సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల ను కలిపే గోదావరి చుట్టూ ఉన్న అపోహలు.. మరెన్నో జల జగడాలకు ఇక తెర పడినట్లే. ఏళ్ల తరబడిగా అపరిషృతంగా ఉన్న సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపినట్లే. మంగళవారం ముంబైలోని రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ జరిపిన చర్చలు సానుకూలంగా ముగి యడం శుభపరిణామంగా భావిస్తున్నారు.అంతర్రాష్ట జలవివాదాలలో కీ లకాంశాలుగా మారిన ప్రాణహిత-చేవెళ్ల, లెండి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. అంతకు ముం దే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడంతో సరిహద్దులో మన జిల్లాకు సంబంధించి లెండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు ముందు కు సాగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమన్వయంతో గోదారి జలాల వాడకం
లెండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అవకాశం కలిగింది. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని మహారాష్ర్ట సీఎం ఫడ్నవిస్ పేర్కొనట్లు ప్రకటించారు. లెండి ప్రాజెక్టు నిర్మాణం గురిం చి నిపుణుల కమిటీ ఏర్పాటు, ప్రాజెక్టు నిర్మాణం, నష్టపరిహారం చెల్లింపు, అనుమతులు, నీటివినియోగం తదితర అంశాలను ఆ కమిటే పర్యవేక్షిస్తుందని కూడా వెల్లడిం చారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున మహారాష్ర్ట సహకరించాలన్న సీఎం కేసీఆర్ కోరికపై ఫడ్నవిస్‌ను సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. గోదావరి జలాలను సమన్వయంతో వాడుకోవడంతోపాటు, అంతర్రాష్ట నీటిపారుదల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసుకోవాలన్న ఇరు రాష్ట్రాల సీఎంల ప్రకటనపై జిల్లాలో సంతోషం వ్యక్తమవుతోంది.
తొలగిన ఆటంకాలు
1984లో అప్పటి ప్రభుత్వాలు లెండి ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాందేడ్ జిల్లా మథ్కేడ్ తాలూకా గోనేగావ్ వద్ద గల వాగుపై ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. పనులు మొదలైతే అయ్యాయి కానీ, 30 సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. 11,214 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా చే పట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పదే పదే ఇరు రాష్ట్రాల మధ్యన తలెత్తిన వివాదాలు అడ్డంకిగా మారాయి. 1984లో రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వే యగా 2003 నాటికి అది రూ.275.84 కోట్లకు చేరింది. ప్రస్తుత అంచనా రూ.554.55 కోట్లు. ఇందులో రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉం డ గా, రూ.266.10 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూ.189.79 కోట్లు మహారాష్ట్రకు చెల్లించిన తర్వాత, రాష్ట్ర విభజన అనంత రం పరిణామాలను కూడా చర్చించడంతో లెండికి ఇక అడ్డంకులు తొలగినట్లే అంటున్నారు.
రాజన్న కలల ప్రాజెక్టుకు మోక్షం
ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి మాహారాష్ట్రతో జల వివాదాలున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాలలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీ పనులు పూర్తయితే 3.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టుగా డిజైన్ చేసిన దీనికి ఆయన మరణానంతరం ఆనేక ఇబ్బందులు తలెత్తాయి. జల వివాదాలు గండంగా మారినా, పాలకులు పరిష్కారం కోసం ఆలోచించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు బుధవారం మహారాష్ర్టతో చర్చలు జరపడంతో పురోగతి ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లాలోని 20, 21, 22 ప్యాకేజీల ద్వారా నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, మెదక్ జిల్లాలకు కొంత ఆయకట్టుకు లబ్ధి జరుగుతుంది.
20వ ప్యాకేజీ జిల్లా పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి 25 టీఎంసీల నీటిని తోడి, నిజామాబాద్ మండలంలోని మాసాని జలాశయానికి తరలించేందుకు ఈ పనులు రూ. 892.67 కోట్లతో శ్రీకారం చుట్టారు. 21వ ప్యాకేజీ కింద రూ.1.143.78 కోట్లతో చేపట్టిన పనులలో మాసాని చెరువు నుంచి 8 టీఎంసీల నీటిని కాలువల ద్వారా, మరో 17 టిఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా మంచిప్ప, కొడెం చెరువులను నింపాల్సి ఉంది. ఇలా అనేక ప్యాకేజీల పనులు సాగుతున్నా.. జల వివాదాలు పరిష్కారం కాకపోతే ప్రయోజనం ఉండదని భావిస్తున్న తరుణంలో ఇరు రాష్ట్రాల మధ్యన చర్చలు జరగడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
మంచిరోజులు
Published Wed, Feb 18 2015 2:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement