
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులను నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలు, సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా, సబ్ డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండాలంటే ప్రత్యేక పాసులుండాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment