
తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్‌కు బయల్దేరిన ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ నైవేద్య ప్రసాదం
ఖైరతాబాద్: శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలి పూజ నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. అనంతరం సాధారణ భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
తాపేశ్వరం నుంచి బయల్దేరిన ఖైరతాబాద్ లడ్డూ..
ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు సమర్పిస్తున్న 500కిలోల లడ్డూ ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో నగరానికి బయల్దేరింది. తాపేశ్వరంలో ప్రత్యేక పూజలు, ఊరేగింపు మధ్య బయల్దేరిన లడ్డూ ప్రసాదం సోమవారం గవర్నర్ తొలిపూజ అనంతరం మహాగణపతికి నైవేద్యంగా సమర్పించననున్నట్లు మల్లిబాబు తెలిపారు.