదని, తొలుత నిర్దేశించిన ఎత్తుకు తగినట్లుగానే ఇప్పటికే షట్టర్లు బిగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో (‘సాక్షి’లో కాదు) వెలువడ్డ కథనాలను అధికారులు కొట్టి పారేశారు. పోలవరం ఎత్తు తగ్గింపు అవకాశమే లేదని, ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సైతం స్పష్టం చేసిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎత్తు తగ్గింపుపై ఇప్పుడు చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే విస్పష్టంగా చెప్పినా కొన్ని పత్రికలు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రానికి మేలు జరిగేలా అనుసంధానం... రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా నదుల అనుసంధానంపై ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనల నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. నదుల అనుసంధానం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. అయోమయం, సందిగ్ధతలకు తావులేకుండా ఉభయ తారకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రం తరఫు నుంచి ప్రతిపాదనలు సిద్ధం కాగానే కేంద్రానికి పంపుదామని చెప్పారు. ప్రకృతి సమతుల్యతతో వైఎస్సార్ గార్డెన్స్.. పోలవరం వద్ద నిర్మించ తలపెట్టిన వైఎస్సార్ గార్డెన్స్ పనుల వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రకృతి సమతుల్యతను మరింత పెంచేలా నిర్మాణ రీతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం వద్ద వైఎస్సార్ గార్డెన్స్ నిర్మాణంపై సమీక్ష సందర్భంగా అధికారులు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను సీఎంకు వివరించారు. పోలవరం వద్ద జి– హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో వైఎస్సార్ విగ్రహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆహ్లాదం, అందం పెరిగేలా వైఎస్సార్ గార్డెన్స్ నిర్మాణ రీతులు ఉండాలని, నిర్వహణ వ్యయం కనిష్టంగా ఉండే విధంగా డిజైన్లు రూపొందించాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఈ బ్రిడ్జి నుంచి జి– హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. సమీక్షలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి జే.శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే పోస్టింగ్ కోసం వేచి ఉన్న 8 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శనివారం ఉత్తర్వులిచ్చారు. ప్రకాశం జిల్లా జేసీగా (ఆసరా–సంక్షేమం) పనిచేస్తున్న బాపిరెడ్డిని నెల్లూరు జిల్లా జేసీగా (ఆసరా–సంక్షేమం) బదిలీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో అటవీ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.కృష్ణవేణిని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా (ఆసరా–సంక్షేమం) నియమించారు. -
దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా : సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘క్రికెట్లో కెప్టెన్ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదు. మొత్తం టీమ్ సమష్టిగా కృషి చేస్తేనే విజయం సాధ్యం. నాకు మీలాంటి టీమ్ ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత 20 నెలలుగా మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’అని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులనుద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు చేసిన పనులు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలివీ.. రిలాక్స్ అయితే వెనకబడతాం పరిపాలనలో 20 నెలలు.. అంటే దాదాపు మూడో వంతు సమయం గడిచిపోయింది. క్రికెట్లో మాదిరిగా ఇప్పుడు మిడిల్ ఓవర్ల కాలం వచ్చింది. సహజంగా ఈ సమయంలో బ్రేక్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు రిలాక్స్ అయితే వెనుకబడిపోతాం. మనం మళ్లీ దృష్టిని కేంద్రీకరించుకోవాలి. శాఖల మధ్య సమన్వయం పెంచుకోవాలి. చేసిన పనులను సమీక్షించుకోవాలి. లోపాలను సవరించుకోవాలి. లక్ష్య సాధన కోసం కలసి కట్టుగా పనిచేయాలి. అప్పుడే మరింత ముందుకు వెళ్లగలుగుతాం. మన సమర్థతకు నిదర్శనం.. నిజం చెప్పాలంటే... అలాంటి ఆలోచనలు (వివిధ కార్యక్రమాలు, పథకాలను ప్రస్తావిస్తూ) చేయడమే ఒక మహత్తర పని. ఎందుకంటే ఏనాడూ, ఎక్కడా అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మన రాష్ట్రంలో కేవలం 20 నెలల వ్యవధిలోనే అన్నింటినీ సాకారం చేసి చూపాం. అది ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. అది మన అధికారుల సమర్థత, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో, గట్టి సంకల్పంతో చేసి చూపించింది. ఉగాది రోజు వలంటీర్లకు సత్కారం ఏటా ఉగాది పర్వదినం రోజు వలంటీర్లకు సత్కారం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తే వారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టినట్లు అవుతుంది. వలంటీర్లు మహోన్నత సేవలందిస్తున్నారన్న భావన అందరిలో కలిగించినట్లు అవుతుంది. సచివాలయాలు, వలంటీర్ల మధ్య పూర్తి సమన్వయం ఉంటే ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా, సమర్థంగా ప్రజలకు అందుతాయి. సమష్టి కృషితోనే సాధ్యం.. మీలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ణాతులు, సమర్థులు. సమష్టి కృషి వల్లే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ నుంచి దిశ చట్టం దాకా చెప్పుకుంటూ పోతే జాబితాలో ఎన్నో ఉన్నాయి. విద్యుత్ కొనుగోళ్లలో వ్యయ నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రం కూడా ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఈ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అవి మిగిలిన రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షించాయి. పాలనలో నిబద్ధతకు ప్రతిరూపం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మార్పులు అంతటితోనే ఆగిపోలేదు. కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం టెండర్ల జ్యుడీషియల్ ప్రివ్యూ చేపట్టాం. రివర్స్ టెండరింగ్ విధానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాలనలో నిబద్ధతకు ప్రతిరూపంలా నిల్చింది. ఇంగ్లిష్ మీడియంలో బోధన, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, గత వందేళ్లలో ఏనాడు జరగని భూముల సమగ్ర రీసర్వే లాంటి కార్యక్రమాలను చేపట్టాం. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా నగదు బదిలీ.. వీటన్నింటికి మించి వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానం తెచ్చాం. దళారీలు, అవినీతికి ఎక్కడా తావులేకుండా కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. ఆ విధంగా దాదాపు రూ.90 వేల కోట్లు ఇచ్చాం. వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా.. నాడు–నేడుతో విద్య వైద్య రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. 30.92 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాం. రాష్ట్ర చరిత్రలో.. బహుశా దేశ చరిత్రలోనే ఐదేళ్లలో ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చు. కేవలం ఇళ్ల స్థలాల పంపిణీ మాత్రమే కాకుండా గృహ నిర్మాణాలను ప్రారంభించాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని మన రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడ్డాం.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్ట పాలు చేసిన ఎందరో నాయకులను నేను చూశా. వందల హామీలతో, వందల పేజీలతో రూపొందించి ఎన్నికల తర్వాత వాటిని పట్టించుకునే వారే కాదు. మేనిఫెస్టోను కనీసం మళ్లీ చూసేవారు కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో మేం నవరత్నాలతో మేనిఫెస్టోను తెచ్చాం. చదవడానికి చాలా సులభంగా ఉండడమే కాకుండా నిత్యం కళ్ల ముందు కనిపించేలా, కర్తవ్యాన్ని గుర్తు చేసేలా కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో ప్రకటించాం. దాన్ని ప్రతి శాఖ కార్యదర్శికి, ప్రతి విభాగాధిపతికి, ప్రతి కలెక్టర్‌కు అందజేశాం. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి పని చేశాం. కార్యక్రమాలు నిర్వహించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం వరకు అమలు చేశాం, చేస్తున్నాం. ఒక్కొక్కటీ చక్కదిద్దుకుంటూ.. నేను అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఒక మాట చెప్పారు. దాదాపు రూ.60 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిల్లో రూ.21 వేల కోట్లు కేవలం విద్యుత్ బిల్లుల బకాయిలు కాగా మిగిలిన రూ.39 వేల కోట్ల బిల్లులు వివిధ శాఖలకు సంబంధించినవి. ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్ల బకాయిలున్నాయి. కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతో కూడా ఏమాత్రం సయోధ్య లేని పరిస్థితి ఉంది. మేం అధికారం చేపట్టినప్పుడు ఉన్న దుస్థితి అది. ఆ పరిస్థితి నుంచి అన్నీ చక్కదిద్దుకుంటూ ఇంత దూరం వచ్చామని గర్వంగా చెప్పగలుగుతా. గ్రామాలకే పాలన.. గతంతో పోలిస్తే పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చాం. మండల స్థాయి నుంచి పరిపాలనను గ్రామ స్థాయికి చేరువ చేశాం. గతంలో ప్రతిదీ మండల స్థాయిలో జరగడం వల్ల అన్నీ ఆలస్యమయ్యేవి. అవినీతి కొనసాగేది. ఇప్పుడు గ్రామ స్థాయిలో పరిపాలన అందుతోంది. ఒక్కో గ్రామంలో సగటున 700 ఇళ్లు ఉన్నాయనుకుంటే దాదాపు 10 మంది అధికారులు పని చేస్తున్నారు. ఇలా ఒక పరిధిలోనే సేవలందించడం వల్ల ఏ అధికారీ లంచం ఆశించే వీలు లేదు. కార్యదర్శులు, విభాగాధిపతులు చొరవ చూపాలి.. గ్రామస్థాయికి పరిపాలనను చేరవేసేందుకు మనం తెచ్చిన సచివాలయాల వ్యవస్థను ప్రతి కార్యదర్శి, ప్రతి విభాగాధిపతి తమదిగా భావించాలి. లేదంటే శాఖల మధ్య సమన్వయం కొరవడి సేవలు సక్రమంగా అందవు. గ్రామాల నుంచి అందే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలి. గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలి. అలా జరగకపోతే ప్రజలకు ప్రభుత్వంపైనా, కార్యదర్శులపైనా నమ్మకం, విశ్వాసం పోతుంది. అందువల్ల గ్రామాల నుంచి వస్తున్న వినతులపై అధికార యంత్రాంగం నుంచి పూర్తిస్థాయిలో స్పందన ఉండాలి. ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. తద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. అలాంటి చొరవ కార్యదర్శులు, విభాగాధిపతులకు ఎంతో ముఖ్యం. సీఎస్‌కు అభినందనలు... ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నా. ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలి. తద్వారా శాఖల సమన్వయం పెరుగుతుంది. పలు అంశాలను నేనే స్వయంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోగలుగుతా. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆ శాఖ కార్యదర్శికి తగిన విధంగా నిర్దేశించగలుగుతాం. ఇవన్నీ ఒకవైపు కాగా మరోవైపు ఇలాంటి సమావేశాల వల్ల మన ముందున్న పనులు, లక్ష్యాలపై దృష్టి పెట్టే వీలుంటుంది. ఎక్కడైనా సమాచార లోపం ఉంటే అధిగమించవచ్చు. ఇక్కడ వివిధ శాఖలకు చెందిన ఎంతోమంది అనుభవజ్ఞులైన అధికారులున్నారు. మీ శాఖకు సంబంధించిన అంశం కాకపోయినా ఫలానా శాఖలో ఇలాంటి మార్పు చేస్తే మరింత మెరుగైన పాలన అందుతుందని భావిస్తే ఏమాత్రం సంకోచించకుండా చెప్పండి. నిస్సందేహంగా సలహాలు అందజేయండి. ఒక మంచి ఆలోచనను స్ఫూర్తి, నిబద్ధతతో అమలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. వాటి అమలులో ప్రభుత్వం సంకోచించదు. ఉగాదికి వలంటీర్లకు అవార్డులు, రివార్డులు.. కొందరు వలంటీర్లు వేతనాల పెంపు కోరుతూ రోడ్డెక్కిన విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి చాలా బాధ కలిగింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను మనం ఎందుకు ఏర్పాటు చేశాం? ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమే కదా? వలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధం. కానీ దానర్థం మార్చేసి ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం మొత్తం వ్యవస్థనే నీరుగారుస్తుంది. కాబట్టి మరో మార్గంలో వలంటీర్లను ప్రోత్సహిద్దాం. ఆ ప్రక్రియలో నాకు ఇవాళే ఒక ఆలోచన వచ్చింది. ఉగాది పండగ రోజు నుంచి ప్రతి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో వలంటీర్లకు సత్కారం, సేవారత్న, సేవామిత్ర లాంటి అవార్డులు ప్రదానం చేయడం వల్ల వారి సేవలను గుర్తించి ప్రోత్సహించినట్లు అవుతుంది. వచ్చే ఉగాది రోజు ఈ కార్యక్రమం ప్రారంభించాలి. ఉదాహరణకు కడపలో పది నియోజకవర్గాలున్నాయి. అంటే అది 10 రోజుల కార్యక్రమం. తూర్పు గోదావరి జిల్లాలో 19 రోజులు, గుంటూరు జిల్లాలో 17 రోజుల పాటు వలంటీర్ల సత్కార కార్యక్రమం కొనసాగుతుంది. కలెక్టర్, ఎస్పీ, సచివాలయాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న జాయింట్ కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. వలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలి. తద్వారా వారు తమ బాధ్యతలను ఒక ఉద్యోగంగా భావించకుండా సేవా ధృక్పథంతో పని చేస్తారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మేజర్ జనరల్ ఆర్కే సింగ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ, తెలంగాణ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ కలిశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ఈనెల 18న తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందజేశారు. మేజర్ జనరల్ ఆర్కే సింగ్‌తో పాటు రిటైర్డ్ కల్నల్ రాంబాబు కూడా సీఎంను కలిశారు. సీఎస్‌తో ఆర్కే సింగ్ భేటీ ఆర్కే సింగ్ శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను కలిశారు. ఈనెల 18న తిరుపతిలో నిర్వహించనున్న వేడుకలకు సీఎస్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఆర్కే సింగ్ సీఎస్‌ను కోరారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను రక్షణ శాఖ నుంచి మంజూరు చేయించాలని కోరారు. ఇలా ఉండగా, డీజీపీ సవాంగ్‌ను కూడా ఆర్కే సింగ్ కలిశారు. తిరుపతిలో నిర్వహించే వేడుకలకు రావాలని ఆహ్వానించారు. -
ఎన్నికలతో పాటు వ్యాక్సినేషన్‌నూ విజయవంతం చేయాలి
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ మాట్లాడుతూ పోలీస్ శాఖ విజ్ఞప్తి మేరకు ఆ శాఖ సిబ్బందికి 25 నుంచి 27 వరకు తొలి విడత డోస్ ఇచ్చేందుకు సైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ రెండో విడతలో 5,86,078 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. -
నిమ్మగడ్డ తీరును ఎండగట్టిన హైకోర్టు న్యాయమూర్తి
సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేయడం లేదంటూ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ప్రచారం కోసం దాఖలు చేస్తున్నారా? అంటూ హైకోర్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను నిలదీసింది. గత నెల 18న దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ 42 రోజుల పాటు ఈ కోర్టు ముందు విచారణకు రాలేదని.. అయితే, పిటిషన్లో ప్రతీ అక్షరం మాత్రం డిసెంబర్ 19నే అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైందని.. దీంతో పిటిషన్ వేసిన ప్రయోజనం నెరవేరినట్లు కమిషనర్ భావించినట్లున్నారని హైకోర్టు తెలిపింది. దీని ఆధారంగానే నిమ్మగడ్డ రమేష్ ప్రచారం కోసమే కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారన్న అభిప్రాయం ఈ న్యాయస్థానానికి కలుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదీ కోర్టు ధిక్కార పిటిషన్.. తమకు కేటాయించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడంలేదని, నిధులు విడుదల చేసేలా ఆదేశాలివ్వడంతో పాటు విధి నిర్వహణలో తమకు ఆర్థిక, ఆర్థికేతర సహాయ, సహకారాలు అందించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఎన్నికల కమిషన్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలుచేయడంలేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది డిసెంబర్ 18న కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం జనవరి 29న విచారణకు రాగా, ఇందులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రతివాదిగా చేసేందుకు కమిషన్ తరఫు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు జాప్యం ఎందుకు? ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, న్యాయమూర్తి తనకు కొన్ని విషయాలపై స్పష్టతనివ్వాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్‌ను ఆదేశించారు. డిసెంబర్ 18న పిటిషన్ దాఖలు చేస్తే అది జనవరి 29 వరకు ఎందుకు విచారణకు రాలేదని.. ఇన్ని రోజుల జాప్యం మీ తప్పా, రిజిస్ట్రీ తప్పా అంటూ అడిగారు. కేసు విచారణకు వచ్చేందుకు రిజిస్ట్రీకి లేఖలు రాశానని, ఫోన్లు కూడా చేశానని అశ్వనీ చెప్పారు. అత్యవసరంలేదని భావించే 42రోజులు మౌనంగా ఉన్నారా? అంటూ న్యాయమూర్తి మళ్లీ ప్రశ్నించారు. ‘నిజంగా అత్యవసరమని భావించే ఉంటే ఈ కోర్టులో ప్రస్తావించి ఉండేవారు. ఆ పనిచేయలేదంటే వారు ఏ ప్రయోజనం ఆశించి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారో సులభంగా అర్థమవుతోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నారంటే ప్రతివాదులపై (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి) ఒత్తిడి పెంచడానికి ఇలా చేస్తున్నారని ఈ కోర్టు భావిస్తోంది. ఎన్నికల కమిషనర్ సదుద్దేశాలపై ఈ కోర్టుకు సందేహం కలుగుతోంది’.. అని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు ఓ పిటిషన్ విచారణకు రాకపోవడం అంటే ఈ కోర్టు రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేనని న్యాయమూర్తి తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎస్ నీలం సాహ్ని, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలకు నోటీసులు జారీచేశారు. అంతేకాక.. నవంబర్‌లో తమ ఉత్తర్వులకు సంబంధించి తీసుకున్న చర్యలపై తాము కోరిన నివేదికను తదుపరి విచారణ సమయంలో తన ముందుంచాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి స్పష్టంచేశారు. అలాగే, పిటిషన్ విచారణకు రాక ముందే వాటిని పత్రికలకు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో కమిషనర్‌కు తగిన సలహా ఇవ్వాలని కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌కు సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. -
ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సర్కారు ‘నో’
సాక్షి, అమరావతి: సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీచేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఎస్ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని సీఎస్ కోరారు. (చదవండి: జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురు) -
పట్టణాల్లో నేటి నుంచి ఇంటింటికీ రేషన్
సాక్షి, అమరావతి: పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ‘ఇంటింటికీ రేషన్’ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రం అంతటా ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కొనుగోలు చేసిన 9,260 మొబైల్ వాహనాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 21న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఇందుకు ప్రభుత్వం సవివరంగా ఎస్ఈసీకి తిరుగు సమాధానం ఇచ్చింది. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఈ దేశంలో ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో వివరించింది. వాస్తవంగా ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా అమలవుతోందని, ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు వీలుగా అనుమతించాలని కోరింది. ఈ మేరకు హైకోర్టులో ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విషయమై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నేటి నుంచి ఇంటింటికీ రేషన్ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. -
మంత్రుల పర్యటనలకు ప్రభుత్వ వాహనాలొద్దు
సాక్షి, అమరావతి : పార్టీయేతర ప్రాతిపదికన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులెవరూ పల్లెల్లో పర్యటించే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వోద్యోగులెవరినీ వెంట తీసుకెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వ వాహనాలతో సహా ఇతరత్రా ఏ ప్రభుత్వ సదుపాయాలను వారు వినియోగించకూడదని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కోడ్ అమలులో ఉందని.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ వాహనాలను సమకూర్చవద్దని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఏ ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందకూడదని స్పష్టంచేశారు. అంతేకాక.. కేబినెట్ ర్యాంకు హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా ఉండే వారు పార్టీ కార్యాలయాలకు వెళ్లి రావడానికి కూడా ప్రభుత్వ వాహనాలు వినియోగించుకోకూడదని.. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ పార్టీకి సంబంధించిన ప్రెస్మీట్లలోనూ పాల్గొనడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఆ లేఖలో సీఎస్‌కు వివరించారు. -
పంచాయతీ ఎన్నికల రోజున సెలవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పొలింగ్ జరిగే ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీలను స్థానిక సెలవు దినాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీచేసింది. పొలింగ్ జరిగే తేదీలకు 44 గంటలకు ముందు ఆయా ప్రాంతాలలో మద్యం షాపులు మూసి వేయాలని వేరుగా మరొక ఉత్తర్వు జారీచేసింది. అలాగే, ఎన్నికల ఏజెంట్లుగా ప్రభుత్వోద్యోగులు పాల్గొనకూడదని కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీచేసింది. ఎన్నికల విధులలో ప్రభుత్వోద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అందులో పేర్కొంది. కాగా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వపరంగా మొత్తం తొమ్మిది జీఓలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వేర్వేరుగా జారీచేశారు. -
సెన్సూర్ అధికారం ఎస్ఈసీది కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. నిబంధనలను ఏమాత్రం పాటించకుండా ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎస్ఈసీ సెన్సూర్ చేశారని తెలిపింది. అఖిల భారత సర్వీసు అధికారులను సెన్సూర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని పేర్కొంది. ఈ క్రమంలో ఏకపక్షంగా ఇద్దరు ఐఏఎస్‌లను సెన్సూర్ చేస్తూ ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను తిరస్కరించామని వివరించింది. చదవండి: ఆ అధికారం నిమ్మగడ్డకు ఉందా..? డీవోపీటీకి ఎస్ఈసీ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని, ఆ ఇద్దరు ఐఏఎస్‌లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తన పరిధి దాటి వ్యవహరించవద్దని ఎస్ఈసీకి సూచించాలని కోరింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ గురువారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి, డీవోపీటీ కార్యదర్శిని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఢిల్లీలో స్వయంగా కలిసి అందించారు. ఆ లేఖలో ప్రధాన అంశాలివీ.. చదవండి: టీడీపీ కుట్రకు యాప్ దన్ను అది చట్ట విరుద్ధం.. ‘పంచాయతీ ఎన్నికలకు జనవరి 2021 నాటికి అర్హత ఉన్న వారందరి పేర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేయలేదనే ఆరోపణలతో ఈనెల 26న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌ను సెన్సూర్ చేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులిచ్చారు. ఇదే అంశంపై డీవోపీటీ కార్యదర్శికి ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ తన పరిధిని దాటి ఇద్దరు ఐఏఎస్‌లను బలవంతపు పదవీ విరమణ చేయాలని సూచించడాన్ని ఆక్షేపిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో నిబంధనలను అతిక్రమించిన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఎస్ఈసీకి ఉంది. ఓటర్ల జాబితా సవరణలో లోటు పాట్లుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసే వెసులుబాటు మాత్రమే ఎస్ఈసీకి ఉంటుంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు 2000లో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల(డి అండ్ ఏ) రూల్స్–1969 ప్రకారం సెన్సూర్ చేయడమంటే చిన్న చిన్న పెనాల్టీలు విధించవచ్చు. ఆ అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ఎస్ఈసీ తన పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి చొరబడి ఇద్దరు ఐఏఎస్ అధికారుల సర్వీసు రికార్డుల్లోకి సెన్సూర్ ఉత్తర్వులను చేర్చడం చట్ట విరుద్ధం. అందువల్ల సెన్సూర్ చేస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎస్ఈసీ డీవోపీటికి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు ఐఏఎస్‌ల గత సర్వీసు రికార్డును పరిశీలిస్తే ఎలాంటి తప్పిదాల్లేవు. సెన్సూర్ ఉత్తర్వులను తోసి పుచ్చండి. తన పరిధిలో లేని అధికారాలను నిర్వహించకుండా ఎస్ఈసీకి సూచిస్తూ ఆదేశాలివ్వండి’ అని కోరారు. -
జనరిక్ మందులపై విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కడప, చిత్తూరు జిల్లాల మీదుగా నిర్మించే కడప–బెంగళూరు 268 కి.మీ. పొడవున నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల ప్రగతిని ప్రధాని ఏపీ, కర్ణాటక సీఎస్‌లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) పథకంపై మోదీ సమీక్షించారు. ప్రధాని మాట్లాడుతూ జనరిక్ మందుల వినియోగంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. జనరిక్ మందుల కేంద్రాల ఏర్పాటుకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సివిల్ ఆస్పత్రుల్లో అద్దెలేని స్థలాలను కల్పించాలని సూచించారు. అటవీ క్లియరెన్స్ రావాల్సి ఉంది నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి వైఎస్సార్ కడప జిల్లాలో 56.04 హెక్టార్ల భూమికి అటవీ క్లియరెన్స్ రావాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ మాట్లాడుతూ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 56 హెక్టార్ల భూమికి అటవీ అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. జన ఔషధి పరియోజన అమలుకు చర్యలు ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు చేపట్టామని సీఎస్ వివరించారు. రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్, బోర్డ్ ఆస్పత్రులు జనరిక్ మందులు వినియోగంలో మంచి ఫలితాలు సాధించాయని, మిగతా అన్ని ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వినియోగంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఎన్నికల విధుల్లో పాల్గొనండి
సాక్షి, అమరావతి: ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కోడ్ అమలు, ఉద్యోగుల విధుల గురించి చెప్పిన ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి కూడా వారికి వివరించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహించడం కష్టమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో బుధవారం జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తానని హమీ ఇచ్చారు. ఇక తమ భద్రతకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు పలు అనుమానాలు లేవనెత్తగా ఆయన నివృత్తి చేశారు. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. సమావేశానంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో మృతిచెందితే రూ.50 లక్షలు ఇవ్వాలి తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని.. కానీ, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా సోకి మృతిచెందితే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరామన్నారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయవద్దని.. ఆరోగ్య సమస్యలున్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. తాము ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉద్యోగులకు న్యాయం జరగలేదని, అయినా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి అడిగితే తమకు రాజకీయాలు ఆపాదించారని, గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించండి అని నినాదాలు చేయించారని తెలిపారు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవలేని వారు కూడా తమను విమర్శిస్తున్నారని, ఉద్యోగులతో వైరం మంచిది కాదని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ తమను వివాదంలోకి లాగిందని, తాము ఎప్పుడూ వారితో విభేదించలేదన్నారు. తమపై వ్యాఖ్యలు చేశాకే తాము వ్యాఖ్యలు చేశామని చెప్పారు. ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఎన్నికలకు సహకరిస్తాం ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పామని, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరగా తాను ఆ విషయాన్ని ఎన్నికల కమిషనర్‌తో చర్చిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరగా ఆయన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఇప్పటికీ ఉద్యోగులు ఎన్నికలకు సిద్ధంగా లేరని.. తమ సంఘం జిల్లాల సభ్యులు ఎన్నికలకు వెళ్లలేమని చెబుతున్నారని చెప్పారు. వారిని ఒప్పించి ఎన్నికలకు సహకరిస్తామని, కానీ.. ఉద్యోగులకు కోవిడ్ నుంచి పూర్తి రక్షణ కల్పించాల్సిందేనని కోరామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. ఎక్కువ వయసున్న ఉద్యోగులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరామన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటామని, పీపీఈ కిట్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారని, అవన్నీ జరిగేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
ఏకగ్రీవాలకు భారీ నజరానా
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావు లేకుండా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించేలా ఏకగ్రీవాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమైతే ఊరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి గరిష్టంగా రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా అందనున్నాయి. పచ్చని పల్లెల్లో ఎన్నికలు కక్షలు, కార్పణ్యాలకు కారణం కాకూడదని, గ్రామీణుల సర్వశక్తులు అభివృద్ధికి దోహద పడాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మధ్య విభేదాలు పొడచూపకుండా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖకు నిర్దేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల వల్ల ప్రజలు వర్గాలుగా విడిపోయి గ్రామాభివృద్ధిని ఇబ్బందుల్లోకి నెట్టరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 12వ తేదీన ఈ ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం విదితమే. ఒక గ్రామానికి ఏడాది వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే అన్ని రకాల గ్రాంట్లు, ఇంటి పన్ను రూపంలో వసూలయ్యే డబ్బుల కంటే ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల ద్వారా అధికంగా నిధులు అందనున్నాయి. నిధుల కొరతతో సమస్యల మధ్య కొట్టుమిట్టాడే గ్రామాలు పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రోత్సాహకంగా భారీగా నిధులను పొందే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్ర హయాం నుంచే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నారు. ప్రోత్సాహకాలపై విస్త్రత ప్రచారం.. పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు ఈనెల 29వతేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్లెల్లో శాంతియుత వాతావరణం వెల్లివిరిసేందుకు ఏకగ్రీవ గ్రామాలకు అందచేసే ప్రోత్సాహక నిధుల గురించి సమాచార శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా అప్పట్లోనే ఏకగ్రీవమయ్యే గ్రామాలకు గరిష్టంగా రూ.20 లక్షలు చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ గతేడాది మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని తాజా ఉత్తర్వులలో సీఎస్ గుర్తు చేశారు. కరోనా కారణంగా అప్పుడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండా ఎన్నికలు వాయిదా పడడంతో ప్రభుత్వం ప్రకటించిన ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులపై మరోసారి తెలియచేయడం సముచితమని భావిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఆనవాయితీ... 73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఇప్పటివరకు నాలుగు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఐదోసారి జరగనున్నాయి. 2001 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సాహకాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్, హర్యానా, తెలంగాణలో కూడా.. గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలలోనూ ఎన్నికల కారణంగా గ్రామాల్లో వైషమ్యాలు చెలరేగకూడదనే ఉద్దేశంతో ఏకగ్రీవమయ్యే చోట్ల ప్రోత్సాహక నిధులు అందచేస్తున్నారు. గుజరాత్లో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే గ్రామాలకు ‘సమ్రాస్’ పథకం పేరుతో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రత్యేక పోత్సాహక నిధులను అందజేస్తోంది. తెలంగాణలోనూ రెండేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలల్లో ఈ తరహా ప్రోత్సాహకాలను అందచేశారు. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ► 2001 ఎన్నికలలో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ అప్పటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అదే ఏడాది ఆగస్టు 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ► 2006లోనూ ఉమ్మడి రాష్ట్రంలో 2,924 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఆయా గ్రామాలకు ప్రోత్సాహక నిధులను విడుదల చేస్తూ 2008 నవంబరు 25వతేదీన అప్పటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ► 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో 13 జిల్లాల పరిధిలో 1,835 గ్రామాలలో ఎన్నికలు ఏకగ్రీవాలు కాగా వాటికి రూ.128.45 కోట్లను విడుదల చేస్తూ 2015 ఏప్రిల్ 23వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ► ఇదే తరహాలో ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవమయ్యే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందజేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్యి 2020 మార్చి 12న ఉత్తర్వులు జారీ చేశారు. -
సీఎస్ ఆదిత్యనాథ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని.. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోందని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. త్వరలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరామని తెలిపారు. సీఎస్ హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? సీఎస్ సానుకూలంగా స్పందించారు.. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సెక్రటరీ బండి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారు. ఉద్యోగులకు ఏమీ జరిగినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌దే బాధ్యత అని తెలిపారు. చదవండి: ‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’ పీపీఈ కిట్లు ఇవ్వాలి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కోరారు. రేపటి భేటీలో ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌ను కోరామని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని ఆయన కోరారు. -
ఎన్నికలు.. వ్యాక్సినేషన్.. ఏకకాలంలో ఎలా?
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు.. ఒకేసారి రెండూ ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌తోపాటు న్యాయస్థానాల మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని నివేదించింది. ఈ రెండు లక్ష్యాలను ఏకకాలంలో ఎలా సాధించాలో మార్గదర్శనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు సోమవారం లేఖ రాశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ... వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది ‘ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3.8 లక్షల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. తరువాత 73,188 మంది పోలీసు సిబ్బందితోపాటు మరో 7 లక్షల మంది ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయించాల్సి ఉంది. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ విభాగాలతోపాటు ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు 2,041 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం. వ్యాక్సిన్లూ వారికే... ఎన్నికల విధులూ వారే ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రంలో దాదాపు 1,35,000 పోలింగ్ కేంద్రాలుండగా ఐదు లక్షల మందికిపైగా పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యా శాఖ ఉద్యోగులను ఎన్నికల విధులకు నియోగించాల్సి ఉంది. వారందరూ కోవిడ్ నియంత్రణలో ఫ్రంట్లైన్లో ఉన్నవారే. అదే ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను ఎన్నికల విధుల కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నియోగించాల్సి ఉంది. పోలీసు సిబ్బంది విషయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 73,188 మంది మాత్రమే ఉన్న పోలీసు సిబ్బంది 1,35,000 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంది. వారిలోనే కొంతమందిని ఎన్నికల నియమావళి పరిశీలన, నాన్ బెయిలబుల్ వారంట్ల జారీ లాంటి విధుల్లో నియోగించాల్సి ఉంది. దీంతో ఒక్కొక్కరికి సగటున వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మూడేసి పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం పోలింగ్ సిబ్బందిని వారు పనిచేస్తున్న, నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా ఉన్న కేంద్రాల్లో విధులు కేటాయించాలి. పనిచేసే చోట వ్యాక్సిన్... మరోచోట విధులు పోలింగ్ విధుల కోసం పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బందిని తరలించడంలో పలు సమస్యలు తలెత్తనున్నాయి. ఉద్యోగులకు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రదేశాల్లోనే వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంది. కానీ ఉద్యోగులను పోలింగ్ విధుల కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారికి వ్యాక్సినేషన్ సాధ్యపడదు. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు ఒక కేంద్రంలో తీసుకున్న సిబ్బంది రెండో డోసు కోసం అదే కేంద్రంలో అందుబాటులో ఉండరు. ఆ తరువాత వారిని కొంతకాలం వైద్య, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచడం సాధ్యం కాదు. ఏఈఎఫ్ఐ (యాంటీ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) ప్రోటోకాల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు, దేశంలో మరికొందరు వ్యాక్సిన్ తీసుకున్న వారు మృత్యువాత పడ్డారన్న విషయం మీకు తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదు, ప్రశాంత వాతావరణంలో ఉండాలి, వైద్య ఆరోగ్య సిబ్బంది పరిశీలనలో ఉంచాలని కోవిడ్ ప్రోటోకాల్ సూచిస్తోంది. ఎలా చేయాలో మీరే చెప్పండి.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, కోవిడ్ వ్యాక్సిన్ రెండూ నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం అనే రెండు లక్ష్యాలను సాధించడం ఎలాగో రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాల్సిందిగా కోరుతున్నా. -
ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర అధికార యంత్రాంగమంతా కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ స్పష్టం చేసినా కూడా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలి విడతలో ప్రకాశం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రకాశం జిల్లాలో రెండో విడత నుంచి, విజయనగరం జిల్లాలో మూడో విడత నుంచి నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 69 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 659 మండలాల్లో 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలోని 146 మండలాల్లో వచ్చే నెల 5న, రెండో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో వచ్చే నెల 9న, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169 మండలాల్లో వచ్చే నెల 13న, నాలుగో విడతలో 19 రెవెన్యూ డివిజన్లలోని 171 మండలాల్లో వచ్చే నెల 17న ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. -
కొమిరేపల్లిలో వింతవ్యాధి
సాక్షి ప్రతినిధి ఏలూరు/దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామానికీ విస్తరించింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి 25 మంది ఫిట్స్‌తో పడిపోయారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో ఇంటింటి సర్వే చేయించారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడి పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. దీంతో ఆయన వెంటనే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్‌ను పంపించగా.. వారు బాధితులను కలిసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి, బాధితులను వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందాలను పిలిపించారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సునంద, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ హెల్త్ డాక్టర్ గీతా ప్రసాదిని తదితరులు ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించారు. ఇదిలావుండగా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా, గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన ఘంటశాల వెంకటలక్ష్మి వైద్య శిబిరం వద్ద హడావిడి చేశారు. స్థానికులతో గొడవకు దిగిన జనసేన నేతలు ఒక దశలో జిల్లా ఎస్పీని సైతం తోసేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వెంకటలక్ష్మి కింద పడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులను తీసుకెళ్లే అంబులెన్స్‌కు అడ్డంగా కూర్చున్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : సీఎస్ ప్రజల ఆరోగ్యంపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. కొమిరేపల్లిలో బాధితులు, వారి కుటుంబ సభ్యులను కలిసి ఏవిధంగా అనారోగ్యం పాలైందీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కుట్రే : ఆళ్ల నాని జిల్లాలో వరుస ఘటనల వెనుక ప్రజలు అనుకుంటున్నట్లుగానే తానూ రాజకీయ కుట్ర కోణం ఉన్నట్లు భావించాల్సి వస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. వ్యాధి నుంచి కోలుకున్న బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన ఆయన వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో వింత వ్యాధి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపామని, రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులను తరలిస్తుండగా జనసేన నేతలు అంబులెన్స్‌ను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ఇదంతా చూస్తుంటే జిల్లాలో ప్రజలకు ఏదో రాజకీయ కుట్ర జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయన్నారు. -
ఎన్నికల విధులు నిర్వర్తించలేం
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్ ఇచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించలేమని అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి తెలిపాయి. వ్యాక్సిన్ ఇచ్చేవరకూ పంచాయతీ ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చాయి. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వైవీ రావు, కోశాధికారి, పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వి.మురళీకృష్ణనాయుడు, టీచర్ల సంఘాల జేఏసీ చైర్మన్ జి.వి.నారాయణరెడ్డి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, కార్యదర్శి బి.కిషోర్‌కుమార్ తదితరులు సీఎస్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు సీఎస్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగులపై ఎందుకీ కాఠిన్యం? అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల అభ్యంతరాలను తొమ్మిది పేజీల లేఖలో సీఎస్‌కు తెలిపామన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు డోసుల వ్యాక్సిన్ అందేవరకు ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ అభ్యర్థనను, ఉద్యోగుల ఆందోళనను పెడచెవినపెట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో పూర్తయ్యేది కాదని, కనీసం నెలరోజులపాటు నిత్యం ఉద్యోగులతో, ఓటర్లతో మమేకం కావాల్సి ఉంటుందని తెలిపారు. 1.40 లక్షల పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, బ్యాలెట్ బాక్సులు, సరంజామా తీసుకోవాలని, ఈ క్రమంలో ఎక్కడైనా కరోనా బారినపడే ముప్పు ఉందని చెప్పారు. ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్ ఎందుకు ఇంత కఠినవైఖరితో ఉన్నారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత కార్యాలయ ఉన్నతాధికారులను సైతం వదలకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయి వ్యక్తిని తొలగించారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వ్యాక్సిన్ పంపిణీ, ఎన్నికల నిర్వహణ రెండు ఒకేసారి చేపట్టడం ఉద్యోగులకు ఎలా సాధ్యమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా భయంతో ఎన్నికల విధులంటేనే హడలిపోతున్నాం కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ప్రబలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. కరోనా భయంతో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖంగా ఉన్నవారిని ఎన్నికల విధులకు కేటాయించవద్దని, సుముఖంగా ఉన్న ఉద్యోగులను.. అదీ వారికి వ్యాక్సిన్లు వేసిన తరువాతే ఎన్నికల విధుల్లో నియమించాలని కోరారు. కరోనా వైరస్ మ్యుటేషన్ చెందుతూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైతే కరోనా బారినపడే ప్రమాదం ఉందని కలవరపడుతున్నట్టు పేర్కొన్నారు. -
ఒకవైపు టీకా.. మరోవైపు ఎన్నికలా? సాధ్యం కాదు
ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్నికల విధుల్లో కూడా వీరే కీలకం. వాళ్లే ముందు వ్యాక్సిన్ తీసుకోవాలన్న కేంద్ర మార్గదర్శకాల మేరకే ముందుకు వెళుతున్నాం. ప్రధానంగా వ్యాక్సిన్ తీసుకున్న వారు కొద్ది రోజుల పాటు పరిశీలనలో (అబ్జర్వేషన్) ఉండటం తప్పనిసరి. ఏవైనా అలర్జీలు, రియాక్షన్లు తలెత్తుతున్నాయా? ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయా? తదితర అంశాలను నిరంతరం పరిశీలించాలి. వారు రెండో డోసు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొంత వ్యవధి తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఆచరణ సాధ్యం కాదు. మరోవైపు హైకోర్టు కూడా ఎన్నికలతో పాటు వ్యాక్సినేషన్ కూడా ముఖ్యమేనని స్పష్టంగా చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తూనే అదే సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడం ఆచరణ సాధ్యం కాదు కాబట్టే సుప్రీంకోర్టుకు వెళుతున్నాం. అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై సోమవారం విచారణ జరగనుంది. అంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎస్ఈసీని కోరుతున్నాం. – ఎస్ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టంగా చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ... రాష్ట్రంలో కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టామని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారికి వ్యాక్సిన్ అందించాల్సి ఉందని తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు శుక్రవారం ఆయనొక లేఖ రాశారు. ‘‘కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ రెండు డోసులివ్వాలి. మొదటి, రెండో డోసులకు మధ్య నాలుగు వారాల వ్యవధి అవసరం. రెండో డోసులూ తీసుకున్న నాలుగు వారాల తర్వాతే వారిలో పూర్తిస్థాయి యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ విధుల్లో కూడా ఈ ఫ్రంట్‌లైన్ వారియర్సే కీలకమవుతారు. మరి వారికి టీకా ఇవ్వటం ఎలా? ఇవ్వకపోతే కేంద్ర మార్గదర్శకాలను పాటించనట్లే. పైపెచ్చు వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెడుతున్నట్టే’’ అని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్ర నిబంధనలను ఉల్లంఘించినట్లే’ అని లేఖలో స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్పెల్పీ) దాఖలు చేసిందని, ఇది సోమవారం విచారణకు రానున్నదని సీఎస్ తన లేఖలో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన 60 రోజుల తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజారోగ్యం, ప్రజాభ్యుదయం దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని ఎస్ఈసీని తన లేఖలో దాస్ అభ్యర్థించారు. ఈ లేఖను అందచేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లగా వారిని కలిసేందుకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇష్టపడలేదు. తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఆ లేఖను తీసుకున్నారు. ఎస్ఈసీకి సీఎస్ రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► హైకోర్టు ఆదేశాలతోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఎస్ఈసీ కొందరు అధికారులను నిబంధనలను పాటించకుండా తొలగించారు. ఆ అధికారులు ‘కోవిడ్–19 వ్యాక్సినేషన్’ కార్యక్రమం అమలులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తొలగింపును వాయిదా వేస్తున్నాం. ► రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ► ఎన్నికల షెడ్యూలు జారీ చేయక ముందే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో అర్థవంతమైన సంప్రతింపులు జరిపి ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధంగా ఉందో లేదో అంచనా వేసుకోవాలి. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అవి రెండూ ముఖ్యమేనని స్పష్టం చేసింది. ► ఎస్ఈసీపై రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత గౌరవం ఉంది. అవసరమైనంత మేరకు సిబ్బందిని ఎస్ఈసీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ► ఎన్నికల షెడ్యూలుపై హైకోర్టు ఉత్తర్వుల తర్వాత పోలీసు శాఖ, ఎన్నికల ప్రక్రియలో భారీ ఎత్తున పాల్గొనే వివిధ శాఖల అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మీ దృష్టికి తెస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను నిర్వహించే ఈ శాఖల సిబ్బందికి మొదటి, రెండో విడతల కింద వ్యాక్సినేషన్ అందించాలి. ఈ సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ► ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఎన్డీఎంఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన 60 రోజుల తర్వాతే ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ► ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ఈ రెండు కార్యక్రమాలను సజావుగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో ఎస్ఈసీ మీద కూడా అంతే ఉందనే విషయం మీకు తెలియంది కాదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలంటే ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూలును సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ► ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారి ఆరోగ్యం, బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నది మీకు తెలుసు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాధి నిరోధక శక్తి పెంపొందినప్పుడు వారిని ఎన్నికల విధులకు వినియోగిస్తాం. ► పంచాయతీ ఎన్నికల షెడ్యూలు ప్రభావం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై పడుతుందనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి షెడ్యూలులో కేంద్రం ఏవైనా మార్పులు సూచిస్తే ఆ మేరకు వ్యవహరిస్తాం. ఈ అంశాలను వివరిస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్సెల్పీ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ► ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వ్యాక్సినేషన్, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా కొత్త షెడ్యూలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలు, పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వ్యాక్సిన్ ఇచ్చి వారిలో నైతిక స్థైర్యం నింపడానికి సిద్ధంగా ఉంది. -
ఎస్ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ లేఖ
సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సీఎస్ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన లేఖలో కోరారు. ‘‘ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్ అవసరం. మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 4 వారాల వ్యవధి అవసరమని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మొదటి దఫా వ్యాక్సినేషన్ పూర్తయ్యాక.. 60 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. చదవండి: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ తొలి విడతలోనే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరని కేంద్రం చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా చేస్తే కేంద్రప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లే. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలు రెండూ సజావుగా జరగాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని’’ సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశామని.. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేవరకు ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని సీఎస్ విజ్ఞప్తి చేశారు. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ -
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో ఉద్యోగ సంఘాలు శుక్రవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎస్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేంత వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ ‘‘గత 10 నెలలుగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో మేం ముందు వరుసలో ఉండి పనిచేశాం. వ్యాక్సినేషన్ ఇస్తున్న సమయంలో ఎన్నికలకు ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పొందే సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండూ ఒకే సమయంలో ఎలా సాధ్యం. మేం వ్యాక్సినేషన్ తీసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొనడం సాధ్యం కాదు. మాకు వ్యాక్సిన్ రెండు డోస్‌లు ఇచ్చాక.. ఎన్నికల విధుల్లో పాల్గొంటామని’’ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.చదవండి: విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు -
ప్రకృతి సేద్యానికి ఏపీ తీసుకుంటున్న చర్యలు భేష్
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవని ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ చేపడుతున్న చర్యల నుంచి పలు దేశాలు నేర్చుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని మరింతగా విస్తరించేందుకు ఐక్యరాజ్య సమితి తన వంతు తోడ్పాటును అందజేస్తుందని హామీ ఇచ్చారు. త్రిపాఠి ఈ నెల 16, 17 తేదీల్లో రాష్ట్ర రైతు సాధికార సమితి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్‌తో కలసి విజయనగరం జిల్లాలోని వివిధ గిరిజన గ్రామాల్లో పర్యటించి.. ప్రకృతి సేద్యం(ఆర్గానిక్ ఫార్మింగ్) కోసం అక్కడి గిరిజన రైతులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం చేస్తున్న 93 గిరిజన గ్రామాల రైతుల పనితీరును ఆయన గమనించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. పర్యటనలో భాగంగా మంగళవారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో కొద్దిసేపు భేటీ అయ్యారు. త్రిపాఠి మాట్లాడుతూ ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, సీఎం వైఎస్ జగన్ ముందుచూపును ప్రశంసించారు. హానికారక రసాయనాలు, సింథటిక్ ఎరువుల స్థానే ప్రకృతి సేద్యం పట్ల సీఎం చూపిస్తున్న ఆసక్తి ఎన్నతగినదన్నారు. ఈ లక్ష్య సాధనలో రాష్ట్రానికి తమవంతు తోడ్పాటును అందిస్తామని చెప్పారు. ప్రతి గ్రామం ప్రకృతి సేద్య గ్రామంగా అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో హానికారక రసాయనాలు, సింథటిక్ ఎరువుల స్థానే ఆర్గానిక్ ఫార్మింగ్‌ను మరింత విస్తరింప చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. త్వరలో ప్రకృతి సేద్యంపై రాష్ట్ర స్థాయిలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ భేటీలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ పాల్గొన్నారు. -
సంక్షేమ కార్యక్రమాల అమలు ఆపండి
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేలా.. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆదిత్యనాథ్‌దాస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ శనివారం లేఖ రాశారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి.. గ్రామీణ ప్రాంత ఓటర్లకు పథకాల లబ్ధిని అందజేయకూడదని స్పష్టం చేశారు. అయినా కూడా ఇలాంటి పనులు చేస్తే.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
ఎస్ఈసీతో ముగిసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్‌తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అధికారుల భేటీ ముగిసింది. ఎస్ఈసీతో గంటన్నరపాటు సీఎస్ బృందం సమావేశం కొనసాగింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ బృందం తెలిపింది. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. (చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి) కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించామని సీఎస్ బృందం పేర్కొంది. కేంద్రం సూచనలతో ఇవాళ కూడా డ్రైరన్ నిర్వహించామన్నారు. తొలి విడతగా కోటిమందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందని, 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున వ్యాక్సినేషన్‌కు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని సీఎస్ బృందం తెలిపింది. రాష్ట్రంలోని యంత్రాంగమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉందని.. వాలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి ఉందని సీఎస్ తెలిపారు.(చదవండి: మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు) -
సమన్వయంతో కోవిడ్ టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు త్వరలో చేపట్టనున్న టీకాల ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సూచించారు. తొలి విడతలో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్ టీకాలకు సంబంధించి బుధవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఐసీడీఎస్ వర్కర్లతో కలిపి 3.70 లక్షల హెల్త్‌కేర్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నట్లు వివరించారు. పోలీసులు, ఆర్మ్డ్ ఫోర్సు, హోంగార్డులు, జైళ్ల సిబ్బంది, విపత్తు నిర్వహణ సంస్థ వలంటీర్లు, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, మున్సిపల్ వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది తదితర 9 లక్షల మందికి టీకా అందిస్తామన్నారు. 50 ఏళ్లు దాటి షుగర్, బీపీ, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి తొలివిడత కోవిడ్ టీకాల్లో ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. టాస్‌్కఫోర్స్ కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై సమీక్షిస్తాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు, సలహాల కోసం ఏర్పాటైన కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పని చేస్తాయన్నారు. 1,677 కోల్డ్ చైన్ పాయింట్లు వ్యాక్సిన్ నిల్వ, సరఫరా, కోల్డ్ చైన్ల నిర్వహణ, ఐస్ బాక్సులు, ప్రీజర్లు తదితర అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్ సమీక్షించారు. తొలి విడత వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,677 కోల్డ్ చైన్ పాయింట్లు (వ్యాక్సిన్ స్టోరేజి పాయింట్లు) సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కె.భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టీకా రవాణా కోసం 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉషో్ట్ణగ్రత ఉండేలా 19 ఇన్సులేటెడ్ వ్యాక్సిన్ వ్యాన్లను సిద్ధం చేశామని, మరో 26 సిద్ధమవుతున్నాయని తెలిపారు. 17,032 మంది వ్యాక్సినేటర్లు (ఎఎన్ఎం), 7,459 ఆరోగ్య ఉప కేంద్రాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. పది కోట్ల డోసులకు సరిపడే కోల్డుచైన్ నిర్వహణకు స్థలం ఉందని చెప్పారు.