
సాక్షి, విజయవాడ: రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాల వసూళ్ల కేసులో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్‌భవన్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. కాగా ఈ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులు సుమతి ఏజెన్సీకి చెందిన సూపర్‌వైజర్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే వీరితో పాటు బయటి వ్యక్తుల పాత్ర ఎమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment