గవర్నర్‌తో ఏపీ, తెలంగాణ ప్రతినిధుల భేటీ | Governor meet Ministers from Andhra Pradesh, Telangana | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో ఏపీ, తెలంగాణ ప్రతినిధుల భేటీ

Published Wed, Feb 1 2017 2:43 PM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

Governor meet Ministers from Andhra Pradesh, Telangana

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ, తెలంగాణ ప్రతినిధుల కమిటీ సమావేశం ముగిసింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ పాల్గొనగా ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. చర్చలు సామరస్య పూర్వకంగా జరిగాయని, కోర్టులు, అధికారుల కంటే గవర్నర్‌ సమక్షంలో సమస్యలు పరిష్కరించుకోవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నామని యనమల పేర్కొన్నారు.
 
రెండుసార్లు హైదరాబాద్‌లో భేటీ అవుతామని, తర్వాతి సమావేశం అమరావతిలో ఉంటుందని చెప్పారు. తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థలు, ఉద్యోగుల సమస్యలు, హైకోర్టు విభజనతో పాటు అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9న మరోసారి సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement