అవినీతి నిర్మూలనకే రివర్స్‌ టెండరింగ్‌ | Adithyanath Das Letter to Jalshakti Department over Polavaram Works | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలనకే రివర్స్‌ టెండరింగ్‌

Published Sat, Sep 14 2019 4:30 AM | Last Updated on Sat, Sep 14 2019 5:44 AM

Adithyanath Das Letter to Jalshakti Department over Polavaram Works - Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలను పూర్తిస్థాయిలో వెలికితీయడానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో విచారణ చేయిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టం చేశారు. పోల వరం ప్రాజెక్టు పనుల్లో అవినీతిని నిర్మూలించి.. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టామని తెలియజేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్ర జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కో అధికారులు అందజేసిన రికార్డుల ఆధారంగానే పోలవరం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో రూ.2,346. 85 కోట్ల అక్రమాలు జరిగా యని నిపుణుల కమిటీ జూలై 24న నివేదిక ఇచి్చం దని వివరించారు. ఆ నివేదికలో కమిటీ చేసిన సిఫార్సు మేరకే పోలవరం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశామని పేర్కొన్నారు. దీనివల్ల సమన్వయ లోపం ఉత్పన్నం కాదని, శర వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని తెలిపారు. కాంట్రాక్టర్లకు చేసిన అదనపు చెల్లింపులను నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రికవరీ చేస్తామన్నారు. సోమవారం ఢిల్లీకి చేరుకోనున్న ఆదిత్య నాథ్‌ దాస్‌ కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో సమావేశమై.. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను వివరించి సవరించిన  నిధులు విడుదల చేయాలని కోరనున్నారు.

నిపుణుల కమిటీ నివేదిక ప్రధానికి..  
టీడీపీ సర్కారు హయాంలో ఇంజనీరింగ్‌ పనుల్లో  అక్రమాలపై విచారణకు జూన్‌ 14న నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులపై విచారణ చేపట్టిన నిపుణుల కమిటీ భారీగా అక్రమాలు జరిగినట్లు తేలి్చంది. పనులను ప్రక్షాళన చేసి.. రెండేళ్లలోగా ప్రాజె క్టును పూర్తి చేయాలంటే రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని సూచిస్తూ జూలై 24న ప్రభుత్వానికి నివేదిక ఇచి్చంది. క్షేత్రస్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బహిర్గతమవుతాయని పేర్కొంది. కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించిన బిల్లులను రికవరీ చేయాలని తెలిపింది. ఆగస్టు 6న ఢిల్లీకి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై.. పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదికను అందజేశారు. సిఫార్సులను అమలు చేయడంలో భాగంగానే ఆగస్టు 17న పోలవరం హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) నిపుణుల కమిటీ నివేదికను కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపి వివరణ కోరింది. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా రో వివరణ ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖకు గత నెల 29న కేంద్ర జల్‌ శక్తి శాఖ లేఖ రాసింది. దీనికి బదులిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తాజాగా లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement