
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతలు పాలు పొంగించి సంబరాల్లో పాల్గొన్నారు. తమిళి సై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరికి మరింత సంతోషాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తమిళనాడు, హైదరాబాద్‌ల మధ్య టూరిజం అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో పురాతన ప్రకృతి సంపద బాగుందని, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో దీనిని మరింత ముందుకు తీసుకువెళతామని పేర్కొన్నారు. రాజభవన్‌లో ఇకనుంచి నెలకు ఒకసారి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని తమిళిసై స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment