సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ ఈ నెల 14 నుంచి నిర్వహించిన 2011 గ్రూప్ 1 మెయిన్స్ పునఃపరీక్షలు శనివారంతో ముగిశాయి. ఫలితాలు వెల్లడించడానికి నెల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు.
2011 గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఇంటర్వ్యూలు పూర్తి చేసి నియామకాల జాబితాను ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ సమర్పించనుంది.
నెలలో 2011 ‘ఏపీ గ్రూప్ 1’ ఫలితాలు!
Published Sun, Sep 25 2016 4:06 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement