
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో... ఇంటర్ పరీక్షలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం, దానికి కారణాలు, పరిష్కారాలపై ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. విద్యాశా ఖ పరిధిలో భవిష్యత్‌లో తలెత్తబోయే సమస్యలు, అంశాలు, పరిష్కారాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు విడిగా సమ యం ప్రకటించడానికి కారణాలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో వస్తున్న సమస్యలు, పరిష్కారాలపైనా మాట్లాడారు. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలు, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్లు, దానికి దారితీసిన కారణాలు తదితర అంశాలపైనా గవర్నర్, సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడినట్టుగా తెలిసింది.