గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా వేసే ప్రసక్తే లేదు | group-2 mains exam no postponement,exam on May 20,21st, says appsc chairman | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-2 మెయిన్స్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ

Published Thu, May 4 2017 8:24 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

group-2 mains exam no postponement,exam on May 20,21st, says appsc chairman

హైదరాబాద్‌ : ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేసే ప్రసక్తే లేదని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మే 20,21 తేదీల్లో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఉదయభాస్కర్‌ సూచించారు. పరీక్ష వాయిదాకు సహేతుకమైన కారణాలేవీ లేవని ఆయన అన్నారు.

కాగా ఏపీపీఎస్సీ మే లో నిర్వహించబోయే గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని జాతీయ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్‌–2 పోస్టులను పెంచాలని, మెయిన్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట  నిన్న నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్‌–2 నిరుద్యోగుల పాలిట శాపం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై ఏపీపీఎస్సీ చైర్మన్‌ స్పందిస్తూ ...మెయిన్స్‌పై స్పష్టత ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement