world bank representatives
-
ఏపీలో బోధనకు కితాబు
గుడ్లవల్లేరు: ఏపీలో బోధన విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మెచ్చుకున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సోనాల్సిల్వ గుండె(మహా రాష్ట్ర), నళినీకుమార్ మిశ్రా(బిహార్)లు గురువారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)ను సందర్శించారు. డైట్లో జరుగుతున్న బోధన, బోధనేతర కార్యక్రమాల్లో ప్రతి అంశాన్నీ డైట్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణను సోనాల్ సిల్వ గుండె, నళినీకుమార్ మిశ్రాలు అడిగి తెలుసుకున్నారు. వుయ్ లవ్ రీడింగ్‌లో భాగంగా జరిగిన పుస్తక సమీక్షలను పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్, గణిత ప్రయోగశాల, సైన్స్ ల్యాబ్, భాషా ప్రయోగశాలను చూసి ప్రశంసించారు. డైట్ రేడియో స్టేషన్‌ను తిలకించారు. దేశంలో వివిధ విద్యా సంస్థలను చూశామని.. ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ నిర్వహించడం లేదని అధ్యాపకులను అభినందించారు. మిగిలిన విద్యా సంస్థల్లో ఈ విధానాలు అమలయ్యేలా సూచిస్తామన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలు భేష్
పెనమలూరు/కంకిపాడు: మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారాయని, మౌలిక వసతులు భేషుగ్గా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కితాబిచ్చింది. కృష్ణా జిల్లా కంకిపాడులోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాల, జెడ్పీ పాఠశాల, పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు (ఎస్‌ఏఎల్‌టీ) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఈ బృందం వచ్చింది. ఆయా పాఠశాలల్లో భవన నిర్మాణాలు, కల్పించిన మౌలిక వసతులను పరిశీలించి, నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసింది. పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్న సామగ్రిని పరిశీలించింది. తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సాగిస్తున్న బోధన తీరును ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. నాణ్యత, మౌలిక వసతులతో పాఠశాలల రూపురేఖలు మారడంతో విద్యా ప్రమాణాల స్థాయి పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాడు–నేడు ద్వారా తొలి దశ, రెండో దశల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, కేటాయించిన నిధులు, మౌలిక వసతుల కల్పన చర్యలను నాడు–నేడు ప్రత్యేక అధికారి మురళి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలి.. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ టాస్క్ టీమ్ లీడర్ కార్తీక్ పెంతల్ మాట్లాడుతూ.. నాడు–నేడు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పించిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయికి ఎదగాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు, వసతులు బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆకునూరు మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అతుర్పానే, ట్రైసీవిలి కౌష్కి, ఆదిత్య శర్మ, స్వాతి గమేలియల్, సురభి, దీప బాలకృష్ణన్, కాంచన్ రాజీవ్‌సింగ్, తనూష్ మాధుర్, కృష్ణా డీఈవో తాహేరా సుల్తానా, పలువురు కన్సల్టెంట్లు పాల్గొన్నారు. -
ఏపీ డీఆర్పీ పనులపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీ డీఆర్పీ)లో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.1,777.38 కోట్లతో చేపట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ పనులపై రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులతో మంగళవారం సీఎస్ సమీక్షించారు. -
విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
-
మీ చర్యలు స్ఫూర్తిదాయకం
సాక్షి, అమరావతి : విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. మానవ వనరులపై పెట్టుబడుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, వాస్తవిక అభివృద్ధి సిద్ధిస్తుందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. సచివాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్‌తో దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజినల్ డైరెక్టర్ షెర్ బర్న్ బెంజ్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంకు బృందం భేటీ అయ్యింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేసిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రను ప్రపంచ బ్యాంకు బృందం ప్రస్తావించింది. క్షేత్ర స్థాయిలో చూసిన అనేక సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు తన పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారన్న విషయాన్ని తాము తెలుసుకున్నామని వెల్లడించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను సీఎం వారికి సమగ్రంగా వివరించారు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. వీటిని ఇంటర్నెట్ ద్వారా కలెక్టరేట్లతో అనుసంధానం చేశామని, వచ్చే మూడేళ్లలో భూముల రిజిస్ట్రేషన్ కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలు, ఒక నర్సు, ఒక ఏఎన్ఎంతో నిత్యం వైద్యం అందించేలా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో గ్రామాల్లో సమగ్ర మార్పులను తీసుకు వస్తామన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2 వేల వ్యాధులకు చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇప్పుడున్న 11 బోధనాసుపత్రులను 27కు పెంచుతున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగేందుకు పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మఒడి, విద్యా వసతి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరుగుతాయని వివరించారు. తద్వారా వలసలు తగ్గి నగరాలు, పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజినల్ డైరెక్టర్ బెంజ్ తల్లిదండ్రులకూ విజ్ఞానాన్ని పంచేలా.. చివరి ఏడాది మరో వినూత్న కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నట్లు సీఎం జగన్ ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన ట్యాబ్ ఇచ్చి, డిజిటల్ క్లాసులతో అనుసంధానం చేస్తామన్నారు. వీటి ద్వారా వారు నేర్చుకోవడమే కాకుండా, వ్యవసాయం సహా ఇతర అంశాల్లో తల్లిదండ్రులకు అవసరమైన విజ్ఞానాన్ని పంచడానికి వీలుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం సమూల మార్పులను తీసుకు రావడానికి ఉపయోగపడుతుందని సీఎం ఆకాక్షించారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి ఇటీవల అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా సీఎం జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో లెజిస్టేటివ్ కేపిటల్, కర్నూలులో జుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్క అమరావతి ప్రాంతంలోనే మౌలిక వసతులకు రూ.1.9 లక్షల కోట్లకు పైగా వెచ్చిస్తే, మిగతా ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. అందుకే ఇప్పటికే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్న విశాఖలో పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ నగర స్థాయిని మరింతగా పెంచుతుందన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టేవారు ఆసక్తి చూపిస్తారని, భవిష్యత్తులో పెద్ద నగరాలతో పోటీపడే స్థాయికి చేరుకుంటామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు హెల్త్, న్యూట్రిషన్ అండ్ పాపులేషన్ లీడ్ ఎకనమిస్ట్ డాక్టర్ అజయ్ టాండన్, లీడ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ షబ్నం సిన్హా, సీనియర్ హెల్త్ స్పెషలిస్ట్ మోహినీ కక్, సీనియర్ స్పెషలిస్ట్‌లు కార్తీక్ పెంటల్, ప్రవేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, సీఎం కార్యాలయ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, డాక్టర్ పీవీరమేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు భేష్ : ప్రపంచ బ్యాంకు బృందం – నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చేపట్టడం మంచి పరిణామం. – ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్ కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు సంస్థల ఏర్పాటు ప్రశంసనీయం. – గ్రామ, వార్డు సచివాలయాలు కలెక్టరేట్లు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానంతో పాలన వేగవంతం. – సచివాలయాలకు డేటా అందుబాటులో ఉంచడం వల్ల చక్కటి ఫలితాలొస్తాయి. – ఆరోగ్యం, విద్య, వైద్యం సహా పలు రంగాల్లో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకం. ఈ అంశాల్లో తగిన విధంగా సహాయం అందిస్తాం. – నాలుగు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసి, ఇతరత్రా ఏయే కార్యక్రమాలకు సహాయం అందించాలన్నదానిపై ఒక అవగాహనకు వస్తాం. -
ప్రపంచ బ్యాంక్ అధికారులతో సీఎం జగన్ భేటీ
-
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ
సాక్షి,అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్‌బర్న్ బెంజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం వారితో చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి వివరించారు. (చదవండి : చదువుల విప్లవంతో పేదరికానికి చెక్) ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కొనియాడారు. మానవ వనరులపై పెట్టుబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ప్రతినిధులు వెల్లడించారు. (చదవండి : ఇదీ.. నా కల) -
ప్రపంచ బ్యాంకులో పాక్‌కు ఎదురుదెబ్బ!
వాషింగ్టన్ : ప్రపంచ బ్యాంక్‌లో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన కిషన్ గంగ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సింధు జలాల ఒప్పందం 1960కి విరుద్ధమని పాక్ ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించింది. పాక్ అభ్యంతరాలను తొసిపుచ్చిన వరల్డ్ బ్యాంక్, వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడిని ఏర్పాటు చేయాలన్న భారత్ వాదనలను ఆమోదించింది. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్‌యాంగ్ కిమ్ పాక్ ప్రభుత్వానికి సూచించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. గత గురవారమే అటార్నరీ జనరల్ ఆఫ్ పాకిస్తాన్‌కు (ఏజీపీ) ప్రపంచ బ్యాంకు నుంచి ఓ లేఖ అందిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పాక్ వదులుకుంటే భారత్ సూచించినట్లుగా ఈ వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడు నియమిస్తామని ఆ లేఖలో ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. గత నెల జమ్మూ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జీలం ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై 330 మెగావాట్ల జలవిద్యుత ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌తో తమకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పాక్ తొలి నుంచి వాదిస్తూ వస్తోంది. ఈ వివాదం పరిష్కారానికి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలోనే పాక్ ప్రపంచ బ్యాంకును కోరింది. నది గమనంలో మార్పులేకపోయినా, దిగువకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుందని పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2007లో భారత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఆశ్రయించింది. దీనిపై స్టే విధించడంతో నిర్మాణ పనులు మూడేళ్లపాటు నిలిచిపోయాయి. కానీ 2013లో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ‘ఇది సింధు జలాల ఒప్పందంలో భాగమే. జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకునే హక్కు భారత్‌కు ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ప్రకారం కూడా భారత్ ఆ నదులపై డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు’ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరోవైపు వరల్డ్ బ్యాంకు కూడా ఒప్పందానికి లోబడే భారత్ జీలం, చీనాబ్ ఉప నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ చెబుతోంది. -
పాక్ ఝలక్.. భారత్‌పై ఫిర్యాదు
ఇస్లామాబాద్: భారత్‌కు పాక్ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కిషన్ గంగ జలవిద్యుత్ ప్రాజెక్టు విషయంలో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైపోయింది. జమ్ము పర్యటన సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే కిషన్‌గంగ జలవిద్యుత ప్రాజెక్టు.. సింధు జలాల ఒప్పందం 1960కి విరుద్ధమని పాక్ వాదిస్తోంది. ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసే విషయాన్ని రేడియో పాకిస్థాన్ సోమవారం ధృవీకరించింది. రానున్న మూడు రోజుల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో తమ అధికారులు చర్చలు జరుపుతారని పాక్‌లో అమెరికా రాయబారి అయిజాజ్ చౌద్రి మీడియాకు వెల్లడించారు. ఈ వివాదం పరిష్కారానికి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలోనే ప్రపంచ బ్యాంకును కోరింది కూడా. కాగా, ఈ ప్రాజెక్టు డిజైన్‌తో తమకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పాక్ తొలి నుంచి వాదిస్తూ వస్తోంది. నదీ గమనంలో మార్పులేకపోయినా, దిగువకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుందని పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2007లో భారత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఆశ్రయించింది. దీనిపై స్టే విధించడంతో నిర్మాణ పనులు మూడేళ్లపాటు నిలిచిపోయాయి. కానీ 2013లో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ‘ఇది సింధు జలాల ఒప్పందంలో భాగమే. జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకునే హక్కు భారత్‌కు ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ప్రకారం కూడా భారత్ ఆ నదులపై డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు’ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరోవైపు వరల్డ్ బ్యాంకు కూడా ఒప్పందానికి లోబడే భారత్ జీలం, చీనాబ్ ఉప నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ చెబుతోంది. -
పల్లె ప్రగతితో దేశాభివృద్ధి
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వినయ్, బాలకృష్ణ కోహీర్: పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలని, పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వినయ్, బాలకృష్ణ అన్నారు. సెర్ప్ అధికారులతో కలిసి వారు మండలంలోని బడంపేట, ఖానాపూర్, కోహీర్‌లో మంగళవారం పర్యటించి ఉత్పత్తిదారులు, సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మండలాల్లో, జిల్లాలోని 17 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రపంచ బ్యాంకుతో కలిసి రూ. 650 కోట్లతో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో రూ. 450 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులు, రూ. 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెర్ప్ అధికారులు వంశీ, సత్యదేవ్, డీపీఎంలు వాసుదేవ్, రాజు, ఏసీ యాదయ్య, ఎంపీపీ జంపాల అనిత, సర్పంచులు పుష్ప, శంకర్, ఈఓపీఆర్డీ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎంలు సమ్మయ్య, సమత, పంచాయతీ కార్యదర్శులు అశోక్‌రెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.