రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ విందు | governor narasimhan hosts dinner for president pranab mukherjee in rajbhavan | Sakshi
Sakshi News home page

రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ విందు

Published Tue, Dec 29 2015 8:00 PM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

governor narasimhan hosts dinner for president pranab mukherjee in rajbhavan

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్భవన్లో విందు ఇచ్చారు. శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన ప్రణబ్కు గవర్నర్ మర్యాదపూర్వకంగా ఈ విందు ఏర్పాటు చేశారు.

ఈ విందు కార్యక్రమానికి  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆయన సతీమణి శోభాతో హాజరు కాగా,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు,  ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు,  తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, సీపీఐ నారాయణ, ఇరు రాష్ట్రాల డీజీపీలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరందర్నీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి కలిశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement