సాక్షి, న్యూఢిల్లీ: యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి (యాక్సిడెంటల్ సీఎం) అయిన కేసీఆర్ ఒక అబద్ధాల కోరు అని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని, మోసపూరిత విధానాలతో వచ్చే ఎన్నికల్లోనూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్‌లోని అంతర్గత రాజకీయాలను అధిగమించేందుకు ఫ్రంట్ పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదనను డీఎంకే నేత స్టాలిన్ ఆదిలోనే తిప్పికొట్టారని, కాంగ్రెస్‌యేతర ప్రత్యామ్నాయంతో దేశా నికి ఉపయోగం లేదని స్టాలిన్ సహా మమతా బెనర్జీ కూడా తేల్చి చెప్పారన్నారు.
కేసీఆర్ బీజేపీకి, ప్రధాని మోదీకి కోవర్టుగా మారి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. నవీన్ పట్నాయక్, సీతారాం ఏచూరి లాం టి నేతలు ఇప్పటికే కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదనను తిప్పికొట్టారని గుర్తుచేశారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment