
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ మాట్లాడుతూ పోలీస్ శాఖ విజ్ఞప్తి మేరకు ఆ శాఖ సిబ్బందికి 25 నుంచి 27 వరకు తొలి విడత డోస్ ఇచ్చేందుకు సైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ రెండో విడతలో 5,86,078 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment