
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమాన్ని స్మరించుకోవడంతో పాటు దేశ అభ్యు న్నతికి పునరంకితం కావాల్సిన రోజన్నారు. ఎన్నో తరాల దేశ భక్తుల నిస్వార్థ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశభక్తులందరినీ స్మరించుకునే సమయమని గవర్నర్ అన్నారు.
నేడు రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు
రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్షాబంధన్ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment