రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇస్తున్న విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దూరంగా ఉంటున్నారు. గత వారంలో నాలుగు రోజుల పాటు ఫాంహౌస్లోనే గడిపిన కేసీఆర్.. జ్వరంతో బాధపడుతున్నారని సీఎం కార్యాలయ వర్గాలు సోమవారమే తెలిపాయి. దాంతో ఆయన మంగళవారం నాడు అన్ని అపాయింట్మెంట్లూ రద్దు చేసుకుని క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు.