సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ఆర్కే సింగ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ, తెలంగాణ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ కలిశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ఈనెల 18న తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందజేశారు. మేజర్ జనరల్ ఆర్కే సింగ్‌తో పాటు రిటైర్డ్ కల్నల్ రాంబాబు కూడా సీఎంను కలిశారు.
సీఎస్‌తో ఆర్కే సింగ్ భేటీ
ఆర్కే సింగ్ శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను కలిశారు. ఈనెల 18న తిరుపతిలో నిర్వహించనున్న వేడుకలకు సీఎస్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఆర్కే సింగ్ సీఎస్‌ను కోరారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను రక్షణ శాఖ నుంచి మంజూరు చేయించాలని కోరారు. ఇలా ఉండగా, డీజీపీ సవాంగ్‌ను కూడా ఆర్కే సింగ్ కలిశారు. తిరుపతిలో నిర్వహించే వేడుకలకు రావాలని ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment