హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం:పొన్నాల
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రడ్డకు, చెస్ట్ ఆస్పత్రిని అనంతగిరికి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు శనివారం పాద యాత్ర నిర్వహించనున్నట్లు పొన్నాల చెప్పారు. సచివాలయ మార్పును ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు వినతిపత్రం ఇవ్వనున్నామని పొన్నాల తెలిపారు.
హైదరాబాద్ చెత్తసిటీ అంటూ సీఎం మాట్లాడటం సరైందికాదన్నారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడులకు అనుకూలమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని పొన్నాల విమర్శించారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ అవార్డును కేటీఆర్ తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందునే హైదరాబార్ అభివృద్ధి గురించి చెబుతూ కేసీఆర్ ప్రజలని మభ్యపెడుతున్నారని పొన్నాల తెలిపారు.