గవర్నర్‌కు టీఎస్‌పీఎస్సీ వార్షిక నివేదిక | TSPSC Chairman Ghanta Chakrapani Submits Annual Report To governer | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు టీఎస్‌పీఎస్సీ వార్షిక నివేదిక

Published Thu, Jan 19 2017 3:22 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

గవర్నర్‌కు టీఎస్‌పీఎస్సీ వార్షిక నివేదిక - Sakshi

గవర్నర్‌కు టీఎస్‌పీఎస్సీ వార్షిక నివేదిక

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వార్షిక నివేదికను రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు అందజేసింది. కమిషన్‌ చైర్మన్‌ ఘంటాచక్రపాణి నేతృత్వంలో సభ్యులు గవర్నర్‌ను గురువారం కలిసి నివేదిక అందజేశారు. అనంతరం చక్రపాణి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాము నిర్వహించిన పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు, వాటితోపాటు మిగతా మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడాది కాలంలో సాధించిన ప్రగతికి సంబంధించిన అన్ని వివరాలను నివేదికలో పొందుపరిచామన్నారు. తమ పనితీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మరింత ప్రగతిశీలంగా పురోగామి దిశగా పని చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారన్నారు.
 
టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 6 వేల ఉద్యోగాలిచ్చామని, ఇంకా కొన్ని ఇంటర్వ్యూ దశలో ఉన్నాయని ఆయన వివరించారు. అవి కూడా పూర్తి అయితే సుమారు ఆరు వేల ఉద్యోగాలను రెండున్నరేళ్లలో ప్రకటించినట్లవుతుందని చెప్పారు. గ్రూప్‌ -2 కు సంబంధించిన ఫైనలైజేషన్‌ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే ఫలితాలను కూడా ప్రకటిస్తామన్నారు. గ్రూప్‌ -2 కంటే ముందుగా గ్రూప్ -1, 2011 రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. వాటి ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement