సాక్షి, అమరావతి: యాస్ తుపాను దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని తెలిపారు.
సీఎస్ ఆదిత్యనాథ్ శ్రీకాకుళం జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని సీఎస్ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని.. విద్యుత్‌కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్ సిద్ధం చేశాం అని ఆదిత్యనాథ్ సీఎం జగన్‌కు తెలిపారు.
చదవండి: Cyclone Yaas: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment