ఎంసెట్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎంసెట్ నిర్వహణ హక్కు తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుందన్న ఆ సర్కారు వాదనకు గవర్నర్ నరసింహన్ ఒప్పుకొన్నారన్న వానదలో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని మాత్రమే గవర్నర్ సూచించనట్లు తెలిపాయి.
అయితే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం గవర్నర్ నరసింహన్ను కలిసి వచ్చిన తర్వాత.. తమ వాదనతో గవర్నర్ ఏకీభవించినట్లు చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తమకే ఉంటుందని, కావాలంటే ఆంధ్రప్రదేశ్కు కూడా తామే నిర్వహిస్తామని అన్నారు.
తెలంగాణ వాదనకు గవర్నర్ ఒప్పుకోలేదు!
Published Sat, Jan 3 2015 3:25 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement
Advertisement