
పరస్పర సహకారంతో పని చేద్దాం
ఒకే భవనంలో ఉన్న ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్‌సీ పరస్పర సహకారం, సోదరభావంతో పని చేయాలని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆకాక్షించారు.
- ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌తో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: ఒకే భవనంలో ఉన్న ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్‌సీ పరస్పర సహకారం, సోదరభావంతో పని చేయాలని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆకాక్షించారు. కమిషన్ కార్యాలయంలో సోమవారం ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్ శివన్నారాయణను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీపీఎస్సీ కార్యాలయ భవనం, సిబ్బంది విభజన పూర్తికి రాష్ట్ర విభజన విభాగం తెలంగాణ కార్యదర్శి రామకృష్ణారావు హామీ ఇచ్చినట్టు ఘంటా తెలిపారు. అనంతరం సీఎస్ డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింగరావులతో చర్చించారు.