గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ ఆసుప్రతులు మెట్రో నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ వైద్యసేవలను అందించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు.
కార్పోరేట్ వైద్యం అన్నివర్గాల వారికి అందేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నరసింహన్ సూచించారు. ఇరవై వేల కార్నియా మార్పిడిలతో రికార్డు సృష్టించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన బృందాన్ని గవర్నర్ సన్మానించారు. కంటికి చికిత్స చేసి చూపునివ్వడం అంటే ప్రపంచానికి వెలుగునివ్వటమే అని ఆయన అన్నారు.