సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.
కరీంనగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మరో రెండువారాల్లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల్లో 640 సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఆ తర్వాత విద్యుత్‌శాఖలో మూడువేలకుపైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కరీంనగర్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరగోపాల్ కమిటీ సిలబస్ మార్పుపై చేసిన సిఫారసులు ఇంకా తన పరిశీలనకు రాలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు.