
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయ తొలి భవనంలోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ కానుంది. కోవిడ్ నియంత్రణ, కర్ఫ్యూ ఆంక్షల సడలింపు, థర్డ్ వేవ్‌పై సన్నద్ధత, ఖరీఫ్ సన్నద్ధత తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన అంశాలను ఈ నెల 28వ తేదీలోగా సాధారణ పరిపాలన (కేబినెట్ విభాగం) శాఖకు పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్ని శాఖలను ఆదేశించారు.