
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించారు. సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినిందని, రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయిందని, అందు వల్లే రాష్ట్రం అప్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉందని, లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. కరోనా చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పోలవరం సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం ప్రోగ్రెస్‌లో ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment