udayabhaskar
-
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
ఎస్బీఐకి రూ.50వేలు జరిమానా
విశాఖ లీగల్: రుణం ఇవ్వకుండానే ఓ వ్యక్తి నుంచి 10 నెలలు ఈఎంఐ వసూలు చేసిన విశాఖలోని ఎన్ఏడీ కొత్త రోడ్లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖకు జిల్లా వినియోగదారుల ఫోరం–2 రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీలు చేయగా, జరిమానాను రూ.50వేలకు తగ్గించింది. విశాఖలోని మురళీనగర్‌కు చెందిన మాథా ఉదయభాస్కర్ భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఆయన జీతం ఎన్ఏడీ కొత్త రోడ్‌లోని ఎస్బీఐ శాఖలో ఉన్న తన ఖాతాలో జమ అవుతుంది. ఉదయభాస్కర్ మధురవాడలో సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.25లక్షలు రుణం కావాలని 2017లో ఎస్బీఐ ఎన్ఏడీ కొత్త రోడ్ శాఖ అధికారులను సంప్రదించారు. రుణం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు అంగీకరించి, ఆయనతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఇంటికి కొన్ని అనుమతులు రాకపోవడం వల్ల రుణం మంజూరు చేయలేదు. కానీ, రుణం ఇచ్చి నట్లుగానే ఉదయభాస్కర్ బ్యాంక్ ఖాతా నుంచి నెలకు రూ.21,538 చొప్పున 10నెలలు రూ.2,15,380లు, సరైన సమాచారం ఇవ్వలేదని మరో రూ.10వేలు కట్ చేసుకున్నారు. బీమా సొమ్ము కింద పీఎన్బీ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.2,701 తీసుకున్నారు. తన ఖాతా నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంక్, బీమా కంపెనీవారిని ఉదయభాస్కర్ కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆయన 2019లో విశాఖలోని వినియోగదారుల ఫోరం–2లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన ఫోరం–2 న్యాయమూర్తి జి.వేంకటేశ్వరి, సభ్యులు డాక్టర్ రమణబాబు, పి.విజయదుర్గ.. వినియోగదారుడికి సేవాలోపం కలిగించినందుకు ఎస్బీఐ ఎన్ఏడీ కొత్త రోడ్ శాఖకు రూ.లక్ష జరిమానా విధిస్తూ 2022, మేలో తీర్పు చెప్పారు. ఈఎంఐ, జరిమానా, బీమా రూపంలో తీసుకున్న రూ.2,15,380లను12% వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల కింద మరో రూ.20వేలను కలిపి 45 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఫోరం తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆదేశిస్తూ జరిమానాను తగ్గించారు. -
మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ల షెడ్యూల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబర్ ఆఖరు నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. డిసెంబర్ ఆఖరు నాటికి అన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి.. పోస్టుల భర్తీ పరీక్షలు వచ్చే ఏడాది నిర్వహిస్తామని చెప్పారు. నోటిఫికేషన్ల షెడ్యూల్‌ను 15 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టుల ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే సిలబస్‌ను పెడుతున్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందని వెల్లడించారు. ఈ సిలబస్‌ను వచ్చే వారం వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. -
ఏపీపీఎస్సీ.. ఎవరిమాటా వినదు!
సాక్షి, అమరావతి: గ్రూప్–2 (2016) నియామకాలకు సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకొన్న వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుతో తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. 982 పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ గ్రూప్–2పై ఆది నుంచి అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ పరీక్షల్లో లోపాలపై తమ అభ్యర్థనలను కమిషన్ వినలేదని, చివరకు పరీక్షలు, ఫలితాల వెల్లడి అనంతరం అభ్యంతరాలనూ పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించామని, కేసులు పరిష్కారమై తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న సమయంలో కమిషన్ తమకు అన్యాయం చేస్తోందని వాపోతున్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నా కమిషన్ తుది ఫలితాలను ప్రకటించడమే కాకుండా నియామకాలకు ముందుకు వెళ్లడంతో తమకు దిక్కుతోచడం లేదని వారంటున్నారు. ఆది నుంచీ వివాదాలే.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 25 వేల మంది దాటడంతో ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇందులో రిజర్వేషన్లు పాటించకపోవడంతో ఆయా వర్గాలకు నష్టం వాటిల్లుతుందని ముందే అభ్యంతరాలు వచ్చినా కమిషన్ పట్టించుకోలేదు. మెయిన్స్‌లో మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారిని ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో భర్తీ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా ఏపీపీఎస్సీ వారిని రిజర్వుడ్ కోటాలోనే ఉంచేస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ రిజర్వుడ్ అభ్యర్థిని ఓపెన్ కేటగిరీలోకి పంపితే రిజర్వుడ్ కోటాలో ఆ తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కుతుంది. కమిషన్ తీరు వల్ల రిజర్వుడ్ వర్గాల అవకాశాలు దెబ్బతింటున్నాయి. గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహణలో అనేక సమస్యలు, ఆన్లైన్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తి గందరగోళం ఏర్పడింది. చివరకు ప్రిలిమ్స్‌ను 3 నెలల వ్యవధి ఇచ్చి నిర్వహించారు. ప్రిలిమ్స్ కంటే అనేక సబ్జెక్టులు మెయిన్స్‌లో ఉన్నా కమిషన్ కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇవ్వడంతో ఆందోళనలు రేగాయి. ప్రామాణిక పుస్తకాలు కూడా లేక అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. గ్రూప్–2ను జోనల్ స్థాయి పరీక్షగా పేర్కొన్నా కటాఫ్‌ను నిర్ణయించేటప్పుడు రాష్ట్ర స్థాయిగా చూపడంతో రాష్ట్రానికి చెందిన పలువురు అభ్యర్థులు నష్టపోయారు. మెయిన్స్‌లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు మెయిన్స్ పరీక్ష నిర్వహణలోనూ లోపాలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నంతో సహా కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చాయి. ఈ సమస్యలపై తమ అభ్యర్థనలను కమిషన్ పట్టించుకోకపోవడంతో పలువురు ఆందోళనలు చేయగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కమిషన్ వెబ్‌నోట్ విడుదల చేసింది. మెయిన్స్‌లో జరిగిన లోపాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. స్టే ఎత్తేయడం వల్లే నియామకాలు: ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ గ్రూప్–2కు సంబంధించి న్యాయస్థానంలో దాఖలైన కేసులపై స్టేను ఎత్తేయడంతో నియామకాలు చేపట్టామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. ఆయా కేసులున్న పోస్టు కోడ్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందన్న షరతులతోనే తుది జాబితాను విడుదల చేశామన్నారు. -
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేసే ప్రసక్తే లేదు
హైదరాబాద్ : ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసే ప్రసక్తే లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 20,21 తేదీల్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఉదయభాస్కర్ సూచించారు. పరీక్ష వాయిదాకు సహేతుకమైన కారణాలేవీ లేవని ఆయన అన్నారు. కాగా ఏపీపీఎస్సీ మే లో నిర్వహించబోయే గ్రూప్–2 మెయిన్ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని జాతీయ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్–2 పోస్టులను పెంచాలని, మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిన్న నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్–2 నిరుద్యోగుల పాలిట శాపం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై ఏపీపీఎస్సీ చైర్మన్ స్పందిస్తూ ...మెయిన్స్‌పై స్పష్టత ఇచ్చారు. -
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా వేయలేం
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నిర్ణీత తేదీల్లో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ఈనెల 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను మార్చి 20న ప్రకటిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారని, దాదాపు 15 రోజులు ఆలస్యమైనందున ఆ మేరకు మెయిన్స్ పరీక్షల తేదీలను పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన మాట్లాడుతూ.. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల ఆలస్యమైనా, దీనికి సంబంధించిన ‘కీ’లను ముందుగానే వెబ్సైట్లో పెట్టామన్నారు. తద్వారా ఎన్ని మార్కులు వస్తాయో అభ్యర్థులు ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశముందని చెప్పారు. దాని ప్రకారమే మెయిన్స్‌కు ప్రిపేరై ఉండొచ్చన్నారు. కొన్ని కోచింగ్ సెంటర్ల వారే మెయిన్స్‌కు మరింత సమయం కావాలన్న వాదనను తెరపైకి తెచ్చారని.. ఇలాంటి వాటిని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే మే 20, 21 తేదీల్లోనే మెయిన్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1999 గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇటీవల మెరిట్ జాబితా విడుదల చేసినా.. ఇందులో రీలింక్విషన్(రద్దు) లేఖలు ఇచ్చిన వారి స్థానాల్లో ఎంపికలు నిర్వహించాల్సి ఉందని ఉదయభాస్కర్ చెప్పారు. ఇది పూర్తయిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితాను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఇదే గ్రూప్ 2కి సంబంధించిన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితాను వారం పది రోజుల్లో వెల్లడిస్తామని ప్రకటించారు. వీటికి ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి సంబంధం లేదని వివరించారు. -
గ్రూప్–2 హాల్‌టికెట్ల జారీలో గందరగోళం
⇒ పలువురికి డౌన్లోడ్ కాని హాల్‌టికెట్లు ⇒ తీవ్ర ఆందోళనలో అభ్యర్థులు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్ 2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈనెల 26న నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షకు హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆదివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఎక్కువమందికి హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాలేదు. జారీ అయినవి కూడా తప్పులతడకగా ఉన్నాయి. కొందరికి అసలు దరఖాస్తు చేయనేలేదనే సమాచారం వచ్చింది. పలువురు బీసీ అభ్యర్థులకు ఓసీలుగా వచ్చింది. బీసీ–ఏ కులానికి చెందిన కొందరికి బీసీ–సీ అని వచ్చింది. గ్రూప్ 2లో 982 (442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకోసం గత నవంబర్‌లో నోటిఫికేషన్ జారీచేయడంతో 6,57,010 మంది (తెలంగాణ వారితో కలిపి) దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై వివాదం గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారే తప్ప రిజర్వేషన్ల ప్రకారం మెయిన్స్‌కు ఎంపికచేసే విధానం ఉండదని తెలపలేదని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తిచేసిన అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్ అప్లికేషన్ పరీక్షలో కూడా అర్హత సాధించాలన్న నిబంధనపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తప్పులు సరిచేస్తున్నాం:ఏపీపీఎస్సీ చైర్మన్ అభ్యర్థుల ఆందోళనల గురించి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్తో ప్రస్తావించగా ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. వీటిని సరిచేయిస్తున్నామన్నారు. కులం సమాచారం తప్పుగా వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
నెలాఖరుకల్లా నోటిఫికేషన్
- గ్రూప్-1, 3 పోస్టుల భర్తీ - ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ వెల్లడి - ఏఈఈ పోస్టులకు 29, 30న మెయిన్ పరీక్షలు సాక్షి, విశాఖపట్నం: గ్రూప్-1, 3లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ డా.పి.ఉదయభాస్కర్ వెల్లడించారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ గ్రూప్-1, గ్రూప్-3లో నోటిఫికేషన్లో వెయ్యికిపైగా పోస్టులు ఉండబోతు న్నాయన్నారు. జనవరిలో నోటిఫికేషన్ ఇస్తే వయోపరిమితిలో నిరుద్యోగులకు ఇబ్బంది ఏర్పడుతుందన్న భావనతోనే ఈ నెలాఖరులోగా జారీ చేయనున్నామని చెప్పారు. రెండు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్-2లో 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 256 ఏఈ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్, ప్రిలిమ్స్ పూర్తయ్యాయని, ఈనెల 29, 30 తేదీల్లో మెరుున్ పరీక్షలు నిర్వహించబోతున్నా మని తెలిపారు. ఈసారి పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా చేపట్టాలని ఆలోచనలో ఉన్నామని, పైగా పూర్తిగా జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. అవకత వకలకు ఆస్కారం లేకుండా ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరు, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏఈఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో 1:50 నిష్పత్తిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 37,489 మంది ఫైనల్ పరీక్షలకు అర్హత పొందారన్నారు. ఇటీవల గ్రూప్-2 కింద వివిధ కేడర్లలో 984 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 లక్షల దరఖాస్తులొచ్చాయని ఈనెల 10 వరకు గడువు ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గ్రూప్-2 పోస్టులకు రిజర్వేషన్లు వర్తించవన్నారు. -
నెలలో 2011 ‘ఏపీ గ్రూప్ 1’ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ ఈ నెల 14 నుంచి నిర్వహించిన 2011 గ్రూప్ 1 మెయిన్స్ పునఃపరీక్షలు శనివారంతో ముగిశాయి. ఫలితాలు వెల్లడించడానికి నెల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఇంటర్వ్యూలు పూర్తి చేసి నియామకాల జాబితాను ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ సమర్పించనుంది. -
అక్టోబర్ 14 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 1999 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి తిరిగి మెరిట్ జాబితా రూపకల్పన, ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక సర్వీస్ కమిషన్ ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 14 నుంచి 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. శనివారం రాత్రి, లేదా ఆదివారం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చనున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి వైవీఎస్టీ సాయి పేర్కొన్నారు. ఈ జాబితాను త్వరలోనే వెబ్సైట్లో పెట్టనుంది. తాజా జాబితా ప్రకారం 317 మంది కొత్తగా ఇంటర్వ్యూలకు ఎంపిక కానున్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. -
కుదరని ఏకాభిప్రాయం
2011 గ్రూప్-1 మెయిన్స్‌పై టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ చైర్మన్ల భేటీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ), ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్లు ఘంటా చక్రపాణి, పి.ఉదయభాస్కర్‌లు శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనంలోని చక్రపాణి చాంబర్లో జరిగిన ఈ భేటీలో.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తిరిగి మెయిన్స్ నిర్వహించే అంశంపై చర్చించారు. సెప్టెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు ఈ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను జారీ చేసిన విషయాన్ని ఉదయభాస్కర్.. చక్రపాణికి తెలియజేశారు. పరీక్షలను తెలంగాణ ఏయే తేదీల్లో నిర్వహిస్తుందో, సిలబస్ తదితర అంశాలపై చర్చించారు. పరీక్షలను రెండు రాష్ట్రాలు వేర్వేరుగా పెట్టినా.. ఒకేరోజు నిర్వహిస్తే మంచిదని చక్రపాణి ప్రతిపాదించినట్లు సమాచారం. పరీక్షను ఒకేరోజు రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తే అభ్యర్థులు ఏదో ఒక రాష్ట్రంలోనే అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారని, మరో రాష్ట్రంలోని అవకాశాల్ని కోల్పోయే అవకాశముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. దీనిపై ఏంచేయాలన్న దానిపై ఒక అభిప్రాయానికి రానందున మంగళవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.