'ఆ విధానాలకు TSPSC లో స్థానం లేదు' | Face to Face with TSPSC Chairman Ghanta Chakrapani | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 19 2014 4:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

:గత ఏపీపీఎస్సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విధానాలకు టీఎస్పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్)లో స్థానం ఉండదని చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకున్నట్లుగానే నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఆసన్నమైందన్నారు. దేశంలో బెస్ట్ సర్వీస్ కమిషన్ ప్రకారం టీఎస్పీఎస్సీ విధివిధానాలు ఉంటాయని చక్రపాణి తెలిపారు. అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల కంటే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. పూర్తి నిష్పక్షపాతంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్పీఎస్సీ పనిచేస్తోందన్నారు. ఉద్యోగులు, కార్యాలయాల విభజనకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందన్నారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను క్యాలండర్ ప్రకారం నిర్వహిస్తామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement