Ghanta Chakrapani
-
వర్సిటీల్లో నియామకాలకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు సిఫారసు చేసేందుకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యింది. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సభ్యులుగా ఉంటారు. మరో ఇద్దరు సభ్యులను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. నియామకాలకు సంబంధించిన సూచనలతో పాటు, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్), ప్రమోషన్లకు సంబంధించిన అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సైతం ఈ కమిటీ పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్నీ పరిశీలించాకే.. యూనివర్సిటీల్లో దాదాపు 3 వేల బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా గతంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని వర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే దీని స్థానంలో కాలేజ్ సరీ్వస్ కమిషన్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాలన్నీ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత నియామకాలు చేపట్టాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలికి విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. వీసీల సమావేశం వివరాలను మండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి మీడియాకు వివరించారు. ర్యాంకింగ్‌లపైనా కమిటీ! యూనివర్సిటీల స్థితిగతులు, నాణ్యత ప్రమాణాలు, అనుబంధ గుర్తింపు విధానాలపై వీసీల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. తమ వర్సిటీల పరిధిలో సమస్యలను వీసీలు సమావేశంలో లేవనెత్తారు. జాతీయస్థాయిలో ర్యాంకులు పడిపోవడానికి కారణాలు, వీటిని ఏ విధంగా మెరుగుపర్చాలనే అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వర్సిటీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న నిధుల కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. పరిశ్రమల నుంచి సామాజిక బాధ్యత కార్యక్రమం కింద, పార్లమెంట్ సభ్యుల ప్రాంతీయ అభివృద్ధి నిధుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. సిలబస్ మార్పుపై కసరత్తు పూర్తి కొన్ని నెలలుగా ఉన్నత విద్యా మండలి చేపట్టిన పలు కార్యక్రమాలను వీసీలకు బాలకిష్టారెడ్డి వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా సిలబస్‌లో గణనీయ మార్పు తెస్తున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలిపారు. మార్కెట్ డిమాండ్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్ ఉండబోతుందని వివరించారు. న్యూస్ లెటర్ విడుదల మండలి నేతృత్వంలో రూపొందిస్తున్న న్యూస్ లెటర్‌ను విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. మండలి నేతృత్వంలో రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల్లో పురోగతిని ఇందులో వివరించారు. సమావేశంలో ఘంటా చక్రపాణితో పాటు పలు వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీచాన్స్ ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. కొత్తగా ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తవుతోంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గురువారం జరిగే కేబినెట్ భేటీలో ఖరారు చేసే అవకాశముంది. పదవీకాలం పూర్తవుతున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడంతో మరోమారు పదవులను ఆశిస్తున్నారు. క్రిస్టియన్ కోటాలో రాజేశ్వర్, ముస్లిం కోటాలో ఫారూఖ్ హుస్సేన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు, బీఆర్ఎస్ హయాంలో ఒకసారి.. ఫారూఖ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఒక్కోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారికి మళ్లీ అవకాశమిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా.. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే కారణంతో గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీనితో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజీ ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా సేవలతోపాటు అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటులో చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని చక్రపాణి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక గౌడ వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేనందున ఆ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లను.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ వర్గానికి చెందిన నేతల పేర్లనూ కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. చదవండి: త్వరలో తెలంగాణకు అమిత్‌షా, జేపీ నడ్డా -
అంబేడ్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్‌గా ఘంటా చక్రపాణి
బంజారాహిల్స్ (హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితు లయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం బోధనేతర సంఘం అధ్యక్షుడు జి.మహేశ్వర్‌గౌడ్, జనరల్ సెక్రెటరీ మార్కండేయశర్మ, వైస్‌ప్రెసిడెంట్ ఆర్.భూలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ పాండు, కోశాధికారి వెంకట పిచ్చయ్య తదితరులు చక్రపాణిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. -
50 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని, ఇప్పుడు అలాకాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని, ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చం ద్రావతి, ఖాద్రీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. చక్రపాణి, ఇతర సభ్యులను సీ ఎస్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఘంటా చక్రపాణి అత్యంత పారదర్శకంగా సేవలందిం చారని సీఎస్ కొనియాడారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెం చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఘం టా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నియామకాల భర్తీ ప్రక్రియలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, కమిషన్ పరపతి అంతర్జాతీ య స్థాయిలో పెరిగిందన్నారు. టీఎస్పీఎస్సీలో దరఖాస్తు ప్రక్రియ మొదలు ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, నియామక ఉత్తర్వులు.. ఇలా అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సత్ఫలితాలు తెచ్చామన్నారు. టీఎస్పీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు డి.కృష్ణారెడ్డి సంస్థ ఇన్చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
సాంకేతికత.. సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సాంకేతికంగా పలు సంస్కరణలు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడిం చింది. కమిషన్‌కు తొలి చైర్మన్‌గా నియుక్తులైన ఘంటా చక్రపాణి ఆరేళ్లలో పలు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు నియామక పత్రాల జారీ వరకు అన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పారదర్శకతకు కేరాఫ్ అడ్రస్‌గా టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దారు. ఈనెల 17న ఘంటా చక్రపాణి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో టీఎస్పీఎస్సీ సాధించిన రికార్డులను పరిశీలిస్తే... అంతా ఆన్లైన్.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడంలో టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగ ప్రకటనలు మొదలు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఫీజు వసూలు, హాల్‌టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన.. చివరకు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రాన్ని కూడా ఆన్లైన్లో ఇచ్చి టీఎస్పీఎస్సీ తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రత్యేక చర్యల కారణంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లతో ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించే అవకాశం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి దక్కింది. టీఎస్పీఎస్సీ ప్రవేశపెట్టిన పలురకాల సంస్కరణలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావడంలో ఆయన కీలక భూమిక పోషించారు. మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ డిసిప్లైన్డ్ ఫోర్సెస్ సర్వీస్ కమిషన్ బృందాలు టీఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి విధానాలను ప్రత్యక్షంగా వీక్షించి పలు అంశాలను తమ దేశంలో అమలుకు ఉపక్రమించడం ద్వారా టీఎస్పీఎస్సీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. సీసీటీవీలు, డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించి పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణను సులభతరంగా చేసింది. కమిషన్ తన కార్యకలాపాలన్నీ డిజిటలైజేషన్ చేయడంతో దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పీఎస్సీగా ఎంపికైంది. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ)ని అందుబాటులోకి తీసుకొచ్చి పరీక్షల విధానాన్ని మరింత సరళీకృతం చేసింది. పారదర్శకతకు కూడా కమిషన్ పెద్ద పీట వేసింది. టీఎస్పీఎస్సీ కార్యక్రమాలను ఏటా గవర్నర్‌కు నివేదిక రూపంలో అందజేయడం అనవాయితీగా పాటిస్తున్నారు. అవినీతి లేని వ్యవస్థను నిర్మించాం.. ‘అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేని పారదర్శక వ్యవస్థను నిర్మించగలిగాం. ఇది దేశంలో పీఎస్సీలకు, మారిషస్ లాంటి దేశాలకు మోడల్‌గా నిలిచింది. వారు మన పద్ధతులను అనుసరించడం గర్వకారణం’అని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. -
కోవిడ్ కాలంలో కొత్త విద్యా వ్యవస్థ
భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటుపడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నా చదువు అనేసరికి తరగతి గది, ఎదురుగా టీచర్ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతానికి వేరే మార్గమేదీ కనిపించక దేశాలు మూతపడ్డాయి. చరిత్రలో ఎన్నడూ చూడని ఈ ఉపద్రవం నుంచి బయటపడటం ఎలాగో తెలియని అయోమయం రాజ్యమేలుతోంది. మళ్ళీ ఈ వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి మనుగడ సాగించడం ఇప్పుడొక సవాలు. ప్రజలను కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడం సాధ్యంకాదు కాబట్టి క్రమంగా లాక్డౌన్లు ఎత్తివేస్తున్నారు. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను కొన్ని సంవత్సరాలు తు.చ. తప్పక ఆచరించాల్సిందే. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూనే, ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించక తప్పదని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యారంగం మీద కోవిడ్ ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. కిక్కిరిసిపోయి ఉండే భారతీయ తరగతి ఎలా మారబోతుంది? పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది చర్చకు వస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు దీనిమీద పూర్తిగా దృష్టిపెట్టనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యునెస్కో, ప్రపంచబ్యాంకు వంటివి కొన్ని ప్రతిపాదనలను చర్చకు పెట్టాయి. కరోనా వైరస్ బయటపడిన వెనువెంటనే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్లమంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు నిలిచిపోయాయి. మనదేశంలో వార్షిక పరీక్షలను మధ్యలోనే ఆపేసి లాక్డౌన్ చేయాల్సివచ్చింది. కీలకమైన 10, 12 తరగతుల విద్యార్థులు ఇంకా పరీక్షలు పూర్తికాక అయోమయంలో ఉన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి కావాల్సిన ఎంట్రన్స్, అడ్మిషన్ టెస్టులు కూడా వీళ్ళు పూర్తి చేసుకోవాల్సి ఉంది. విద్యాసంవత్సరాన్ని జూన్ నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. భారతీయ విద్యారంగం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది. దేశ జనాభాలో దాదాపు 50 కోట్లమంది చదువుకునే వయసులో అంటే ఐదేళ్లనుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే. దేశంలో దాదాపు 15 లక్షల స్కూళ్ళు, 40 వేలదాకా కాలేజీలు, దాదాపు వెయ్యి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో చదువుకునేవారి సంఖ్య దాదాపు 30 కోట్లు. ఇప్పుడు ఈ 30 కోట్లమంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటిన్నర మంది విద్యార్థులున్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచే పరిస్థితులు లేకపోయినా, మరో రెండు మూడు నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభించకపోయినా అది మొత్తం ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల మీద, విద్యార్థుల భవితవ్యం మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచినా కోవిడ్ 19 నిబంధనలు కొత్త సవాలుగా మారబోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందుతున్న దశలోనే పాఠశాల పరిసరాలు ఎలా ఉండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌తో కలిసి ఒక ప్రోటోకాల్ రూపొందించింది. ఒక చెక్‌లిస్టు కూడా ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం విద్యారంగ మౌలిక సదుపాయాలు మార్చవలసి ఉంటుంది. ఇది విద్యావ్యవస్థ స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేసే విధంగా ఉంది. ప్రతి టీచర్ , ప్రతి విద్యార్థి మాస్కులు ధరించాలి. ప్రతి తరగతి గదిని రోజుకు కనీసం ఒక్కసారైనా (వీలైతే తరచుగా) నీటితో కడగడం, తుడవడం చేయాలి. ఆ గదిలోని ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాలి. విధిగా తరగతి గదికి అందుబాటులో శానిటైజర్లు లేదా సబ్బులు ఉంచాలి. విద్యార్థులు తరచుగా చేతులు కడుక్కునే సౌకర్యం, నిరంతరాయ నీటి వసతి కల్పించాలి. పాఠశాలల్లో తరచూ జరిగే అసెంబ్లీలు, ఆటలు, ఇతర సామూహిక కార్యక్రమాలు ఉండకూడదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండాలన్నది కోవిడ్ 19 నియమం. దీనిని పాఠశాలల్లో కూడా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది. అంటే ఒక విద్యార్థికీ మరో విద్యార్థికీ మధ్య అన్ని వైపులా కనీస దూరం ఒక మీటర్ ఉండాలి. ఈ లెక్కన ఇప్పుడున్న తరగతి గదుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాలల్లో అయితే రెండు మూడు రెట్లు, ప్రైవేటులో అయితే ఐదారు రెట్లు పెంచాలి. ఇప్పుడున్న తరగతి గది, మౌలిక వసతులు సమకూరడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వీటిని అవసరానికి అనుగుణంగా విస్తరించడానికి కొన్ని వేలకోట్ల రూపాయలు అవసరం. ఈ సంక్షోభంలో ఒక్క మనకే కాదు, అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికి కూడా ఇది సాధ్యం కాదు. ఈ పరిస్థితులను అధిగమించడానికి మనం అనుసరిస్తోన్న విద్యాప్రణాళికలు, బోధనా పద్ధతులు పూర్తిగా మార్చడం ఒక్కటే పరి ష్కారం. సమస్యేమిటంటే గురుకులాలు మొదలు భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటు పడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నా చదువు అనే సరికి తరగతి గది, ఎదురుగా టీచర్ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? ఇలాంటి పరిస్థితుల్లో మన బోధన, అభ్యాసన సంస్కృతికి సంబంధమే లేని దూరవిద్య మనకు పనికొస్తుందా? మన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? దూరవిద్య అంటే ఓపెన్ యూనివర్సిటీ లేదా ఓపెన్ స్కూల్ అనేది పాత భావన. ఇప్పుడు మనం థియేటరుకు వెళ్లకుండానే ఒక కొత్త సినిమా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎలా చూస్తున్నామో అలాగే పాఠశాలలకు వెళ్లకుండానే చదువుకోవచ్చు. అటువంటి సౌలభ్యత ఇప్పుడు అందుబాటులో ఉంది. అందులో మొదటిది టీవీ. మనదేశంలో దాదాపుగా విద్యార్థులున్న ప్రతి ఇంట్లో టెలివిజన్ ఉన్నది. దేశవ్యాప్తంగా కనీసం 70 శాతం ఇళ్లల్లో, దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 90 శాతం కంటే ఎక్కువ ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాబట్టి ఇదొక అవకాశంగా తీసుకుని కనీసం 40 శాతం పాఠాలు ఇంట్లోనే బోధించేలా చర్యలు తీసుకోవాలన్నది ఒక ప్రతిపాదన. మొబైల్ లెర్నింగ్ రెండో ప్రత్యామ్నాయం. దేశ జనాభాలో 93 శాతానికి పైగా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2019 మెకెన్సీ నివేదిక ప్రకారం దాదాపు 40 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. విద్యార్థుల్లో ఇది కనీసం 95 శాతంగా ఉంటుంది. దాదాపు 40 కోట్ల మందికి వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు టెలివిజన్ పాఠాలు ప్రత్యామ్నాయం అనుకుంటే, కళాశాలలకు మొబైల్ సేవలను ఎక్కువగా వాడుకోవచ్చు. ఈ –లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్ లాంటివీ ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలన్నీ తమ పాఠాలను మూక్స్, మూడుల్ లాంటి కొత్త వేదికల ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాయి. గూగుల్ కూడా విద్యాబోధనకు సంబంధించిన కొత్త టూల్స్ అందుబాటులోకి తెస్తోంది. ఎలక్ట్రానిక్ మాధ్యమాల వినియోగంతో తరగతి గదిలో బోధించే విషయాలను కుదించడంతో పాటు, పాఠానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా ప్రింట్ రూపంలో అందించవలసి రావొచ్చు. ఇప్పుడున్న సిలబస్‌ను కూడా సమీక్షించవలసి రావొచ్చు. అలాగే హాస్టల్స్, రెసిడెన్సియల్ విద్యాసంస్థలు భారీ మార్పులు చేయాల్సి రావొచ్చు. కోవిడ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక్కో విద్యార్థికి కనీసం వంద మీటర్ల స్థలం అవసరం. అంటే ఒక్కో గదిలో ఒక్కరు, లేక ఇద్దరి కంటే ఎక్కువ మందిని ఉంచడానికి వీలులేదు. భోజనశాలలు, స్టడీ రూములు, లైబ్రరీలు, ఇతర సామూహిక స్థలాల్లో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో అన్ని దశల్లో కూడా సమూలమైన మార్పుల దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడున్న మౌలిక వసతులను షిఫ్టుల వారీగా వాడుకోవడం, దూర విద్యా వ్యవస్థలు, ఓపెన్ యూనివర్సిటీలను, అవి రూపొందించే పాఠ్యాంశాలను అందరికీ అందుబాటులోకి తేవడం అవసరం. ఇవన్నీ కావాలనుకుంటే కష్టమే. కానీ కరోనా అటువంటి కొత్త ప్రమాణాలను మన ముందుకు తెచ్చింది. కనీసం వ్యాక్సిన్ కనిపెట్టి, అది అందరికీ అందుబాటులోకి వచ్చే వరకైనా ఈ ఏర్పాట్లు అవసరం. కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రొ. ఘంటా చక్రపాణి వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ -
గంటా చక్రపాణికి పితృవియోగం
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న చక్రపాణి తండ్రి మొగలయ్య కన్నుమూశారు. 8 రోజుల నుంచి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగలయ్య శుక్రవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. మొగలయ్య భౌతికకాయాన్ని వారి స్వస్థలం కరీంనగర్ జిల్లాకు తరలిస్తున్నారు. -
రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
నల్లగొండ టూటౌన్ : యువత, విద్యార్థులు రాజ్యంగాన్ని విధిగా చదవాలని.. ప్రతి ఒక్కరికి రాజ్యంగంపై అవగాహన అవసరమని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ట్రస్మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 498 రోజులుగా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేస్తున్న కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక మార్కెట్ యార్డులో ‘భారత రాజ్యాం గ పరిరక్షణ – యువత పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతావని కీర్తి ప్రతిష్టలకు కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలపై విద్యార్థులకు నిర్వహిం చిన ప్రతిభా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం అంబేద్కర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సమకూర్చిన రూ.50 వేల విలు వల గల జీకే పుస్తకాలను ఎస్సీ స్టడీ సర్కిల్లో చదివే పేద విద్యార్థులకు ఫౌండేషన్ సీఈఓ ఎంవీ.గోనారెడ్డితో స్టడీ సర్కిల్ నిర్వహాకుడు సో మయ్యకు అందజేశారు. అంతకు ముందు మర్రి గూడ బైపాస్ వద్ద బుద్ధవనంలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి ని వాళులు అర్పించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పా పిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేకల భ ద్రాద్రి, మార్కెట్ చైర్మన్ కరీంపాషా, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట్ల అనంతరెడ్డి, వైద్యం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి శ్రీనివాసులు, కత్తుల నర్సింహ, ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కార్యదర్శి ఎంవీ.గోనారెడ్డి, కేజీ టు పీజీ విద్యాసంస్థల చైర్మన్ గింజల రమణారెడ్డి, కట్టె శివకుమార్, పెరిక కరణ్‌జయరాజ్, వేముల శేఖర్, వెంకట్‌రెడ్డి, గిరిధర్ గౌడ్, కైలాసం పాల్గొన్నారు. -
కొలువుల జాతర
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని 2,786 పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 700 గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పోస్టులు, 474 మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు, 1,521 గ్రూప్–4 పోస్టులు ఉన్నాయి. ఇక ఆర్టీసీలో గ్రూప్–4 కేటగిరీ కిందికి వచ్చే పోస్టులు 72, రెవెన్యూ శాఖలో సీనియర్ స్టెనో కేటగిరీలో 19 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అర్హతలు, దరఖాస్తులు, వివరాలివీ.. గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 10న రాతపరీక్ష నిర్వహిస్తారు. డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించిన తెలుగు/ఇంగ్లిషు లోయర్‌గ్రేడ్ టైప్ రైటింగ్‌లో పాసై ఉండాలి. ఫైనాన్స్ పోస్టులకు కామర్స్ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 7న రాతపరీక్ష నిర్వహిస్తారు. మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 8వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16న రాతపరీక్ష ఉంటుంది. ఈ పోస్టుల కోసం స్టాటిస్టిక్స్ను డిగ్రీలో ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో మ్యాథ్స్, రెండు, మూడో సంవత్సరంలో స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్టుగా చదవాలి. లేదా డిగ్రీ ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్‌లో స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్టుగా ఉండాలి. వీఆర్వో పోస్టులకు ఈ నెల 8 నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16న రాతపరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టెనో పోస్టులకు డిగ్రీలో ఉత్తీర్ణులై.. ప్రభుత్వ సాంకేతిక విభాగం నిర్వహించిన పరీక్షల్లో హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్, హయ్యర్ గ్రేడ్ షార్ట్‌హ్యాండ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ స్టెనో పోస్టులకు ఈ నెల 11వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రభుత్వ టెక్నికల్ విభాగం నిర్వహించే హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్‌లో పాసై ఉండాలి. టైపిస్టు ఉద్యోగానికి డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ పాసై ఉండాలి. మరో 20 వేల పోస్టుల భర్తీపై కసరత్తు: చక్రపాణి సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ద్వారా మూడేళ్లలో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరికొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని.. నెలాఖరులోగా మరో మూడు నోటిఫికేషన్లు జారీ చేస్తామని చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకుని శనివారం ఆయన టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని, త్వరలో 8 వేల పోస్టులకు సంబంధించి ఫలితాలను ప్రకటిస్తామని చక్రపాణి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కలను సాకారం చేసేందుకు టీఎస్పీఎస్సీ సిబ్బంది నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టీఆర్టీ ఫలితాలను వారంలోపు ప్రకటిస్తామని, అదే విధంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితా కూడా విడుదల చేస్తామని చెప్పారు. -
టీఆర్టీ ప్రశాంతం
-
టీఆర్టీ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్/హైదరాబాద్: టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలు(టీఆర్టీ) తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 52 కేంద్రాల్లో లాంగ్వేజి పండిట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 17,970 మంది దరఖాస్తు చేసుకోగా.. 17,333 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షకు 16,827 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,473 మంది హాజరయ్యారు. కొన్ని చోట్ల హాల్టికెట్లలో పరీక్ష కేంద్రం పేర్లు మారడం.. తప్పుగా ముద్రితమవ్వడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. దీంతో ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లే క్రమంలో ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయారు. ఉదయం 9.15 వరకే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. దీంతో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. కాగా, టీఎస్పీఎస్సీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి టీఆర్టీ పరీక్షను తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించింది. ఈ పరీక్షకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పరీక్ష నిర్వహించామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. క్షణక్షణం పర్యవేక్షణ.. పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్పీఎస్సీ పక్కా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరీక్ష సమయం ముందు నుంచే చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్ తదితరులు టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నూతన టెక్నాలజీని వినియోగించుకున్న టీఎస్పీఎస్సీ ప్రతి కేంద్రంలో అభ్యర్థి వారీగా పరీక్ష రాసే తీరును పరిశీలించే వీలుంది. దీంతో అభ్యర్థుల హాజరు, ప్రశ్నలు చదవడం, జవాబులు రాయడం తదితర ప్రక్రియ అంతా ట్రాకింగ్ సిస్టం ద్వారా వారు వీక్షించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులపై కేంద్రాలవారీగా సంబంధిత బాధ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఈ నెల 25వ తేదీన(ఆదివారం) ఉదయం ఎస్టీజీ తెలుగు మీడియం, మధ్యాహ్నం ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గోడదూకి వెళ్లినా.. టీఆర్టీ రాయడానికి ఇబ్రహీంపట్నంకు చెందిన అభ్యర్థి సుధీర్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌలాలీలోని అయాన్ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు అతడిని లోనికి అనుమతించలేదు. దీంతో పరీక్షా కేంద్రం గోడదూకి లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేశారు. పరీక్ష కేంద్రం మార్పుతో.. ఇతని పేరు జటావత్ శంకర్. వికలాంగుడైన శంకర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం పులదేవి బండ తండా. టీఆర్టీకి దరఖాస్తు చేసిన శంకర్ రాత్రి పగలు కష్టపడి చదివాడు. ఈ నెల 20న ఆన్లైన్లో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లోని ఇయాన్ సెంటర్ పరీక్ష కేంద్రంగా వచ్చింది. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శనివారం ఉదయం పరీక్ష సమయం కన్నా ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. హాల్‌టికెట్ నంబర్ కనిపించకపోవడంతో నిర్వాహకులను ఆరా తీయగా.. కొందరి నంబర్లు మారాయని, ఆన్లైన్లో చెక్ చేసుకోమని చెప్పడంతో ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి మళ్లీ హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో మల్లాపూర్ ఎన్ఎఫ్సీ బ్రిడ్జి వద్ద పరీక్షా కేంద్రానికి మారిందని ఉంది. అప్పటికే పరీక్ష సమయం కావడం.. అక్కడికి వెళ్లాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వికలాంగుడైన తనను పరీక్షకు అనుమతించాలని ఇయాన్ పరీక్ష కేంద్రం నిర్వాహకులను ప్రాధేయపడ్డాడు. తామేం చేయలేమని వారు చెప్పడంతో నిరాశతో అక్కడే కూలబడి కన్నీరుమున్నీరయ్యాడు. -
కాళేశ్వరం అద్భుతం
రామగుండం/మంథని: నీళ్ల లొల్లి తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ, అంతర్గాం మండలం గోలివాడ(సుందిళ్ల) పంపుహౌస్ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. కాళేశ్వరం ప్రా జెక్టుకు ప్రపంచ గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత మని, రివర్స్ పంపింగ్ ద్వారా 50 మీటర్ల లోతున్న నీటిని సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా ఉం దన్నారు. సోషియాలజీ ప్రొఫెసర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టుల పనులు సాగుతుండడం అద్భుతమన్నారు. ఐఐటీ ఇంజినీర్ దొంగరి నిశాంత్ మాట్లాడుతూ రివర్స్‌లో నీటిని తీసుకెళ్లడమే అద్భుతమన్నారు. భూసేకరణ లేకుండానే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే ఆలోచన బాగుందన్నారు. ప్రొఫెసర్లు లింబాద్రి, సాయిలు మాట్లాడుతూ గోదావరిలో 140 కిలోమీటర్ల పొడవునా ఎల్లకాలం నీళ్లు ఉండేలా చూడడం ద్వారా ఎన్నో ఎకరా లు సాగులోకి వస్తాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డీన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవసరాల మేరకు అన్ని సమయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలుండడం దీని ప్రత్యేకత అని కొనియాడారు. ప్రొఫెసర్ చెన్న బసవయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుందని కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీ సోషల్ వర్కర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ డాక్టర్ సి.శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు. వీరికి ఇరిగేషన్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండ విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
-
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ వెంటనే గురుకుల టీజీటీ తుది ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టీజీటీ అభ్యర్థులు చేరి ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ వద్దే భైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులాల్లోని (పీజీటీ, టీజీటీ) స్థాయిలోని పలు పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తొలుత అభ్యర్థులను 1:2 గా ఎంపిక చేశారు. ఇందులో కొద్ది రోజుల కిందటే పీజీటీ ఫలితాలను వెల్లడించారు. కానీ, టీజీటీ ఫలితాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే, ప్రస్తుతం టీజీటీ పోస్టులకు 1:2 ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా కూడా తమకు ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క, వివిధ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు నిర్వహించనుంది. దీంతో టీజీటీ 1:2కు ఎంపికైన అభ్యర్థులు ఇటు గురుకులాలపై ఆశపెట్టుకోవాలా, టీఆర్టీకి చదవాలా అనే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినప్పటికీ ఫలితాల వెల్లడి విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తునే ఉన్నారు. వివిధ మార్గాల ద్వారా టీఎస్పీఎస్సీపై ఫలితాలకోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రావడంతో సోమవారం టీజీటీ 1:2 అభ్యర్థులంతా టీఎస్పీఎస్సీ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న తమకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉపశమనం కలిగించాలని, ఆందోళన నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్: చక్రపాణి
► వైద్యశాఖలో 400 పోస్టులు ► వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోల భర్తీ ఖమ్మం: రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే 5వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయని అన్నారు. 15వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయిలో నియామకాలు జరుగుతాయన్నారు. 12 ఏళ్లుగా వివాదంలో ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం నుంచి జీవో వస్తే వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, మొత్తం 8వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతాయన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఫారెస్ట్ బీట్, రేంజ్ అధికారుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ పోస్టులకు ఇంటర్ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావైద్యం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఆ శాఖలో కూడా ఖాళీల భర్తీకి మరో 400 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని, ప్రధానంగా పారామెడికల్ స్టాఫ్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
చక్రపాణి వల్లే నిరుద్యోగులకు అన్యాయం: జగ్గారెడ్డి
సంగారెడ్డి: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వైఖరి వల్లే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వంత పాడుతూ.. వారు చెప్పిన వ్యక్తులకే ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తరహాలో చక్రపాణి కూడా నియంతలా వ్యవహరిస్తూ.. టీఎస్పీఎస్సీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందునే లోపభూయిష్టమైన నోటిఫికేషన్లపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఓడీఎఫ్, బీహెచ్ఈఎల్, బీడీఎల్‌లలో స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)ని సవరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి హరీశ్ చొరవ చూపాలని ఆయన కోరారు. -
‘ఘంటా’కు జాతీయ కిరీటం
⇒ వరించిన పీఎస్సీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి ⇒ పులకించిన సుల్తానాబాద్ మిత్రులు సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి) : సుల్తానాబాద్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థి, పెద్దపల్లి జిల్లా వాసి ఘంటా చక్రపాణికి జాతీయ స్థాయి పీఎస్సీ స్టాండింగ్ కమిటీల చైర్మన్ పదవి లభిం చడం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన ఘంటా 1981–83 సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. అప్పుడే చదువుల్లో గురువుల ప్రశంసలను అందుకున్న చక్రపాణి అంచెలంచెలుగా ఎదుగుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులయ్యారు. నామినేటెడ్ నియామకాల్లో అత్యున్నతమైన టీఎ స్పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరిం చిన అనంతరం జరిగిన ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను, సంస్కరణలను పాటించి దేశంలోనే పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుజరాత్లో జరిగిన సమావేశంలో ఆయనను జాతీయ స్థాయి పీఎస్సీ స్టాండింగ్ కమిటీల చైర్మన్‌గా ఎంపిక చేయడంతో దేశంలోనే పెద్దపల్లి జిల్లాకు వన్నె తెచ్చినట్లయింది. దీంతో సుల్తానాబాద్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ తోటి మిత్రుడు ఉన్నత స్థాయికి చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు పేరు తెచ్చారు తోటి పూర్వ విద్యార్థి చక్రపాణి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పీఎస్సీ స్టాండింగ్ కమిటీల చైర్మన్‌గా అతన్ని నియమించడంతో కళాశాల కీర్తి దేశవ్యాప్తమైంది. పారదర్శకత పాటించడంలో టీఎస్పీఎస్సీకి ఎంతో పేరు తెచ్చి పెట్టారు. – ఎండీ వహిదోద్దీన్ చదువుల్లో చతురత చూపించారు చదువుల్లో చక్రపాణి ఎంతో చతురతను ప్రదర్శించేవారు. ప్రతి సబ్జెక్టుల్లోనూ ముందుంటూ మార్కులు మెరుగ్గా సాధించేవారు. అప్పుడే ఉపాధ్యాయులు ప్రశంసించేవారు. ఉద్యోగ నియమాల్లో అవినీతికి తావు లేకుండా కొత్త విధానాలను ప్రవేశపెట్టి పీఎస్సీ గుర్తింపును ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారు. – డి. ప్రకాశ్ కళాశాలకే గర్వకారణం చక్రపాణి మా కళాశాల పూర్వ విద్యార్థి కావడం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వ కళాశాలలో చదువుకుని జాతీయ స్థాయిలో గౌరవం పొందడం ఆనందంగా ఉంది. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు గుర్తు చేస్తున్నాం. – డి. కల్పన, ప్రిన్సిపాల్ -
పీఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఘంటా
పీఎస్సీల నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ల నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ) ఘంటా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అమలు చేసే విధానపరమైన నిర్ణయాలను రూపొందించే పీఎస్సీల అత్యున్నత నిర్ణాయక కమిటీ ఇది. గుజరాత్లో రెండ్రోజులుగా జరిగిన పీఎస్సీల నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో రెండో రోజైన ఆదివారం ఈ ఎన్నిక జరిగింది. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. దేశంలోని పబ్లిక్ సర్వీసు కమిషన్లను డిజిటలైజేషన్ వైపు నడిపించిన ఘనత ఘంటా చక్రపాణికే దక్కుతుందని యూపీఎస్సీ చైర్మన్ ఫ్రొఫెసర్ డేవిడ్ రీడ్ సిమ్లే పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో గ్రూప్–1, గ్రూప్–2కు కామన్ సిలబస్ విధానం అమలుకు చర్యలు చేపట్టిన చక్రపాణికి అభినందనలు తెలిపారు. టీఎస్పీఎస్సీ అమలు చేస్తున్న సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ఇతర రాష్ట్రాల పీఎస్సీలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని గుజరాత్ గవర్నర్ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ అభినందనలు.. పీఎస్సీల నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా ఎన్నికైన చక్రపాణికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. చక్రపాణిని చైర్మన్‌గా యూపీఎస్సీ చైర్మన్, ఇతర రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చక్రపాణికి మెసేజ్ పంపించారు. ఇది అన్ని రాష్ట్రాల పీఎస్సీలకు టీఎస్పీఎస్సీ నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని వివరించారు. -
గ్రూప్–1, 2కు కామన్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసులైన గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామకాలకు దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి అమలు కానుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సులో సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రతిపాదించగా.. యూపీఎస్సీ చైర్మన్ డేవిడ్ రీడ్ సిమ్లెతోపాటు వివిధ రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరు అధ్యయన సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి.. టీఎస్పీఎస్సీని నమూనాగా తీసుకుని ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపాదిత అంశాలివే.. ► దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీ మాదిరిగా గ్రూప్–1, గ్రూప్–2 భర్తీలో ఒకే విధానం, ఒకే సిలబస్‌ను అనుసరించాలి. ► సిలబస్‌లో 70 శాతం ఒకేరకంగా ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటే సరిపోతుంది. ► అన్ని రాష్ట్రాలు యూపీఎస్సీ మోడల్‌నే అనుసరించాలి ► ఇప్పటికే టీఎస్పీఎస్సీ చాలా వరకు యూపీఎస్సీ విధానాన్నే అమలు చేస్తోంది. ► పీఎస్సీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలన్నీ డిజిటలైజేషన్ చేయాలి. ► దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపులు తదితర కార్యక్రమాలు ఆన్లైన్ పద్ధతిలోనే జరగాలి. -
7 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
వచ్చే నెల మొదటి వారంలో జారీ చేస్తాం: టీఎస్పీఎస్సీ పాత, కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీ అనంతరం మరిన్ని ఉద్యోగ పరీక్షలు కూడా.. మొత్తంగా ఈ ఏడాది 10 వేల పోస్టుల భర్తీ వచ్చే నెలలోనే గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో ఖాళీ గా ఉన్న పోస్టులతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే గురుకులాల్లో కలిపి 7 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నామని, ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. గురుకులాల కోసం ప్రభు త్వం మంజూరు చేసిన 23,494 పోస్టులకుగాను మొదటి విడతలో ఈ 7 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు 6 రకాల నోటిఫికేషన్లను జారీ చేస్తామని తెలిపారు. మిగతా పోస్టులకు వచ్చే రెండేళ్లలో నోటిఫికేషన్లు జారీ అవుతాయన్నారు. బుధవారం ముఖ్యమంత్రి సంతకం చేసిన 1,900 పోస్టులకు సంబంధించి కూడా ఈలోగా ఉత్తర్వులు వస్తాయని.. అవసరమైన ఇండెంట్లను ఆయా శాఖల నుంచి తెప్పించుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి 10లోగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలే జీల్లో 500 లెక్చరర్ పోస్టులు, 150కి పైగా రెసిడెన్షి యల్ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అలాగే గురుకు లాల్లో ప్రిన్సిపాల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీ టీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), లైబ్రేరి యన్, పీఈటీ, స్టాఫ్ నర్సు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్కు సంబంధించిన స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. మొత్తం ఈ ఏడాది 10 వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలోనే గ్రూప్స్ ఫలితాలు 2011కు సంబంధించిన గ్రూప్–1 రాత పరీక్షల ఫలి తాలను, 1,036 పోస్టుల భర్తీకి గత నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–2 రాత పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదల చేస్తామని చక్రపాణి తెలిపారు. గ్రూప్–1కు ఇంటర్వూ్యలను మార్చిలో నిర్వహించే అవకాశముందని.. గ్రూప్–2 ఇంటర్వూ్యలను ఏప్రిల్ నెలాఖరు నుంచి ఇంటర్వూ్యలను నిర్వహిస్తామని వెల్లడించారు. -
గవర్నర్‌కు టీఎస్పీఎస్సీ వార్షిక నివేదిక
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వార్షిక నివేదికను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు అందజేసింది. కమిషన్ చైర్మన్ ఘంటాచక్రపాణి నేతృత్వంలో సభ్యులు గవర్నర్‌ను గురువారం కలిసి నివేదిక అందజేశారు. అనంతరం చక్రపాణి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాము నిర్వహించిన పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు, వాటితోపాటు మిగతా మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడాది కాలంలో సాధించిన ప్రగతికి సంబంధించిన అన్ని వివరాలను నివేదికలో పొందుపరిచామన్నారు. తమ పనితీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మరింత ప్రగతిశీలంగా పురోగామి దిశగా పని చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారన్నారు. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు 6 వేల ఉద్యోగాలిచ్చామని, ఇంకా కొన్ని ఇంటర్వ్యూ దశలో ఉన్నాయని ఆయన వివరించారు. అవి కూడా పూర్తి అయితే సుమారు ఆరు వేల ఉద్యోగాలను రెండున్నరేళ్లలో ప్రకటించినట్లవుతుందని చెప్పారు. గ్రూప్ -2 కు సంబంధించిన ఫైనలైజేషన్ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే ఫలితాలను కూడా ప్రకటిస్తామన్నారు. గ్రూప్ -2 కంటే ముందుగా గ్రూప్ -1, 2011 రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. వాటి ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
మంగళసూత్రాల ప్రస్తావన తేలేదు!
⇒ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి హైదరాబాద్: ఈ నెల 11వ తేదీన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్రంలో 8 లక్షల మంది హాజరవుతున్నారని, అంతమంది ఒకేసారి పరీక్ష రాయడం ఇదే మొదటిసారని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఎలాంటి సమస్య లేకుండా పరీక్ష నిర్వహిస్తామని, మహిళా అభ్యర్థులు మంగళసూత్రం ధరించి పరీక్షకు వెళ్లవద్దని కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నాయని, అది చాలా దౌర్భాగ్యమైన విషయమని, తాము ఎక్కడా మంగళసూత్రాల ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మెహిందీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు చర్మంపై మెహిందీ ఉంటే ఫింగర్‌ప్రింట్స్ సరిగ్గా రికార్డ్ కావని, దానికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బ్లూటూత్ లాంటి పరికరాలను అనుమతించడం లేదని తెలిపారు. తమ వద్ద అభ్యర్థుల పూర్తి సమాచారం ఉందని, కేవలం ఆధార్‌కార్డు తీసుకుని రావాలని వెల్లడించారు. పరీక్షరాసే 8 లక్షల మంది అభ్యర్థుల్లో మూడున్నర లక్షలమంది హైదరాబాద్‌లోనే సెంటర్ కావాలని అడిగారని, కాని హైదరాబాద్‌లో కేవలం లక్షా 20 వేలమందికి మాత్రమే అవకాశాలు ఉన్నాయని మిగిలిన వారికి మిగిలిన ప్రాంతాల్లో కేంద్రాలు కేటారుుంచామని తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ అడిగితే ఇతర జిల్లాలకు వేశారని ప్రశ్నిస్తున్నారని, వారు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం వస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సి వస్తుందని, రెండురోజులు పరీక్షరాయడానికే ఇబ్బందిపడితే ఉద్యోగం వస్తే 30 సంవత్సరాలు తెలంగాణ మొత్తం తిరగాల్సి వస్తుందని అన్నారు. పరీక్షహాల్లో ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని, అలా సృష్టించేవారిని వదిలిపెట్టే అవకాశం లేదని, జాతీయ స్థాయిలో ఉన్న పరీక్షలతో సహా అన్ని పరీక్షలు రాయకుండా చేసే అధికారాలు తమకు ఉన్నాయని వెల్లడించారు. -
6 వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు
- మన టీవీ ద్వారా గ్రూప్-2పై శిక్షణ - ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 6 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ 14 నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. డిజిటల్ బోధనకు సంబంధించి విద్యాశాఖ పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోందన్నారు. సాఫ్ట్‌నెట్ ద్వారా మన టీవీ ప్రసారాలకు సంబంధించి ఐటీ శాఖతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 90 లక్షల గృహాలకు మన టీవీ ప్రసారాలు చేరడం లక్ష్యంగా ఇస్రోతో ఒప్పం దం కుదుర్చుకున్నామని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మన టీవీ ద్వారా రోజుకు 4 గంటలు చొప్పున శిక్షణా కార్యక్రమాలను ప్రసారం చేస్తామన్నారు. భవిష్యత్తులో సివిల్స్, ఎం సెట్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడేలా శిక్షణా కార్యక్రమాలుంటాయన్నారు. ఇస్రో సహకారంతో గుజరాత్ ప్రభుత్వం 16 చానళ్ల ద్వారా వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని, అదే తరహాలో రాష్ట్రంలోనూ చానళ్ల సంఖ్య పెంచుతామని ప్రకటిం చారు. రైతులకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం, భూగ ర్భ జలాల గుర్తింపు, వినియోగం వంటి అంశాలపైనా కార్యక్రమాలు రూపొందించి మన టీవీ ద్వారా ప్రసారం చేస్తామన్నారు. భవిష్యత్తులో మున్సిపల్ విభాగంలోనూ ఇస్రో సాంకేతిక సహకారం తీసుకుంటామన్నారు. ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి మన టీవీ ప్రసారాలు అందరికీ చేరేలా చూస్తామన్నారు. ఏడాదిలో ఐదు వేల ఉద్యోగాల భర్తీ టీఎస్పీఎస్సీ ఆవిర్భావం తర్వాత ఏడాది వ్యవధిలోనే 23 నియామక నోటిఫికేషన్ల ద్వారా సుమారు 5 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. పోటీ పరీక్షల శిక్షణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భారంగా మారిందని, ఈ విద్యార్థులే ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారన్నారు. మన టీవీ ద్వారా గ్రామీణ విద్యార్థులకు అవగాహన, శిక్షణ లభిస్తుందన్నారు. పోటీ పరీక్షల సమాచారాన్ని యూట్యూబ్ ద్వారా అందించాలని సూచించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇస్రో ప్రతినిధి వీరేందర్ సింగ్ ఒప్పంద పత్రాలను మార్పిడి చేసుకున్నారు. కార్యక్రమంలో సాఫ్ట్‌నెట్ సీఈవో శైలేశ్‌రెడ్డి, మృత్యుంజయరెడ్డి పాల్గొన్నారు. -
7 లక్షలు దాటనున్న గ్రూప్-2 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గ్రూప్-2 దరఖాస్తుల ప్రక్రియను వాస్తవానికి శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ప్రారంభించాలని, టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అయితే సాంకేతిక సమస్యలు లేకపోవడం, ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సజావుగా ఉన్నట్లు అధికారులు తెలపడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణను ప్రారంభించినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 13 నుంచి గ్రూపు-1 మెయిన్స్
టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఆ పరీక్షకు సంబంధించి 140 పోస్టులు తెలంగాణకు వచ్చాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటి భర్తీకి మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 13 నుంచి 23వరకు పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 312 పోస్టుల భర్తీకి 2011లో అప్పటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే గ్రూపు-1 ప్రిలిమ్స్ కీలో ఆరు తప్పులు దొర్లాయని, వాటి వల్ల తాము నష్టపోయామని, మెయిన్స్‌కు అర్హతను కోల్పోయామని పేర్కొంటూ పలువులు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట ట్రిబ్యునల్, ఆ తరువాత హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టులో 150 ప్రశ్నల్లో ఆరు తప్పులు దొర్లినట్లు తేలింది. అయితే అప్పట్లో తప్పులు దొర్లాయని అభ్యర్థులు పేర్కొన్నా.. అప్పటి ఏపీపీఎస్సీ పట్టించుకోకుండా మెయిన్స్ నిర్వహించి, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. ప్రస్తుతం ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన జరిగినందున 172 పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌లో, 140 పోస్టులకు తెలంగాణలో వేర్వేరుగా మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమోదం తెలపాలని టీఎస్పీఎస్సీ.. ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆమోదించడంతో వచ్చే నెలలో పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక అప్పట్లో గ్రూపు-1 ప్రిలిమ్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల తోపాటు 6 ప్రశ్నలను తొలగించగా అదనంగా అర్హత పొందే అభ్యర్థులతో ఈ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. అర్హులకు సంబంధించిన వివరాలు, జాబితాలను అందజేయాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీని కోరింది. అవి త్వరలోనే టీఎస్పీఎస్సీకి అందనున్నాయి. -
సెప్టెంబర్‌లో ‘2011 గ్రూప్-1’ మెయిన్స్
ఏపీతోపాటే రాష్ట్రంలోనూ నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు * సీఎస్, సీఎంతో చర్చించిన చైర్మన్ ఘంటా చక్రపాణి * ఆమోదం కోసం లేఖ.. అనుమతి రాగానే షెడ్యూల్ * సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు పరీక్షలు ఉండే అవకాశం సాక్షి, హైదరాబాద్: వివాదాల కారణంగా ఆగిపోయిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు... సెప్టెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణలోనూ ఆ పరీక్షలను నిర్వహించేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతోంది. దీనిపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఇటీవలే సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మలతో చర్చించారు. ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభించే అవకాశాలుఉన్నట్లు తెలిసింది. ఆ వెంటనే టీఎస్పీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. పాత సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. వివరాలు ఇవ్వాలని కోరిన టీఎస్పీఎస్సీ 2011 గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణకు సంబంధించి విద్యార్థుల వివరాలు, దరఖాస్తులను తమకు అందజేయాలని ఏపీపీఎస్సీని టీఎస్పీఎస్సీ కోరింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్‌తో ఘంటా చక్రపాణి సమావేశమై.. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అర్హులైన అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అందజేయాలని కోరారు. త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి వివరాలు వచ్చే అవకాశముంది. నాలుగేళ్ల ఆందోళనకు తెర ఈ పరీక్షలపై నాలుగేళ్లుగా అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనకు త్వరలో తెరపడనుంది. 2011లో అప్పటి ఏపీపీఎస్సీ 312 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు 1.70 లక్షలమంది హాజరయ్యారు. అనంతరం మెయిన్స్‌కు 1:50 నిష్పత్తి చొప్పున 15,600 మందిని ఎంపికచేశారు. అందులో 8,600 మంది మెయిన్స్ రాయగా.. వారిలోంచి మెరిట్ ప్రకారం 1:2 నిష్పత్తిన 606 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియ సాగుతున్న సమయంలోనే ప్రిలిమ్స్ పరీక్ష ‘కీ’లో ఆరు తప్పులున్నట్లు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు. వాటిపై ట్రిబ్యునల్, హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. దాంతో ఆ ఆరు ప్రశ్నలను తొలగించి.. మిగతా మార్కులతో మెరిట్ జాబితా రూపొందించి, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 144 ప్రశ్నలతో పునర్ మూల్యాంకనం చేయడంతో.. పలువురు అనర్హులుగా తేలగా, మరికొందరు అర్హులుగా మారారు. మొత్తంగా అభ్యర్ధుల సంఖ్య 16,966 కి పెరిగింది. అయితే అప్పట్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన, కొత్తగా అర్హత పొందిన వారికి మాత్రమే పరీక్ష నిర్వహిస్తారా, మొత్తంగా 16,966 మందికి పరీక్ష నిర్వహిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
కుదరని ఏకాభిప్రాయం
2011 గ్రూప్-1 మెయిన్స్‌పై టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ చైర్మన్ల భేటీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ), ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్లు ఘంటా చక్రపాణి, పి.ఉదయభాస్కర్‌లు శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనంలోని చక్రపాణి చాంబర్లో జరిగిన ఈ భేటీలో.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తిరిగి మెయిన్స్ నిర్వహించే అంశంపై చర్చించారు. సెప్టెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు ఈ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను జారీ చేసిన విషయాన్ని ఉదయభాస్కర్.. చక్రపాణికి తెలియజేశారు. పరీక్షలను తెలంగాణ ఏయే తేదీల్లో నిర్వహిస్తుందో, సిలబస్ తదితర అంశాలపై చర్చించారు. పరీక్షలను రెండు రాష్ట్రాలు వేర్వేరుగా పెట్టినా.. ఒకేరోజు నిర్వహిస్తే మంచిదని చక్రపాణి ప్రతిపాదించినట్లు సమాచారం. పరీక్షను ఒకేరోజు రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తే అభ్యర్థులు ఏదో ఒక రాష్ట్రంలోనే అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారని, మరో రాష్ట్రంలోని అవకాశాల్ని కోల్పోయే అవకాశముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. దీనిపై ఏంచేయాలన్న దానిపై ఒక అభిప్రాయానికి రానందున మంగళవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. -
అంబేడ్కర్ అందరివాడు
టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ అందరివాడని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. భారతరత్న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ రికార్డు పెయింటింగ్ ఈవెంట్ నిర్వహిం చారు. ఈ పోటీలో 125 మంది చిన్నారులు పాల్గొని 125 నిమిషాల పాటు కుంచెకు పదునుపెట్టి 125 చదరపు అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ చిత్రాన్ని ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి కాన్సెప్ట్ స్కూళ్లలో విద్యార్థుల వరకు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరందరూ 13 ఏళ్ల వయసు లోపువారే. ఇందులో ఒక్కొక్కరికి ఒక భాగాన్ని కేటాయించారు. విద్యార్థుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలన్నింటినీ ఒకే చిత్రంగా అతికించి.. అంబేడ్కర్ జీవిత ఘాట్టాలను తెలియజేసే అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. బాలబాలికలు ఆవిష్కరించిన చిత్రాన్ని చూసి ఆశ్చర్యచకితుల య్యారు. విద్యార్థులందరూ మహాయజ్ఞం చేసి అంబేడ్కర్ చిత్రాన్ని రూపొందించారని ప్రశంసించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికీ పాటుపడిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఇ.సుధారాణి, దిశా సైన్స్ సెంటర్ నిర్వాహకులు డి.అనసూయమ్మ, నేషనల్ దలిత్ ఫోరం అధ్యక్షుడు ఆర్.రవికుమార్, డి.వి.ఎస్.ఎం. చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి లక్ష్యాలకు పీఎస్సీల సదస్సు
♦ హాజరుకానున్న యూపీఎస్సీ, అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు ♦ ఉత్తమ విధానాలు, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చలు ♦ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా సీఎం, గవర్నర్ ♦ విలేకరుల సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ)ల ఉమ్మడి లక్ష్యాల (అవకాశాలు, ఆవిష్కరణలు, చేపట్టాల్సిన చర్యల)పై చర్చించేందుకు తమ సంస్థ అధ్వర్యంలో 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో పీఎస్సీల చైర్మన్ల 18వ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు, కొన్ని రాష్ట్రాలకు చెందిన సభ్యులు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు, సదస్సులో చర్చకు రానున్న అంశాల గురించి సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చక్రపాణి వివరించారు. 1949 నుంచి వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సదస్సుల ద్వారా పీఎస్సీల గత అనుభవాలు, ఉమ్మడి అవసరాలు (కొత్త టెక్నాలజీ, పరీక్షలకు సిలబస్), భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు తాజా సదస్సులో వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే హైదరాబాద్‌లో సదస్సు నిర్వహణకు యూపీఎస్సీ చైర్మన్ అంగీకరించారన్నారు. ఆయా రాష్ట్రాల పీఎస్సీలు అవలంబిస్తున్న విధానాలతోపాటు కమిషన్ల సభ్యుల సంక్షేమానికి (జీతభత్యాలు, పదవీ విరమణ వయసు..తదితర) సంబంధించిన అంశాలపైనా, రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కోర్టుల మాదిరిగా రక్షణ లేదంటూ సభ్యుల్లో నెలకొన్న అభిప్రాయంపైనా చర్చించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు (చిలుకూరు సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌లో) చేశామని ఘంటా చక్రపాణి తెలిపారు. 4వ తేదీన ఉదయం 9.30 గంటలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారని... అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. 5వ తేదీన పీఎస్సీలకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతాయన్నారు. పోటీ పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు పీఎస్సీల అవసరాలు, ఐటీ నిపుణుల వద్ద ఉన్న అవకాశాలను పర స్పరం తెలుసుకునేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థల ప్రతినిధులతో పీఎస్సీల చైర్మన్లు టి-హబ్‌లో సమావేశం కానున్నట్లు చక్రపాణి తెలిపారు. విలేకరుల సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్, సభ్యులు విఠల్, మన్మథరెడ్డి, చంద్రావతి, సాయిలు, మతీనుద్దీన్ ఖాద్రీ, విద్యాసాగర్‌రావు, రాజేందర్, రామ్మోహన్‌రెడ్డి, వివేక్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్
టీఎస్పీఎస్సీ కమిషనర్ ఘంటా చక్రపాణి హసన్‌పర్తి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని కమిషనర్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్ పరీక్షలపై ‘సుమార్గ్’ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా హన్మకొండలోని ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చక్రపాణి ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా గ్రూప్-2కు సంబంధించి సుమారు 453కు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని, గ్రూప్-1 ఖాళీలు 53 మాత్రమే ఉన్నట్లు గుర్తించినప్పటికీ వాటి భర్తీ ప్రకటన కొంత ఆలస్యం కావచ్చన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నియామకాలు సైతం చేపడతామని చెప్పారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 4,200 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి, పరీక్షలు సైతం నిర్వహించామని, త్వరలో ఇంటర్వ్యూలు చేపడతామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా రూపొం దించిన వెబ్సైట్ ద్వారా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి తనకు కావాల్సిన పోస్ట్ ఎంపిక చేసుకోవచ్చన్నారు. పరీక్ష నిర్వహించిన కేవలం 24 గంటల్లోనే ‘కీ’ విడుదల చేశామని, అభ్యర్థి తాను రాసిన సమాధానాలు చూసుకునేలా మరో ఓఆర్‌ఎం షీట్ అందజేశామన్నారు. పది, ఇంటర్ పాసైన వారికి... పదో తరగతి, ఇంటర్మీడియెట్ పాసైన వారి కోసం టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చక్రపాణి తెలిపారు. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే, హెల్త్ అసిస్టెంట్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయనున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లల్లో టీఎస్పీఎస్సీ ద్వారా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. -
తెలుగులో ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు
హైదరాబాద్ : ఏఈఈ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ పేపర్ తెలుగులో ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్పీ ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి వెల్లడించారు. ఆదివారం జరగనున్న ఈ ఏఈఈ ఆన్లైన్ పరీక్షపై శుక్రవారం హైదరాబాద్‌లో టీఎస్పీఎస్పీ ఛైర్మన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి తెలిపారు. ఆదివారం నిర్వహించే ఈ ఆన్ లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. -
గ్రూపుల సిలబస్ వచ్చేసింది!
ఈ నెలలోనే 80 శాతం వరకు నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించే వివిధ పోటీ పరీక్షల పూర్తిస్థాయి సిలబస్ సోమవారం విడుదలైంది. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య నేతృత్వంలో ఈ సిలబస్‌ను విడుదల చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల సిలబస్‌ను ప్రకటించారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల సిలబస్‌నూ వెబ్సైట్లో (www.tspsc.gov.in) అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. సాధారణంగా సిలబస్‌ను నోటిఫికేషన్లతోపాటే జారీ చేస్తారని, కానీ కొత్త రాష్ట్రంలో కొత్త సిలబస్ అయినందున చదువుకునేందుకు సమయం కావాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ముందుగానే విడుదల చేస్తున్నామని చెప్పారు. పోటీ పరీక్షల మౌలిక స్వరూపాన్ని (స్కీం) 32 మంది నిపుణులు నెల రోజులపాటు శ్రమించి పూర్తి చేశారని తెలిపారు. దానిని ప్రభుత్వ సీఎస్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి, ఆమోదించాయని చెప్పారు. ఈ పోటీ పరీక్షల స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం గత నెల 27న ఉత్తర్వులు జారీ చేసిందని... అప్పటినుంచి 85 మంది ప్రొఫెసర్లు ఈనెల 27 వరకు రేయింబవళ్లు కూర్చొని పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించారని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరం, ఆకాంక్షలను స్వయంగా చూసి, ఉద్యమంలోనూ భాగస్వాములైన వారు.. తెలంగాణ సమాజం కోసం 30 ఏళ్లుగా శ్రమిస్తున్న వారంతా ఇందులో పాలుపంచుకున్నారని వెల్లడించారు. వారందరికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజానికి యువత ఉపయోగపడే విధంగా ఈ పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించారని పేర్కొన్నారు. ఈ నెలలోనే..: టీఎస్పీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులకు సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్లు ఇస్తామని చక్రపాణి తెలిపారు. మొదటి వారంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, తర్వాత ఏఎంవీఐ పోస్టులకు, హెచ్ఎండీఏలో ఖాళీల భర్తీకి.. తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మరిన్ని పోస్టులకు ఆమోదం లభించాక నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్లో గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సిలబస్‌లో మార్పులు లేని అగ్రికల్చర్ ఆఫీసర్, ఇతర టెక్నికల్ పోస్టుల సిలబస్‌ను మాత్రం నోటిఫికేషన్లతో పాటు జారీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, కమిటీ సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్లు శివారెడ్డి, అడపా సత్యనారాయణ, లింగమూర్తి, మల్లేష్, రేవతి, కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పరీక్షల్లో 'ప్రత్యేక' అంశాలు టీఎస్పీఎస్సీ ఏ పోటీ పరీక్ష నిర్వహించినా అందులో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండేలా, ముఖ్యంగా జనరల్ స్టడీస్‌లోనూ ఈ అంశాలు ఉండేలా సిలబస్‌కు రూపకల్పన చేశారు. గ్రూప్స్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను అడిగేలా చర్యలు చేపట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్-1: జనరల్ స్టడీస్‌లో వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ విధానాలు, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం పేపర్-2: కాకతీయుల పాలన, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో కాకతీయులు, వెలమ రాజుల పాత్ర, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, భౌగోళిక స్థితులు పేపర్-3: తెలంగాణలో సామాజిక అంశాలైన వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ, వలసలు; పేపర్-4: తెలంగాణ ఆర్థిక పరిస్థితి పేపర్-5: సాధారణ సిలబస్; పేపర్-6: తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం గ్రూప్- 2, 3 పేపర్-1: తెలంగాణ సమాజం, విధానాలపై ప్రశ్నలు పేపర్-2: తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర పేపర్-3: తెలంగాణ ఆర్థిక స్థితి, అభివృద్ధి పేపర్-4 (గ్రూప్-2కి మాత్రమే): తెలం గాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం గ్రూప్- 4 పేపర్-1: తెలంగాణ భౌగోళిక, ఆర్థిక అంశాలు, సమాజం, సంస్కృతి గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్టులు పేపర్-1: తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి, చరిత్ర, రాజకీయం, సంస్కృతి, కళలు, సాహిత్యం -
తెలంగాణ గ్రూప్స్ సిలబస్ విడుదల
-
31న గ్రూప్స్ సిలబస్ ప్రకటన
హైదరాబాద్: గ్రూప్స్ సిలబస్‌ను ఈనెల 31న ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూపు-1,2,3,4 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను నోటిఫికేషన్లతో కాకుండా ముందుగానే ప్రకటించేందుకు సర్వీసు కమిషన్ చర్యలు చేపట్టింది. గ్రూప్స్ సిలబస్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలను జోడించి వూర్పులు చేసినందున ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సిలబస్‌లో ప్రిపేర్ అయ్యేందుకు సవుయుం కావాలని అభ్యర్థులు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తావుని సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. -
పోటీ పరీక్షల్లో మార్పులు.. వచ్చే ఏడాదే
రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ పీఎస్సీ ప్రతిపాదనలు హరగోపాల్ కమిటీ సిఫారసులకు యథాతథంగా ఆమోదం పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడు మార్పులు చేస్తే విద్యార్థులకు నష్టం సిలబస్‌లో మాత్రం తెలంగాణకు అనుగుణంగా సవరణలు గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వాయిదా వేయాలి అధ్యాపక పోటీ పరీక్షల్లో విద్యా సంబంధ అంశాలతోనే జనరల్ స్టడీస్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున పోటీ పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడు మార్పులు చేయవద్దని, తెలంగాణ రాష్ట్రానికి తగిన విధంగా సిలబస్‌ను మాత్రం మార్చి ఉద్యోగ భర్తీ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రభుత్వానికి సూచించింది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయాలన్న జీవో అమలును వాయిదా వేయాలని ప్రతిపాదించింది. లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1ను, గ్రూప్-1 మెయిన్స్ ఐదోపేపర్లోనూ పూర్తిగా మార్పులు చేయాలని పేర్కొంది. దీంతోపాటు స్టేట్ సివిల్ సర్వీసెస్ ఉండాలని సూచించింది. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని పోటీ పరీక్షల సమీక్ష కమిటీ చేసిన సిఫారసులను టీఎస్పీఎస్సీ యథాతథంగా ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల విధానంలో మార్పులపై సర్వీసు కమిషన్ శనివారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రొ.హరగోపాల్ నేతృత్వంలోని కమిటీ ఇటీవలే ఈ ప్రతిపాదనలను రూపొందించి, టీఎస్పీఎస్సీకి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అందులోని సిఫారసులపై కమిషన్ శనివారం సమావేశమై చర్చించింది. చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠ ల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలో హరగోపాల్ కమిటీ సిఫారసులను ఆమోదించి ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. వీటిని ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సిలబస్‌ను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. రెండింటికి వేర్వేరుగా.. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్చుతూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒక్కసారికి వాయిదా వేయాలని సమీక్ష కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం పాత పద్ధతిలోనే పరీక్షలను నిర్వహించాలని పేర్కొంది. గ్రూప్-1, గ్రూప్-2లను విడివిడిగానే కొనసాగించాలని తెలిపింది. రెండింటికి వేర్వేరుగా పరీక్షల విధానాన్ని రూపొందించి, అందజేసింది. ఈ సిఫారసులనే టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మెయిన్స్ ఐదో పేపర్లో మార్పులు.. గ్రూప్-1 మెయిన్స్‌లో ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ ఐదో పేపర్‌గా ఉంది. దీని స్థానంలో కొంత గణితంతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది. తెలుగు మీడియం, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారితో పాటు సాంఘికశాస్త్రాలను సబ్జెక్టుగా చదువుకున్న వారు మొత్తం గణితం పేపర్ వల్ల అర్హత పొందలేకపోతున్నారని కమిటీ అధ్యయనంలో తేలిన నేపథ్యంలో ఈ మార్పును సూచించారు. అధ్యాపకుల ‘జనరల్ స్టడీస్’లో మార్పులు గతంలో గెజిటెడ్ అధికారుల నోటిఫికేషన్లలో భాగంగానే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ తదితర పోస్టుల భర్తీ చేపట్టేవారు. అయితే ఇకపై అధ్యాపకుల నియామకాలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని సమీక్ష కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం లెక్చరర్ పోస్టుల భర్తీలో పేపర్-1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సిలబస్‌లో సమకాలిన అంశాలు, చరిత్ర, అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఇకపై లెక్చరర్ పోస్టుల భర్తీ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్-1లో విద్యా విధానం, విద్యా సంబంధ విషయాలు, విద్య, మౌలిక సూత్రాలు, విద్య ప్రాధాన్యం, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలను చేర్చుతారు. అధ్యాపకుడిగా వెళ్లాల్సిన వారికి విద్య సంబంధ అంశాలన్నింటిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని కమిటీ ఈ మార్పులను సిఫారసు చేసింది. అవసరమైతే మార్పులు: చక్రపాణి గ్రూప్-1లో ఎప్పటిలాగానే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ విధానం ఉంటుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. గ్రూప్-2, గ్రూప్-4 ఆబ్జెక్టివ్ విధానంలోని ఉంటాయన్నారు. ప్రతి పరీక్షకు స్కీమ్‌ను, సిలబస్‌ను మార్చే హక్కు టీఎస్ పీఎస్సీకి ఉందని.. పరీక్ష విధానం, సిలబస్‌ను యూపీఎస్సీ తరహాలో నోటిఫికేషన్లోనే ప్రకటిస్తామని చక్రపాణి చెప్పారు. ప్రభుత్వోద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్షలకు పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. డీఎస్సీ తదితర ఏ పరీక్ష అయినా ప్రభుత్వం నిర్ణయిస్తే నిర్వహించడానికి తాము సిద్ధమేనని, అయితే అది ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను పది రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. కాగా తాము సిలబస్‌ను ప్రకటించకముందే కొత్త సిలబస్ ప్రకారం శిక్షణ ఇస్తామంటూ కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని, అలాంటివారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. -
‘రెండు వారాల్లో టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్’
కరీంనగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మరో రెండువారాల్లో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల్లో 640 సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఆ తర్వాత విద్యుత్‌శాఖలో మూడువేలకుపైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కరీంనగర్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరగోపాల్ కమిటీ సిలబస్ మార్పుపై చేసిన సిఫారసులు ఇంకా తన పరిశీలనకు రాలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. -
‘పరీక్షల్లో’ మార్పులు కొన్నే...
టీఎస్పీఎస్సీకి సమీక్షా కమిటీ నివేదిక ప్రస్తుత పరీక్ష విధానంపై సిఫార్సులు ఒక్క ఏడాదికే వర్తింపజేయాలని సూచన గ్రూప్-1లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వద్దని సలహా సిలబస్‌లో తెలంగాణ అంశాలతో మార్పులు ఇక తుది నిర్ణయం సర్కారుదే సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చే స్తూ గత ంలో వెలువడిన ఉత్తర్వుల అమలు విషయంలో నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పరీక్షల విధానంపై ఏర్పాటైన సమీక్ష కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఆ ఉత్తర్వుల అమలును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. పోస్టుల విలీనంపై 2013లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని చెప్పారు. పైగా అందులో స్పష్టత లేనందువల్ల ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. పోటీ పరీక్షల విధానంపై సమీక్ష కమిటీ సిఫారసులతో కూడిన నివేదికను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి హరగోపాల్, కోదండరాం గురువారం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పరీక్షల విధానంలో కొద్దిపాటి మార్పులనే సూచించినట్లు చెప్పారు. నిరుద్యోగులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఒక్క ఏడాదికి మాత్రమే వర్తించేలా మార్పులను సిఫారసు చేశామన్నారు. ఆ తర్వాత అవసరమైన మార్పులను కమిషన్ చేసుకోవచ్చన్నారు. సిలబస్‌లో మాత్రం తెలంగాణకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక స్థితిగ తులు, చరిత్ర, రాజకీయ అంశాలను సిలబస్‌లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. పాలనాయంత్రాంగంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు పాలుపంచుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు సూచించామన్నారు. గ్రూప్-1 ఐదో పేపరులో మార్పుల విషయంలో నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. తమది సలహా కమిటీ మాత్రమేనని, సిఫారసులను టీఎస్పీఎస్సీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల్లో పేర్కొనే అంశాలే అమల్లోకి వస్తాయని వివరించారు. ఉద్యోగాలకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఏ దశలోనైనా మార్పులు: చక్రపాణి ప్రస్తుతం కమిటీ చేసిన సిఫారసులపై కమిషన్‌లో చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, ఆ తర్వాతే ఉత్తర్వులు జారీ అవుతాయని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల్లో ఏ దశలోనైనా మార్పులు జరుగవచ్చన్నారు. అయితే భిన్న రంగాలకు చెందిన మేధావులతో కూడిన ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులను యథాతధంగా ఆమోదించే అవకాశముందన్నారు. వయోపరిమితి పెంపు, ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉందన్నారు. సివిల్స్ తరహాలో ఒకే పరీక్ష మేలు: హరగోపాల్ రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీసెస్ విధానం ఉంటే మంచిదేనని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా పరీక్షా విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. వేర్వేరు పరీక్షలు కాకుండా సివిల్స్ తరహాలో ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యే వారు మాత్రమే ఐఏఎస్ హోదాకు వెళ్లగలుగుతున్నారని తెలిపారు. కర్ణాటకలో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ కేడర్ ఉందని, దానికి ఎంపికైన వారికి సీనియారిటీ ఆధారంగా ఐఏఎస్ హోదా కల్పిస్తున్నారని, అలాంటి విధానం తెలంగాణలోనూ ఉంటే బాగుంటుందని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. -
పరస్పర సహకారంతో పని చేద్దాం
ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: ఒకే భవనంలో ఉన్న ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరస్పర సహకారం, సోదరభావంతో పని చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆకాక్షించారు. కమిషన్ కార్యాలయంలో సోమవారం ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్ శివన్నారాయణను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీపీఎస్సీ కార్యాలయ భవనం, సిబ్బంది విభజన పూర్తికి రాష్ట్ర విభజన విభాగం తెలంగాణ కార్యదర్శి రామకృష్ణారావు హామీ ఇచ్చినట్టు ఘంటా తెలిపారు. అనంతరం సీఎస్ డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింగరావులతో చర్చించారు. -
గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే..
‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానం రూపొందించిన తరువాతే గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. పరీక్షా విధానం రూపకల్పన, సిలబస్‌ను నిర్ణయించేందుకు నిపుణుల కమిటీలతో ప్రత్యేకంగా అధ్యయనం చేయిస్తామని చెప్పారు. కమిషన్‌లో త్వరలో చేపట్టనున్న మార్పులపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. గ్రూప్-1, 2 పరీక్షల నిర్వహణపై రెండు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఒక కమిటీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేస్తుంది. మరో కమిటీ పరీక్షల విధానం, షెడ్యూల్‌పై అధ్యయనం చేసి కమిషన్‌కు నివేదిక ఇస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సిలబస్‌ను ప్రకటిస్తాం. మార్చి తరువాతే గ్రూప్-1, 2 నోటిఫికేషన్లను విడుదల చేస్తాం. జనవరిలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని సర్వీస్ కమిషన్ చేపట్టే అంశంపై విద్యాశాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నాం. యూపీఎస్సీ తరహా పరీక్షా విధానం దేశంలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును పరిశీలించిన తరువాతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏటా పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. అందులో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫలితాల ప్రకటన తేదీలను పరీక్షకు ముందుగానే తెలియజేస్తాం. అభ్యర్థుల వ్యక్తిత్వం తెలుసుకునేందుకు సివిల్స్ తరహాలో అదనంగా మరో పేపర్‌ను గ్రూప్-1 పరీక్షలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. గ్రూప్1, గ్రూప్-2 (ఎగ్జిక్యూటివ్) పరీక్షలకు ఇంటర్వ్యూలుంటాయి. నిష్పాక్షికంగా, పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే ఇంటర్వ్యూకు మార్కులుంటాయి. కేరళ తరహాలో... కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా... డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, డిప్లమో వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హతల వివరాలు కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగుల డేటా బేస్ మా వద్ద సిద్ధంగా ఉంటుంది. ప్రతి పరీక్షకు అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధానం ప్రవేశపెడతాం. ఇక ఆయా శాఖలో ఏటా ఎన్ని పదవీ విరమణలు (రిటైర్మ్ంట్స్) ఉంటాయో ముందే జాబితా సిద్ధం చేసుకొని వారు రిటైరయ్యే సమయానికి కొత్త అభ్యర్థులు ఆ పోస్టుల్లో చేరే విధంగా పరీక్షలు ముందుగానే నిర్వహించి అభ్యర్థుల మెరిట్ లిస్టు సిద్ధంగా ఉంచుతాం. ఆ శాఖ కోరగానే ఈ జాబితాను వారికి అందజేస్తాం. దీంతో తక్షణం ఖాళీల భర్తీ చేయడానికి వీలవుతుంది. మెరుగైన పాలన, సుపరిపాలన అందించే అవకాశం ఉంటుంది. జనవరిలో ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించేందుకు అన్ని విభాగాల అధిపతులతో చీఫ్‌సెక్రటరీ సమక్షంలో జనవరిలో కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. అప్పుడే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి. ఏ క్యాడర్లో ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఇక ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఖాళీలను గుర్తించి, వాటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తరవాత కమిషన్‌కు అందజేస్తేనే మేం పరీక్షలు నిర్వహిస్తాం. లక్ష ఉద్యోగాలా అంతకంటే ఎక్కువా తక్కువా అన్న అంశం ప్రభుత్వం పరిశీలిస్తుంది. పకడ్బందీగా పరీక్షలు అనువాదం, అన్వయ దోషాలు లేకుండా చూసేందుకు కమిషన్‌లో అకడమిక్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఇందులో ఆయా సబ్జెక్టుల ప్రొఫెసర్లుంటారు. పరీక్షలకు సంబంధించి ప్రశ్నల నిధిని కూడా రూపొందించాలని యోచిస్తున్నాం. ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా గుర్తించే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. ప్రతి పరీక్షకు 4 సెట్ల ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్ష జరిగే రోజున ఒక సెట్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తాం. కొత్త రాష్ట్రం.. కొత్త సిలబస్.. గ్రూప్స్ పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉండటం తప్పనిసరి. తెలంగాణ చరిత్ర, ఆర్థిక వనరులు, నైసర్గిక స్వరూపం, పరిశ్రమలు, సాహిత్యం, ఆర్థిక వ్యవస్థ స్వరూపం, కవులు, తెలంగాణ ఉద్యమం తదితర అన్ని అంశాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలుంటాయి. నిపుణుల కమిటీ నివేదిక వస్తేనే సిలబస్‌పై స్పష్టత వస్తుంది. తగినంత సిబ్బంది లేకనే ఆలస్యం సర్వీస్ కమిషన్ నూతనంగా ఏర్పాటైనా పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, వనరులు లేకపోవడం వల్లే పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాం. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు పూర్తిస్థాయి సిబ్బంది, కార్యాలయం, బడ్జెట్ కేటాయిస్తుందని భావిస్తున్నాం. ఆ తరవాతే కమిషన్ పనులు వేగవంతమవుతాయి. స్థానికత నిర్థారించేది ప్రభుత్వమే అభ్యర్థుల స్థానికతను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో కమిషన్ ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వం 1956నే ప్రామాణికంగా తీసుకుంటే దాన్నే కమిషన్ అమలుచేస్తుంది. -
ఆదర్శ కమిషన్‌గా పేరు తీసుకురండి
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు గవర్నర్ నరసింహన్ సూచన సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు (టీఎస్పీఎస్సీ) ఆదర్శ కమిషన్‌గా పేరు తీసుకురావాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్లు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, కమిషన్‌ను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులకు ఉద్యోగాలివ్వడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని, ఆ దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. తాను టీం సభ్యునిగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. -
పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు!
* ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి * ఉద్యోగార్థులకు తెలంగాణపై అవగాహన ఉండాల్సిందే * సిలబస్‌లో మార్పులపై నిపుణులతో కమిటీ వేస్తాం * పోటీ పరీక్షల స్థాయినిబట్టి ప్రశ్నలుంటాయి * ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లకుండా మరో సెల్ * నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్ల ప్రక్రియ వేగవంతం * ఉద్యోగ నోటిఫికేషన్లోనే సమస్త వివరాలుంటాయి * వీలైతే వచ్చేనెలలో ఏదైనా చిన్న నోటిఫికేషన్ ఇస్తాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగం చేయబోయే ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ, భౌగోళిక అంశాలపై అవగాహన ఉండాల్సిందేనని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టంచేశారు. ఈ అంశాలన్నింటిపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలుంటాయని చెప్పారు. ఈ మేరకు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు తెస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కమిషన్‌లో తీసుకురాబోయే సంస్కరణలు, నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించేందుకు చేపట్టబోయే చర్యలను సంస్కరణలను వివరించారు. ‘‘తెలంగాణలో ఉద్యోగం చేయబోయే వారికి ఇక్కడి చరిత్ర, సంస్కృతి, నైసర్గిక స్వరూపం తెలిసి ఉండాలి. ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు, ఉద్యమాలు, పోరాటాలు అన్నింటిపై కచ్చితమైన అవగాహన అవసరం. అవి తెలియకపోతే ఉద్యోగి తెలంగాణలోని ప్రజలకు సంపూర్ణ న్యాయం అందించలేరు. అందుకే పోటీ పరీక్షల్లో ఈ అంశాలన్నింటిపై ప్రశ్నలు ఉంటాయి. అందుకు సిలబస్‌లో మార్పులు తెస్తాం. అయితే పోటీ పరీక్ష స్థాయిని బట్టి ఈ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం ప్రొఫెసర్లు, అధికారులు, కమిషన్ సభ్యులతో కూడిన ప్రత్యేక అకడమిక్ కమిటీని ఏర్పాటు చేస్తాం. బ్రిటిష్ కాలంలో ఐసీఎస్‌కు లండన్‌లో శిక్షణ ఏర్పాటు చేసినా ఉద్యోగం చేయాల్సిన భారతదేశానికి సంబంధించిన అంశాలపైనే శిక్షణ ఇచ్చేవారు. అలాగే తెలంగాణలో ఉద్యోగం చేయబోయే ప్రతి ఒక్కరికి తెలంగాణకు సంబంధించిన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాల్సిందే. అందుకోసమే సిలబస్‌లో మార్పులు తెస్తాం’’అని చక్రపాణి చెప్పారు. పలు అంశాలపై ఆయన ఏం చెప్పారంటే.. వారంలో సిలబస్ మార్పులపై కమిటీ గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4 తదితర పోటీ పరీక్షల్లో పరీక్ష వారీగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ చేసే సిఫారసులను నెల రోజుల్లోగా తెప్పించుకొని అమల్లోకి తెస్తాం. పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నపత్రాల్లో అనువాద, అన్వయ దోషాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నోటిఫికేషన్ల వారీగా అర్హతలు, వివాదాలు తలెత్తనివిధంగా చేపట్టాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో అకడమిక్ సెల్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రశ్నపత్రాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంది కనుక ఈ కమిటీ కాన్ఫిడెన్షియల్. ఏ పరీక్షలకు ఇంట ర్వ్యూలు ఉండాలి. ఏ పరీక్షలకు ఇంటర్వ్యూలు అవసరం లేదనే అంశాలను ఈ సెల్ చూస్తుంది. అంతేకాదు యూపీఎస్సీ తరహా పరీక్ష విధానాన్ని అమలు చేస్తాం. అందులో లోపాలుంటే తొలగించి మంచివి తీసుకుంటాం. భవిష్యత్తు పాలన ఈ లక్ష ఉద్యోగాల భర్తీపైనా ఆధార పడి ఉంటుంది కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ప్రతి పరీక్షకు కేలండర్ ఏటా నోటిఫికేషన్ల అంశానికి సంబంధించి కాకుండా, పరీక్ష వారీగా కేలండర్‌ను అమలు చేస్తాం. నోటిఫికేషన్లోనే పరీక్ష దరఖాస్తు తేదీ నుంచి చివరి తేదీ, హాల్‌టికెట్ల జారీ, రాత పరీక్ష, ఫలితాలు, పోస్టింగ్ ఇచ్చే తేదీలతో సహా కేలండర్‌ను జారీచేస్తాం. ఇదంతా ఆన్లైన్లోనే చేపడతాం. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఐదారు నెలల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేస్తాం. ఆన్లైన్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగుల వివరాలను సేకరిస్తాం. ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న స్పష్టమైన వివరాలు వస్తాయి. సవాళ్లను అధిగమిస్తాం మా ముందు మూడు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. పక్కా చర్యలతో వాటిని విజయవంతంగా అధిగమిస్తాం. కమిషన్ ఏర్పాటుతో ఇప్పటికే ఓ అడుగు ముందుకు పడింది. నిరుద్యోగుల్లో నమ్మకం వచ్చింది. ఇన్నాళ్లు ఉద్యమాల్లో ఉన్న వారు నోటిఫికేషన్ల జారీతో పోటీ పరీక్షల వైపు మళ్లేలా చూస్తాం. పారదర్శకంగా నియామకాలు చేపట్టి టీఎస్పీఎస్సీపై నమ్మకాన్ని కల్పిస్తాం. లక్ష ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వానికి అవసరమైన అర్హతలు, బాధ్యతలతో కూడిన వారిని అందిస్తాం. వారి విషయంలో విధాన నిర్ణయం మేరకే.. కమిషన్ చేపట్టే నియామకాలన్నీ ప్రభుత్వ విధానపర నిర్ణయాల ప్రకారమే ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న యువత విషయంలో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్నే అమలు చేస్తాం. కమిషన్ విధానపర నిర్ణయాలు చేయదు. -
'ఆ విధానాలకు TSPSC లో స్థానం లేదు'
-
'ఆ విధానాలకు టీఎస్పీఎస్సీలో స్థానం ఉండదు'
హైదరాబాద్:గత ఏపీపీఎస్సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విధానాలకు టీఎస్పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్)లో స్థానం ఉండదని చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకున్నట్లుగానే నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఆసన్నమైందన్నారు. దేశంలో బెస్ట్ సర్వీస్ కమిషన్ ప్రకారం టీఎస్పీఎస్సీ విధివిధానాలు ఉంటాయని చక్రపాణి తెలిపారు. అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల కంటే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. పూర్తి నిష్పక్షపాతంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్పీఎస్సీ పనిచేస్తోందన్నారు. ఉద్యోగులు, కార్యాలయాల విభజనకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందన్నారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను క్యాలండర్ ప్రకారం నిర్వహిస్తామన్నారు. -
కొత్త ఏడాదిలో కొత్త కొలువులు
త్వరలో నోటిఫికేషన్లు జారీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నియామకాల్లో ప్రతిభకే పట్టం కడతాం పారదర్శకతకు పెద్దపీట రాజకీయ జోక్యానికి తావుండదు కమిషన్ చైర్మన్‌గా ఘంటా బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామని, కొత్త ఏడాది కొత్త ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య కొంత పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టి ప్రతిభా వంతులకే ఉద్యోగాలిస్తామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన చక్రపాణితో గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్ సభ్యులుగా నియమితులైన సి.విఠల్, బానోతు చంద్రావతితో చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారిని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమానికి కమిషన్ మరో సభ్యుడు మతీదుద్దీన్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా చక్రపాణి విలేకరులతో మాట్లాడారు. అనంతరం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కమిషన్ ఉద్యోగులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో చక్రపాణి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతాం. నేటి నుంచే పని ప్రారంభిస్తాం. నియామకాల విధానంపై రెండు మూడు రోజుల్లో చర్చిస్తాం. నాలుగైదు నెలల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుంది’’ అని చెప్పారు. వివిధ శాఖల్లో విభజన పూర్తి కాలేదని, ఆ ప్రక్రియ పూర్తయితే మరిన్ని ఉద్యో గ ఖాళీలు వస్తాయన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి ప్రయత్నిస్తామన్నారు. నియామకాల్లో పైరవీలకు అవకాశం ఇవ్వబోమని, ఎవరి మాటా వినకుండా ఉంటాను కాబట్టే సీఎం తనకు ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. ‘‘సీఎం చెప్పినా వినకుండా నిజాయితీకి పట్టం కడతా. కమిషన్ పరంగా గతంలో జరిగిన పొరపాట్లు తెలంగాణ కమిషన్‌లో జరగవు. ఇంటర్వ్యూలకు మినహా నిరుద్యోగులు కమిషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడతాం. దరఖాస్తులు, హాల్‌టికెట్లు అన్నీ ఆన్లైన్ చేస్తాం. ఒత్తిళ్లకు లొంగకుండా, అవినీతికి తావు లేకుండా ఆదర్శ వ్యవస్థగా కమిషన్‌ను నిలబెడతాం’’ అని చెప్పారు. కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ... పైరవీలు చేస్తే ఉద్యోగాలు వస్తాయన్నది గతమన్నారు. ఇకపై అలా ఉండదన్నారు. గతంలో నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేశారని, ఇంటర్వ్యూల్లో ఏపీవారికి 80 మార్కుల వరకు వేస్తే తెలంగాణ వారికి 15 నుంచి 20 మార్కులే వేసి అన్యాయం చేశారన్నారు. తండ్రి పేర్లతో తెలంగాణ వారిగా గుర్తించి మరీ తప్పిదాలకు పాల్పడ్డారన్నారు. సభ్యురాలు బానోతు చంద్రావతి మాట్లాడుతూ అభ్యర్థుల ఆశలకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని చెప్పారు. నిరుద్యోగులు ప్రిపరేషన్లో ఉండాలని సూచించారు. తెలంగాణ సర్వీసు కమిషన్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ విద్యార్థుల ఆశలకు అనుణంగా సీఎం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు జరక్కుండా కమిషన్ చూడా లని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు మాట్లాడారు. త్వరలోనే గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. టీఎస్పీఎస్సీకి చాంబర్ సమస్య తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు వసతి సమస్య ఎదురైంది. రాష్ట్ర విభజన తరువాత కూడా ఏపీపీఎస్సీలోని ఉద్యోగులను, భవనాలను విభజించకపోవడంతో తెలంగాణ చైర్మన్‌కు, సభ్యులకు గదుల కొరత ఏర్పడింది. ఆగస్టు 8న టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేస్తూ టీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినా ఏపీపీఎస్సీలోని ఉద్యోగులను, కార్యాలయ భవనాన్ని విభజించలేదు. మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శిని, బుధవారం కమిషన్ చైర్మన్‌తోపాటు సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఏపీపీఎస్సీలో చైర్మన్, కార్యదర్శి, కొందరు సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నందున వారి చాంబర్లను తీసుకోవాలని, బాధ్యతల స్వీకరణ ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ అధికారులకు స్పష్టం చేసింది. అయితే వారంతా గురువారం కార్యాలయానికి వెళ్లేసరికి అక్కడ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇన్చార్జి చైర్మన్‌గా కమిషన్ సభ్యుడు శివనారాయణ, ఇన్చార్జి కార్యదర్శిగా కమిషన్ అదనపు కార్యదర్శి రమాదేవిలు ఇన్నాళ్లూ తమ చాంబర్లలోనే (సభ్యునిగా శివన్నారాయణకు కేటాయించిన చాంబర్లో, అదనపు కార్యదర్శిగా రమాదేవికి కేటాయించిన చాంబర్లో) ఉన్నారు. కాని గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన ఘంటా చక్రపాణి, కార్యదర్శి సుందర్ అబ్నార్ కమిషన్ కార్యాలయానికి వెళ్లగా ైచైర్మన్ చాంబర్లో శివనారాయణ, కార్యదర్శి చాంబర్లో రమాదేవి ఆసీనులయ్యారు. అయితే ఘంటా చక్రపాణి వెళ్లగానే ఏపీపీఎస్సీ ఇన్ చార్జి చైర్మన్ ఆ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. కాని ఏపీపీఎస్సీ ఇన్చార్జి కార్యదర్శి మాత్రం ఆ చాంబర్‌ను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇదివరకు మీ చాంబర్లోనే ఉన్నారు కదా, మేము వచ్చేసరికి ఇందులోకి వచ్చారేంటని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అడిగినా కుదరదని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే ఇస్తామన్నారు. పక్క గదిలో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉన్నందున ఈ చాంబర్‌ను ఇవ్వబోమన్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉన్నగదికి తాళం వేసి సీల్ వేసుకొమ్మని టీఎస్పీఎస్సీ కార్యదర్శి సూచించినా వినిపించుకోలేదు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం కార్యదర్శి చాంబర్‌ను టీఎస్పీఎస్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగం: ఘంటా చక్రపాణి
హైదరాబాద్: రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) పని చేస్తుందని చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. నిరుద్యోగుల సామర్ధ్యన్ని బట్టి ఉద్యోగాలు వస్తాయన్నారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గనని ఆయన చెప్పారు. అవినీతి రహిత ఆదర్శ వ్యవస్థగా టిఎస్పిఎస్సి పని చేస్తుందని తెలిపారు. టిఎస్పిఎస్సి సభ్యులు పారదర్శకంగా పని చేసి బంగారు తెలంగాణ నిర్మించాలని ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ నిరుద్యోగులకు రెండుమూడు నెలల్లో ఉద్యోగనియామకాల నోటిఫికేషన్ వెలువడుతుందని చక్రపాణి చెప్పారు. టిఎస్పిఎస్సి సభ్యుడు విఠల్ మాట్లాడుతూ ఇక కమిషన్ కార్యాలయం ముందు నిరుద్యోగుల ధర్నాలు ఉండవన్నారు. కమిషన్ సభ్యులుగా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే అదర్శంగా టిఎస్‌పిఎస్‌సిని తయారు చేస్తామన్నారు. ** -
బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. చక్రపాణితోపాటు టీఎస్పీఎస్సీ సభ్యులుగా సి.విఠల్, మతీదుద్దీన్ ఖాద్రీ, బానోతు చంద్రావతి బాధ్యతలు తీసుకున్నారు. వీరంతా ఆరేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌తో సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి
-
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి
* సభ్యులుగా విఠల్, చంద్రావతి, మతీదుద్దీన్ * గవర్నర్ ఆమోదంతో అర్ధరాత్రి జీవో జారీ * నేడు బాధ్యతలు స్వీకరించనున్న చక్రపాణి * అసంతృప్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) తొలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతిపాదనకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే కమిషన్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నేత సి.విఠల్, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, ప్రభుత్వోద్యోగి మతీదుద్దీన్ పేర్లను కూడా ఆమోదించారు. దీంతో వీరి నియామకానికి సంబంధించి అర్ధరాత్రికే రాష్ర్ట ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఐదుగురు సభ్యుల విషయంలో మాత్రం గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి, కేయూ ప్రొఫెసర్లు దినేష్‌కుమార్, పి. శ్రీనివాస్, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరంగారావు పేర్లను తిరస్కరించారు. ప్రభుత్వ సిఫారసు జాబితాను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారమే స్వయంగా రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి గవర్నర్‌కు అందించారు. అందరి పేర్లను పరిశీలించిన గవర్నర్.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు ఐదుగురి విషయంలో అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం సభ్యుల్లో సగం మంది విధిగా ప్రభుత్వ ఉద్యోగులై, వారు కనీసం 20 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసుకుని ఉండాలి. అయితే ప్రొఫెసర్లు ప్రభుత్వోద్యోగుల కిందకు రారని, వారు స్వయం ప్రతిపత్తిగల విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే జాబితాలోని ఇద్దరు న్యాయవాదులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌తోనూ ఫోన్లో చెప్పినట్లు సమాచారం. దీంతో ఐదుగురి పేర్లను నరసింహన్ తిరస్కరించారు. దీంతో మిగిలిన వారి నియామక ఉత్తర్వుల జారీ విషయంలో ప్రభుత్వం తర్జనభర్జనలు పడింది. చివరకు కమిషన్ చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. వీరంతా ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్‌గా నియమితులైన ఘంటా చక్రపాణి గురువారం ఉదయం 11.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన ఘంటాను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 1.07 లక్షల ఖాళీల్లో టీఎస్పీఎస్సీ భర్తీ చేయాల్సిన ఉద్యోగాలే 60 వేల వరకు ఉంటాయని అంచనా. పదవుల భర్తీపై కేసీఆర్ దృష్టి కాగా, కార్పొరేషన్ పదవుల భర్తీపైనా సీఎం దృష్టి సారించారు. మంత్రివర్గంలో చోటు ఆశించి, భంగపడిన ఎమ్మెల్యేలకు ముందుగా అవకాశం ఇవ్వాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై కొందరు సన్నిహితులతో సీఎం తాజాగా చర్చించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నవారిని, వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లు, ఆలస్యంగా చేరినా హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నవారికి, వివిధ రంగాల్లో నిపుణులను కార్పొరేషన్ల పదవులకు నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తమకు తగిన గుర్తింపు లభించడం లేదని, పార్టీ కోసం కష్టపడినా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే టీఆర్ఎస్లోని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షునిగా ఉన్న మందుల సామేలు, పార్టీ మానకొండూరు ఇన్చార్జిగా ఉన్న ఓరుగంటి ఆనంద్ వంటివారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. -
తెలంగాణ అస్థిత్వాన్ని అణగదొక్కారు
తెయూ(డిచ్పల్లి) : సమైక్యవాద పాలకులు తెలంగాణ అస్థిత్వాన్ని అణగదొక్కారని, తెలంగాణ విషయంలో చరిత్రలో చాలా తప్పులు జరిగాయని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఐసీఎస్ఎస్ఆర్, తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ‘సామాజిక శాస్త్రాలు- ఈనాటి స్థితి’ (స్టేటస్ ఆఫ్ సోషల్ సెన్సైస్)’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సు రెండో రోజు సమావేశంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రసంగించారు. సామాజిక శాస్త్రవేత్తలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలపై తప్పులు దొర్లకుండా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజిక శాస్త్రాల పరిశోధనల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. సామాజిక శాస్త్రవేత్తలపై ఈ అంశంలో గురుతర బాధ్యత ఉందన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు. ఈ హామీల అమలు ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పోరాట చరిత్ర, నిజాం రాజుల పాలన, సమ్మక్క-సారక్కల చరిత్ర భావితరాలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వలసలు, వ్యవసా యం, చ రిత్ర, సామాజిక , ఆర్థిక పరిస్థితులపై సమగ్రమైన పరిశోధనలు మరింత లోతుగా జరుపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.