
‘చంద్రబాబు మూడేళ్ల పాలనలో 300 హత్యలు’
కర్నూలు: కర్నూలు జిల్లాలో హత్యా రాజకీయాలు ఎక్కువవుతున్నాయని గవర్నర్ నరసింహన్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడేళ్ల పరిపాలనలో 300 హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హత్యలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. శాంతిభద్రతలు రాష్ట్రంలో ఏ విధంగా క్షీణించాయో గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పనిచేస్తున్నారని, అందుకే శాంతిభద్రతలు లోపిస్తున్నాయని మండిపడ్డారు.