ఆదర్శ కమిషన్‌గా పేరు తీసుకురండి
టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, సభ్యులకు గవర్నర్ నరసింహన్ సూచన
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు (టీఎస్‌పీఎస్‌సీ) ఆదర్శ కమిషన్‌గా పేరు తీసుకురావాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్‌లు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, కమిషన్‌ను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులకు ఉద్యోగాలివ్వడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని, ఆ దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. తాను టీం సభ్యునిగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.