హైదరాబాద్: గ్రూప్స్ సిలబస్‌ను ఈనెల 31న ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూపు-1,2,3,4 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను నోటిఫికేషన్లతో కాకుండా ముందుగానే ప్రకటించేందుకు సర్వీసు కమిషన్ చర్యలు చేపట్టింది. గ్రూప్స్ సిలబస్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలను జోడించి వూర్పులు చేసినందున ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సిలబస్‌లో ప్రిపేర్ అయ్యేందుకు సవుయుం కావాలని అభ్యర్థులు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తావుని సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.