తెయూ(డిచ్‌పల్లి) : సమైక్యవాద పాలకులు తెలంగాణ అస్థిత్వాన్ని అణగదొక్కారని, తెలంగాణ విషయంలో చరిత్రలో చాలా తప్పులు జరిగాయని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఐసీఎస్‌ఎస్‌ఆర్, తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ‘సామాజిక శాస్త్రాలు- ఈనాటి స్థితి’ (స్టేటస్ ఆఫ్ సోషల్ సెన్సైస్)’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సు రెండో రోజు సమావేశంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రసంగించారు.
సామాజిక శాస్త్రవేత్తలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలపై తప్పులు దొర్లకుండా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజిక శాస్త్రాల పరిశోధనల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. సామాజిక శాస్త్రవేత్తలపై ఈ అంశంలో గురుతర బాధ్యత ఉందన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.
ఈ హామీల అమలు ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పోరాట చరిత్ర, నిజాం రాజుల పాలన, సమ్మక్క-సారక్కల చరిత్ర భావితరాలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వలసలు, వ్యవసా యం, చ రిత్ర, సామాజిక , ఆర్థిక పరిస్థితులపై సమగ్రమైన పరిశోధనలు మరింత లోతుగా జరుపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.
తెలంగాణ అస్థిత్వాన్ని అణగదొక్కారు
Published Thu, Jul 3 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement