సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలకు ఏపీ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత విజయాలను సమీక్షించి, నవ సంకల్పాలతో భవిష్యత్ నిర్మించుకొనేందుకు వచ్చిన శుభ సమయమే కొత్త సంవత్సరమని ఆయన అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధిని కొనసాగించేందుకు మళ్లీ తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో గడపాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. పాత సంవత్సరంలో మంచిని కొనసాగిస్తూ నూతన సంవత్సరంలో కూడా అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నూతన ఉత్తేజంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
హోంమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరమంతా అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అలీ పేర్కొన్నారు.
గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
Published Tue, Jan 1 2019 5:42 AM | Last Updated on Tue, Jan 1 2019 5:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment