
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీ డీఆర్పీ)లో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.1,777.38 కోట్లతో చేపట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ పనులపై రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులతో మంగళవారం సీఎస్ సమీక్షించారు.