2011 గ్రూప్-1 మెయిన్స్‌పై టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ చైర్మన్ల భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ), ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్లు ఘంటా చక్రపాణి, పి.ఉదయభాస్కర్‌లు శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనంలోని చక్రపాణి చాంబర్లో జరిగిన ఈ భేటీలో.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తిరిగి మెయిన్స్ నిర్వహించే అంశంపై చర్చించారు. సెప్టెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు ఈ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను జారీ చేసిన విషయాన్ని ఉదయభాస్కర్.. చక్రపాణికి తెలియజేశారు.
పరీక్షలను తెలంగాణ ఏయే తేదీల్లో నిర్వహిస్తుందో, సిలబస్ తదితర అంశాలపై చర్చించారు. పరీక్షలను రెండు రాష్ట్రాలు వేర్వేరుగా పెట్టినా.. ఒకేరోజు నిర్వహిస్తే మంచిదని చక్రపాణి ప్రతిపాదించినట్లు సమాచారం. పరీక్షను ఒకేరోజు రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తే అభ్యర్థులు ఏదో ఒక రాష్ట్రంలోనే అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారని, మరో రాష్ట్రంలోని అవకాశాల్ని కోల్పోయే అవకాశముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. దీనిపై ఏంచేయాలన్న దానిపై ఒక అభిప్రాయానికి రానందున మంగళవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.
కుదరని ఏకాభిప్రాయం
Published Sat, Jul 30 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement
Advertisement